వయసు పెరుగుతున్నా అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. అయితే, ఇందుకోసం ఉపయోగించే ప్రాడెక్ట్స్ లో కెమికల్స్ ప్రభావం ఏమిటో ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే, హెయిర్ డయిస్ లోని కెమికల్స్ యమడేంజర్ అని తేలిపోయింది. కాబట్టి హెయిర్ డై చేయించుకోవాలనుకున్నప్పుడు తస్మాత్ జాగ్రత్త..
జుట్టు నెరవడం ఓల్డ్ ఏజ్ కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా జుట్టు నెరవడంలేదు. ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్ డైయిస్ లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే, కోట్లాది మంది వాడుతున్న కెమికల్ రసాయనాలతో తయారయ్యే హెయిర్ డయిస్ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్నలకు హెయిర్ డయిస్ చాలా ప్రమాదకరమనే జవాబు వస్తుంది.. హెయిర్ డయిస్ ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించకుండా విచ్చలవిడిగా కెమికల్ ని ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హెయిర్ డయిస్ ద్వారా ఏటా కోట్లాది డాలర్ల బిజినెస్ జరుగుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు..
అది బాలనెరుపుకావచ్చు, వృద్ధుల ముగ్గుతల కావచ్చు. ఎక్కడా ఎవరికీ తెలియనంతగా యవ్వనశోభతో కేశాలు నిగనిగలాడుతుంటాయి. దీంతో ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే ఆడామగా మార్కెట్ కి వెళ్ళి హెయిర్ డయిస్ కొనేస్తున్నారు. అవి ఏమేరకు సురక్షితమన్నది ఆలోచించడంలేదు. ఫలితంగానే ఇంగ్లండ్ లోని ఓ 38 ఏళ్ల మహిళ కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే… హెయిర్ డయిస్ వాడితే కోమాలోకి వెళ్ళిపోతారా ? మెదడు పనిచేయడం ఆగిపోతుందా ? బతికిబట్టకట్టినా మతిస్థిమితముండదా ? హెయిర్ డయిస్ కిల్లర్ కెమికల్సేనా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హెయిర్ వేసుకోగానే ఎలర్జీ వచ్చినా, లేదా అంతకంటే ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కనిపించినా అదంతా హెయిర్ డైలోని రసాయనాలవల్లనే అని గుర్తించాలి. అనేక కంపెనీల హెయిర్ డయిస్ ప్రాడెక్ట్స్ లో PPD అనే రసాయనం ఉంటుంది. దీని పూర్తి పేరు – పారా ఫినైలైన్ డయామిన్ . ఈ రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. 99 శాతం హెయిర్ డయిస్ లో ఈ కెమికల్ ఉంటోంది. ఇది అత్యంత ఘాటైన కెమికల్.
మరి ఇంతటి ప్రమాదకరమైన రసాయనంపై నిషేధం లేదా? ప్రపంచదేశాలు దీన్ని యథేచ్ఛగా ఎందుకు వాడనిస్తున్నాయి ? నిజమే, పిపిడీ అత్యంత ప్రమాదకరమైనదన్న సంగతి తెలుసు. అయినా దీనిపై ఎక్కడా నిషేదం లేదు. ఈ రసాయనాన్ని కలర్ ఫిల్మ్ డెవలప్ మెంట్ లోనూ, రబ్బర్ ఆక్సిడేషన్ లోనూ వాడుతున్నారు.
జట్టుకు రంగేసుకోవడం ఇప్పుడు ఓ సాధారణమైన చర్యగా మారిపోయింది. సునాయాసంగా కేశాలకు రంగు పట్టించుకునే అవకాశం రావడంతో క్రేజ్ పెరిగిపోయింది. జుట్టు రంగు ఏమాత్రం మారినా వెంటనే హెయిర్ డై వాడేస్తున్నారు. మనం వాడే హెయిర్ డైలో విషతుల్యమైన పీపీడీ ఉన్నట్టు ఎలా గుర్తించడం ? హెయిర్ డై ప్యాక్ లో రెండు సీసాలున్నాయా ? అయితే, తప్పనిసరిగా అందులో ఒకటి పీపీడీ అయి ఉంటుంది పీపీడీ తెల్లగా ఉండే ద్రావకం.. దీని గురించి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే.. పీపీడీ వల్ల ఆస్తమా రావచ్చు. కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడవ్వొచ్చు. సెలూన్లలో పనిచేసేవారు రోజూ పీపీడీ ఘాటు పీల్చడంవల్ల త్వరలోనే అస్వస్థులు కావచ్చు. అయితే, హెయిర్ డయిస్ కంపెనీలు మాత్రం తామ ఉత్పత్తుల వల్ల హాని కలగదనే అంటున్నాయి. మరి ఇదే హెయిర్ డయిస్ లోని రసాయనాలు చేస్తున్న మాయాజాలం మాటేమిటి?

No comments:
Post a Comment