విటమిన్లు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.వివిధ రకాలైనటువంటి సోపులకు సంబంధించిన చాలా ప్రకటన్లో మీ చర్మానికి మెరుపు, సొగసు తెచ్చే ఫలానా విటమిన్లు ఉన్నాయి అని ఉంటుంది. అందమె ఆనందం.. ఆరోగ్యమే అందం... ‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ జామ్ ఫరెవర్'' ఇవన్నీ మంచి ఆరోగ్యం వున్నప్పుడే లభిస్తాయి. అందానికి మొదటి పెట్టుబడి ‘ఆరోగ్యం'. ఈసురోమని మనిషి ఉంటే.. బుగ్గల నిగారింపు లెక్కడా? విటమిన్లు చర్మానికి నిజంగా ఎంత మేలు చేస్తాయన్నది సరే.. ఇంతకీ అందం పెరగాలంటే ఏయే విటమిన్లు వాడాలో చూద్దాం.
విటమిన్ ఎ: ఇది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మం ముడతలు పడి అందవిహీనంగా మారితే మేకప్ తో దానిని కప్పి వుంచడం సరియైన విధానం కాదు. రెటినాయిడ్స్ ఉన్న సౌందర్య సాధనాలు వాడటం ద్వారా చర్మం యవ్వనాన్ని రక్షించవచ్చు. రెటిన్ ఎ, రెనోవా ఉత్పత్తులో విటమిన్ ఎ వినిగియోగించడం జరుగుతుంది.
అయితే వీటిని వాడటం వల్ల కొంతమందికి చర్మం ఎర్రగా కంది పోవటం, ఇతర చర్మ సమస్యలు ఎదుర్యే అవకాశం ఉంది. ఇటువంటి వారికి విటమిన్ ఎ ని రెటినాల్ రూపంలో వాడిన ఉత్పత్తులు ఉపయోగకరమైనవి. దీనిని వాడి తయారు చేసిన సౌందర్య ఉప్పత్తుల మీద విటమిన్ ఎ వాడినట్టుగా ప్రకటించరు. రెటినాల్ వాడిన ఉత్పత్తులు చర్మానికి హాని చేయకుండా పనిచేస్తాయి.
విటమిన్ బి: ఇది చర్మంలో తేమని కాపాడి మెరిసేలా చేస్తుంది. విటమిన్ బి-3(నియాసిన్), విటమిన్ బి-5(ఫాంటోథెనిక్ యాసిడ్) ఇవి రెండు చర్మానికి తేమని కాంతిని ఇచ్చే పలు మాయిశ్చైజర్ ఉత్పత్తుల్లో వాడుతున్నారు. విటమిన్ ఇతో కూడిన బి5 చర్మానికి తేమని సమకూర్చి చర్మాన్ని రక్షిస్తుంది. బాగా సున్నిత చర్మానికి కూడా దీనిని వాడవచ్చు.
విటమిన్ సి: సూర్యరశ్మి నుంచి చర్మానికి హాని కలుగకుండా కాపాడుతుంది. దీనిలో యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కలుషిత వాతావరణం కారణంగా చర్మం కాంతిని కోల్పోయేలా చేసే ఫ్రీరాడికల్స్ నుంచి ఇది రక్షణ ఇస్తుంది. సిగరెట్ పొగ, సూర్యరశ్మిలోని ఆల్ట్రా వయొలెట్ కిరణాలకు చర్మం పాడవకుండా రక్షిస్తుంది. దీనిని సన్ స్ర్కిన్ కలిగిన సౌందర్య ఉప్పత్తుల్లో వాడుతున్నారు. ముఖ్యంగా సబ్బుల్లో ..
విటమిన్-డి: రోజూ సాయంత్రంపూట ఎంత కాంతి పడేలా వుంటే చర్మానికి ‘డి' లభిస్తుంది. నీరసం... కాల్షియం లోపం. దీనివల్ల పోతాయి. పూర్తిగా ఉడికించిన మియ్యం, కూరలు తింటే శరీరానికి కొత్త శక్తి అందమూ వస్తాయి. కారణం విటమిన్లు నశించకపోవడమే.
విటమిన్ ఇ: ఇది పొడిగా, గరుకుగా ఉన్న చర్మాన్ని సున్నితంగా మార్చే క్రమంలో ఉపకరిస్తుంది. విటమిన్ ఇ (ఆల్ ఫా టోకో ఫెరల్) అనే యాంటి ఆక్సిడెంట్ చర్మానికి తేమని సమకూర్చే సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడుతున్నారు. చర్మ సౌందర్య విషయంలో విటమిన్ ఇ అధ్బుతాలు సృష్టిస్తాయని చాలా మంది అంటుంటారు. చర్మాన్ని తేమగా ఉంచి కాంతి వంతంగా ఉంచడంలో మాత్రం ఇది తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

No comments:
Post a Comment