all

Wednesday, November 21, 2012

పచ్చడి లేని భోజనం... చేవ చచ్చిన జీవితం సేమ్ టు సేమ్. మనిషన్నాక కాస్త ఉప్పూకారం తగలాలి. చింతకాయ... మిరపకాయ కలిపి నూరిన కారం నషాళానికి అంటాలి. సిట్యుయేషన్‌ను ఢీ కొట్టాలంటే పచ్చడికి మించిన ఉత్ప్రేరకం లేదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లు ఇవి. లొట్టలకు తెరిచే వాకిళ్లు ఇవి.
కొబ్బరి పచ్చడి

కావలసినవి
పచ్చికొబ్బరి తురుము - కప్పు, పచ్చిమిర్చి - 2 (కట్ చేయాలి), పుట్నాలపప్పు - టేబుల్ స్పూన్ (వేయించాలి), పెరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత

పోపుకోసం...
జీలకర్ర - పావు టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టేబుల్ స్పూన్, ఎండుమిర్చి - 2, కరివేపాకు - రెమ్మ, నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారి
పుట్నాలపప్పును గ్రైండ్ చేసి, అందులో కొబ్బరి తురుము, పెరుగు, తగినంత ఉప్పు వేసి, పేస్ట్‌లా చేయాలి. (పలచగా ఉండటానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు). స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును కొబ్బరి మిశ్రమంలో కలపాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోసె, ఊతప్పంలలోకి రుచిగా ఉంటుంది.

పెసరపప్పు పచ్చడి

కావలసినవి:
పెసరపప్పు - కప్పు
ఎండుమిర్చి - 7
పచ్చిమిర్చి - 4
జీలకర్ర - అర టీ స్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత

పోపుకోసం... నూనె - టీ స్పూన్
ఆవాలు - టీ స్పూన్
శనగపప్పు - టీ స్పూన్
మినప్పప్పు - టీ స్పూన్

తయారి
తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పును మూడు గంటల సేపు నానబెట్టాలి. నీళ్లను వడకట్టి ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవడానికి కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేయాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక, ఆవాలు వేసి చిటపట మనిపించి దించేయాలి. ఈ పోపును పెసరపప్పు పచ్చడిలో కలపాలి.

టొమాటో పచ్చడి

కావలసినవి:
టొమాటోలు - 4 (ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు - 8, ఉల్లికాడలు (తెల్లని భాగం మాత్రమే తరగాలి) - పావు కప్పు ఉల్లికాడలు (పచ్చని భాగం తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 (నీళ్లలో నానబెట్టాలి), కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత

పోపుకోసం...
నూనె - టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి - 2,
మినప్పప్పు - టీ స్పూన్,
కరివేపాకు - రెమ్మ
తయారి: నీళ్లలో నుంచి తీసిన ఎండుమిర్చిని సన్నగా తరగాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక తెల్ల ఉల్లికాడలు, పచ్చ ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. దీంట్లో ఎండుమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. గరిటెతో టొమాటోలను బాగా చిదమాలి. చల్లారిన తర్వాత, మెత్తగా నూరుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును టొమాటో పచ్చడిలో కలపాలి.

పుదీనా - కొత్తిమీర పచ్చడి

కావలసినవి:
పుదీనా - కట్ట
కొత్తిమీర - కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి - 2
పంచదార - టీ స్పూన్
ఉప్పు - అర టీ స్పూన్
నిమ్మరసం - 2 టీ స్పూన్లు

తయారి:
కొత్తిమీరను కట్‌చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి పెట్టుకోవాలి. రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని, నిమ్మరసం కలపాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి రుచిగా ఉంచింతపండు పచ్చడి
కావలసినవి:
చింతపండు - 200 గ్రా.
బెల్లం - 300 గ్రా. (తరగాలి)
జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
నల్ల ఉప్పు - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్

తయారి:
ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పోసి, అందులో చింతపండు వేసి, స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. దాంట్లో బెల్లం, కారం, జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి, చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు ఉంచి, దించాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలిటుంది.


 

No comments: