ప్రస్తుతం ఇంట్లో వాళ్ళంతా యంత్రాల్లా యాంత్రికంగా పనిచేసుకుంటున్న రోజులివి. ఈ స్పీడు యుగంలో చేతులతో పనిచేసుకోవడం తగ్గిపోయి ప్రతి పనికీ యంత్రాలమీద ఆధారపడాల్సి వస్తోంది. అందుకే మధ్యతరగతి కుటుంబంలో కూడా వాషింగ్ మెషిన్ వాడకం ఎక్కువై బట్టలు ఉతకడం తగ్గిపోతోంది. కానీ అన్ని రకాల బట్టలు కలిపి మెషిన్‌లో వేస్తే కొన్ని దుస్తులు రూపురేఖలు మాయమైపోతాయి. ఇలాంటి ప్రమాదం లేకుండా ఏ దుస్తులు ఎలా ఉతికితే మన్నికగా ఉంటాయో తెలుసుకోవడం మంచిది కదా!
బట్టలు షింక్: బట్టలను శుభ్రపరచడానికి మిషన్ లో హాట్ వాటర్ ను సెలక్ చేసుకోవడం వల్ల అవి షింక్ అయ్యి చిన్న సైజులుగా మారిపోతాయి. అయితే బట్టలుకు అంటిన మరకులు, మరికి తొలగిపోతుంది. వేసుకునే దుస్తులే కాదు బెడ్‌షీట్స్, డోర్ కర్టెన్స్, మాట్స్, సోఫా, దివాన్ కుషన్ కవర్స్, ఇన్నర్స్ ఇవి కాకుండా వేసుకునే దుస్తులు వేటికవే విడివిడిగా ఉతకడం లేదా వాషింగ్ మెషిన్ వేయడం చేయాలి. మరొక ముఖ్యమైన విషయం తెలుపుబట్టలన్నీ విడిగానే వేయాలి. వేటితో కలిపినా మాసిపోయిన రంగుకు మారిపోతాయి. లేతరంగులు, ముదురు రంగులు విడివిడిగా వేయడం మంచిది. ఇక రంగు వెలిసిపోతాయనుకున్నవి వాషింగ్‌మెషిన్‌లో వేయకూడదు.
నూలు దుస్తులు: వీటిని వేసవిలో ప్రత్యేకంగా వాడుతుంటాం. అంతేకాదు, అందానికి హుందాతనానికి వీటికే పెద్ద పీట వేయవచ్చు. వీటిని మామూలుగా సబ్బు, సర్ఫ్ లతో ఉతికేయవచ్చు. అయితే కాటన్‌లో రంగు వెలిసేవి ఎక్కువగా ఉంటాయి. కాటన్ దుస్తుల్ని ఉతికేటపుడు వెంటనే తడిపే యకుండా ఒక మూల నీటితో తడిపి నలిపి చూడాలి. రంగు పోతుంటే చల్లని నీటిలో ముందుగా కొంచెం ఉప్పు లేదా వైట్ వెనిగర్ వేసి బట్టల్ని నానబెట్టాలి. రంగుని దిగనివ్వాలి. వీటిని ఉతికాక నీడలో ఆరేసి ఎక్కువ వేడితో ఐరన్ చేయవచ్చు.
పట్టు: ఇవి కొన్ని చాలా సున్నితంగా మరికొన్ని ఎక్కువ కాలం మన్నేవిగా ఉంటాయి. రంగులు కూడా అంతే కొన్ని ఉతికిన వెంటనే రంగు వెలిస్తే, మరికొన్ని చిరిగిపోయేవరకూ రంగు వెలవవు. కొన్ని రకాల సిల్కులు తప్ప మిగిలినవి చేతులతో నలిపి ఉతకవచ్చు. మదువైన మచ్చలు పడని షాంపూలను వాడవచ్చు. వీటిని ఉతికిన వెంటనే ఆరవేయకుండా ఒక టవల్‌లో కాసేపు చుట్టి ఉంచాలి. మందాన్ని బట్టి తక్కువ వేడితో ఐరన్ చేయాల్సి ఉంటుంది. ఈ చీరల్ని గంజిపెట్టి రోలింగ్ చేయకూడదు. ఇలా చేస్తే క్రిములు చేరే ప్రమాదం ఉంటుంది. వీటిని దాచేముందు డ్రై క్లీనింగ్ చేయించడం మంచిది. నేరుగా ఎండలో వేయకూడదు, రంగులు పోతాయి.
ఊలు: ఇవి అల్లిక దుస్తులు. ఇవి చలికాలం వాడదగినవి. వీటికి ఎండలో సాగే గుణం ఉంది. వీటిని ఇంట్లోనే ఉతకదలచుకుంటే గాఢత తక్కువ ఉన్న లిక్విడ్ డిటర్జెంట్‌ని వాడవచ్చు. ఉతికిన తరువాత వీటిని తీగమీద వేలాడదీయకుండా నేలమీద పరిచినట్టుగా ఆరవేయాలి. నైలాన్ పోగు కలిసినవైతే ఐరన్ అవసరం ఉండదు. కాటన్‌వైతేనే మరీ ఎక్కువ, తక్కువ కాని వేడిమీద ఐరన్ చేయాలి.
లినెన్: వీటిని ఉతకటం వాడుకోవటం కొంచెం కష్టమైన పని. దీనికి సాగే గుణం తక్కువగా ఉంటుంది. ముడతలు త్వరగా పడతాయి. రంగు త్వరగా పోదు. ఇది ఎంత వేడిని అయినా తట్టుకుంటుంది. వాషింగ్ మెషిన్‌లో ఉతికినా, చేత్తో పిండినా నీడలో ఆరవేయాలి. ఈ దుస్తుల్ని ఐరన్ చేసేటపుడు మడతలు అలాగే ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ మడతలు వేస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలో చినిగే అవకాశం ఉంది. ఇవి మరింత ఎక్కువ కాలం మన్నాలంటే తడిగా ఉన్నపుడే ఐరన్ చేసి తరువాత ఆరనివ్వాలి.
డెనిమ్: దీనిని వాడటం సులువు. దీనిని ఎంతగా ఉతుకుతుంటే అంతగా బాగుంటుంది. చల్లని లేదా గోరువెచ్చని నీటిలో ఉతకవచ్చు. దీనికి సబ్బుల్ని నేరుగా వాడటం లేదా ఎక్కువ సేపు నాననివ్వటం చేయకూడదు. తిరగవేసి ఆరవేయాలి. వాషింగ్ మెషిన్‌తో కూడా ఉతకవచ్చు. ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా నిర్వహణ ఉంటే ఇది త్వరగా పాడవదు.
జార్జెట్లు-షిఫాన్లు: ఎక్కువ వాడుకలో ఉన్న దుస్తులు ఇవన్నీ. పాలియస్టర్‌ని ఎక్కువ వాడినా పాడవటం ఉండదు కానీ దీనికి ఎండకి కరిగే గుణం ఉంటుంది. జార్జెట్, షిఫాన్, ఆర్గండి దుస్తులు అన్నీ మదువుగా ఉంటాయి. కొన్ని రకాల గంజితో కూడిన సిల్క్ షిఫాన్ దుస్తులు తడిపిన వెంటనే నీటి మరకలు పడతాయి. వీటిని గోరువెచ్చని నీటిలో సర్ఫ్ వేసి ఉతకాలి. ఎక్కువ నలపడం బాదటం చేయకూడదు. నీటిలో బాగా జాడించి నీరంతా పోయాక పరిచినట్టు ఆరవేయాలి. కాస్త తడిగా ఉండగానే ఇసీ చేయాలి.