all

Wednesday, November 21, 2012

కళ్ల అందాన్ని మరింత రెంటింపు చేసే ఐలైనర్‌..!

ఎటువంటి హాని లేకుండా హాయిగా అందంగా కనిపించాలనే ప్రయత్నంలో ఆహార్యంగా ఎన్నో మార్పులు చేసుకుంటారు మహిళలు. అయితే అందుకు రకరకాల సౌందర్య సాధనాల్ని వాడుతుంటారు. సౌందర్యానికి ఉపయోగించి వస్తువుల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. కళ్ళకు మేకప్ వేసుకునే సమయంలో ఐలైనర్ తప్పనిసరి. కళ్ల అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసే ఐలైనర్‌ ప్రత్యేకతే వేరు. అందుకు కొన్ని బేసిక్స్ తెలిసుంటే చాలు మహిళల అందమే మారిపోతుంది. ఐలైనర్స్ వెరైటీ కలర్స్ లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడంలో కొన్ని చిట్కాలు మీ కోసం...
1. ఐలైనర్ అప్లై చేయాలనుకొనేవారు అందుకు వారి చర్మ ఛాయకు తగ్గ కలర్ ను, కను రెప్పలకున్న హెయిర్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి. సున్నితంగా ఉన్న పెన్సిల్ లైనర్ కు మాచ్ అయ్యే ఐలాష్ ను నేచురల్ లుక్ ను అందిస్తుంది. ముఖ్యంగా డార్క్ కలర్ బ్లాక్ ఐలైనర్ చాలా అందంగా కనబడుతుంది. షేడ్ కూ ఐలాష్ కు తగ్గ షేడ్, బేస్ వేసుకోవడం వల్ల అందంగా కనబడుతుంది. పేల్ స్కిన్ ఉన్నవారు చర్మ పేల్ గా ఉన్నవారు బ్రౌన్ కలర్ లేదా చార్కోల్ గ్రే కలర్ బాగా నప్పుతాయి.
2. వేసుకునే దుస్తుల రంగుని బట్టి కనురెప్పల మీదా అదే వర్ణంలోని పౌడర్‌ను తక్కువగా అద్దాలి. దానితో కళ్లు అందంగా కనిపిస్తాయి. ముందురోజు రాత్రి ఆలివ్‌ నూనెను కళ్లకు రాయండి. కళ్లకు మేకప్‌ వేసుకునే సమయంలో ఐలైనర్‌ తప్పనిసరి.
How Wear Eye Liner

3. కళ్ల కింద నల్లని వలయాలుంటే ఐలైనర్‌ వాడకపోవడం మంచిది. బ్రష్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. అజాగ్రత్త చేస్తే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది.
4. ఐలైనర్ మరీ కళ్లకు దగ్గరగా వేయకూడదు. ఎందుకంటే రసాయనాల ప్రభావం వల్ల కళ్లకు హాని కలుగుతుంది. కళ్లు మంటపుట్టి, నీళ్లు కారతాయి. అంతేకాదు.. కన్నీటి నాళాలు మూసుకుపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు రసాయన రహిత సహజ ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి.
5. కాటుక లేదా ఐపెన్సిల్‌ వంటి ప్రత్యామ్నాయాలనూ ఎంచుకోవచ్చు. ఒకవేళ ఐలైనరే వాడుతుంటే.. ప్రతి మూణ్నెల్లకోసారి మార్చడం మంచిది. అలాగే మస్కారా వాడిన ప్రతిసారీ అందులో బ్యాక్టీరియా చేరుతుంది. ఫలితంగా కళ్లకు ఇన్‌ఫెక్షన్ల సమస్య.
6. ఇలాంటి సమస్యల్ని నివారించాలంటే.. వాటిని భద్రపరచడంలో జాగ్రత్త పాటించాలి. మస్కారా, ఐలైనర్‌ లాంటి ఉత్పత్తుల్ని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఏ కారణంగానైనా అవి ఎండిపోతే వాటిల్లో నీళ్లు పోసి వాడుకునే ఆలోచనను మానేయాలి

No comments: