all

Wednesday, November 21, 2012

బియ్యం పిండితో ఫేషియల్ స్ర్కబ్--ముఖంలో అద్భుతమైన మార్పు

బియ్యం చిరు ధాన్యం. బియ్యం ప్రతి ఇంట్లో ఉండే ధాన్యాలలో ఒకటి. బియ్యాన్ని అన్నం వండుకుని తింటే ఆకలి తీర్చుతుంది. అయితే బియ్యం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుందంటున్నారు కొందరు బ్యూటీషియన్లు. సాధారణంగా ఇట్లో విరివిగా ఉపయోగించే ఈ బియ్యంలో సౌందర్య గుణాలున్నాయంటే ఆశ్చర్యమే కదా.. బియ్యంతో తయారు చేసుకొనే బ్యూటీ స్ర్కబ్బింగ్ చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడి, అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. బియ్యం పిండితో చేసుకొనే స్ర్కబ్బింగ్ వల్ల చర్మ రంద్రాలు తెరచుకొని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. అంతేకాదు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కాబట్టి బియ్యం పిండిని ఉపయోగించి మీరు ఇంట్లోనే స్ర్కబ్బింగ్ తయారు చేసుకొని సౌందర్యాన్ని పెంచుకోండి...

బియ్యం మరియు తేనె


తేనెలో అధికంగా యాంటిఆక్సిడెంట్స్ కలిగి ఉన్నందున చర్మానికి శుభ్రపరుచుటలో బాగా పనిచేస్తుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా మాత్రమే కాకుండా చర్మలో పేరుకున్న మురికిని తొలగొస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి మృత కణాలను తొలగిపోయేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని తాజాగ ఉంచి, మెరుపును అందిస్తుంది. అందుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని నీటిలో ఒక గంట సేపు నానబెట్టి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకొని దానికి తేనె మిక్స్ చేపి ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తర్వాత శుభ్రం చేయడంతో ముఖం కాంతి వంతంగా మారడమే కాకుండా ముఖం మీద మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.


బియ్యం పిండి-బేకింగ్ సోడా ఫేషిల్ స్ర్కబ్


ఆయిల్ స్కిన్ కలవారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ ఫేషియల్ స్ర్కబ్ ను వారానికి రెండు సార్లు వేస్తే చాలు. ఆయిల్ స్కిన్ తొలగిపోయి. సాధారణ, నేచురల్ స్కిన్ సొంత వుతుంది. అందుకు బియ్యం పిండికి కొద్దిగా బేకింగ్ సోడా చేర్చి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదినిముషాల తర్వాత ముంఖం అంతా స్ర్కబ్ చేయాలి. రెండు చేతులతో సర్క్రులర్ గా ఐదు నిముషాల పాటు రుద్ది చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగి ముఖంగా ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది.



టమోటో-బియ్యం పిండి ఫేషియల్ స్ర్కబ్


బియ్యంను అరగంట పాటు నీటిలో నానబెట్టి, అరగంట తర్వాత నానిన బియ్యంతో పాటు, టమోటోను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. టయోటో నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్ ఇది మచ్చలు, మొటిమలు, బ్లాక్ వైట్ హెడ్స్ తో పోరాడుతుంది. ముక్కు మీద బాగా రుద్దడం వల్ల అక్కడ ఉన్న మృత చర్మాన్ని తొలగించడమే కాకుండా ముఖం మీద ఉన్న మచ్చలను, బ్లాక్ హెడ్స్, వైట్స్ హెడ్స్ ను పూర్తిగా తొలగిస్తాయి.



బియ్యం- పంచదార ఫేషియల్ స్ర్కబ్


సాధారణంగా పంచదారను బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా వాటిలో ఉపయోగిస్తారు. పంచదార చర్మాన్ని శుభ్రపరచుటలో చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి నానబెట్టిన బియ్యానికి కొద్దిగా పంచదార కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమానికి కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.



బియ్యం, పాలు- ఆపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ స్ర్కబ్


ఇది ఒక అద్భుతమైన ఫేషియల్ స్ర్కబ్. రెండు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. చిన్న బౌల్లో బియ్యం పిండి మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ కొన్ని చుక్కలు, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తని పేస్ట్ లా తయారు చేసి ముఖం, మెడమీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత నీళ్ళు చల్లుకొని బాగా స్ర్కబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే స్వచ్చమైన చర్మ సౌందర్యం సొంత అవుతుంది.


No comments: