all

Wednesday, November 21, 2012

హెయిర్ ఫాల్ ను అరికట్టే వెజిటేరియన్ ఫుడ్...

చాలా మంది శాఖాహారులు వెజిటేరియన్ ఫుడ్స్ చాలా బలహీనమైనవి అనే దురభిప్రాయం కలిగి ఉంటారు. అయితే శాఖాహారం జుట్టు సమస్యలు అరకడుతుందని చాలా మందికి తెలియదు. అంతే కాదు వెజిటేరియన్ ఫుడ్ గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయని అందరికి తెలిసిన విషయమే. వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉంటారు.
కొన్ని పరిశోధనల ప్రకారం శాఖాహారం తీసుకొనే వారి జుట్టు స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. ఈ ఆధునిక జీవన విధానంలో చాలా మంది వ్యక్తులు వివిధ రకాల పరిస్థితుల కారణంగా వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం వంటి జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యమైన జుట్టు వ్యక్తి వ్యక్తిగత ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లైతే జుట్టు కూడా ఆరోగ్యంగా..మంచి షైనింగ్ తో మెరుస్తూ స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు తప్పనిసరిగా అది కేశాలపై ప్రభావం చూపుతుంది. దాంతో జుట్టు రాలడం, సన్నగా వికృతంగా మారడం వంటివి జరుగుతాయి.
అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. శాకాహారంలో ఎక్కువ ఆరోగ్యానికి సరిపడే సద్గుణాలు కలిగి ఉండుట వల్ల శాఖాహారం తీసుకోవడం మంచిది. అందులో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందమైన కురుల పెరుగుదలకు సహాపడుతుంది. గ్రీన్ వెజిటేబుల్స్ లో విటమిన్స్ సి అధికంగా ఉండటం వల్ల జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. అలాగే సోయా బీన్స్ మరియు కాటేజ్ చీజ్ తగినంత పోషకాలను అందిస్తుంది. దాంతో జుట్టుకు కావల్సినన్ని పోషకాలు అందుతాయి. కొన్ని మినిరల్స్, జింక్ అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కురుల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చుండ్ర, ఇతర సమస్యల నుండి జుట్టును సంరక్షిస్తుంది.
కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు కోసం కొన్ని ఆరోగ్యవంతమైన ఆహారాలు మీకోసం...

కురులు ఆరోగ్యానికి ప్రోటీన్స్ చాలా అవసరం. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తరచూ తీసుకోవడం వల్ల కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడి. హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది. కాబట్టి అధిక పోషకాలను అందించే సోయా బీన్స్ ను ఆహారం తీసుకోవడం మంచిది.


కురులు పొడవుగా, త్వరగా పెరగడానికి బాగా సహరించే అద్భుతమైన ఆహారం బాదం. ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు బాదాంలో ఉన్న క్యాల్షియం జుట్టు మెదళ్ళకు కావల్సినంత శక్తినందిస్తుంది. ఇంకా ఇందులో ఉన్న ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ కురులను సిల్కీగా.. స్మూత్ గా ఉండేలా చేస్తుంది.



బ్రౌన్ రైస్ లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ మరియు అధిక శాతంలో ఫైబర్ కలిగి ఉంటుంది. అంతే కాదు విటమిన్ బి కూడా అధికంగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ కురుల ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి పాలిష్ బియ్యం కంటే ఎర్రబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.



ముంగా గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, మస్టర్డ్ లీవ్స్ వంటివాటిలో ఐరన్ కంటెంట్ అధిక శాతంలో ఉంటుంది. ఐరన్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కురులు బలంగా, పెరుగుతాయి. ఇంకా గ్రీన్ లీఫీలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది.



సిట్రస్ పండ్లతో చెప్పలేనంత విటమిన్ సి అందుతుంది. ఈ పండ్లు పుల్లగా ఉండి, కొల్లేజెన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కొల్లేజెన్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.



కాటేజ్ చీజ్ లో కావల్సినన్ని ప్రోటీన్స్, కాల్షియం ఉంటాయి. ఈ ప్రోటీన్స్ హెయిర్ డ్యామేజ్ ను అరికట్టి జుట్టును స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది.



ఓట్స్ ఆరోగ్యానికి ఎంత ఆరోగ్యకరమో... కురులకు ఆరోగ్యానికి కూడా అంతే ఆరోగ్యం ఎందుకంటే ఇందులో ఉన్న ఉన్న మినిరల్స్(మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి) శరీరంలో బాగా కలిసిపోయి, శక్తిని ఇస్తాయి.



చిక్కుడు జాతికి చెందిన ఈ గింజల్లో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇవి చుండ్రు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. తల మాడుకు ఇవి యాంటి డాండ్రఫ్ రెమెడీగా పనిచేసి. కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహకరిస్తాయి.

No comments: