all

Wednesday, November 21, 2012

శీతాకాలంలో తీసుకొనే జాగ్రత్తలు కురులకెంతో రక్షణ

శీతాకాలంలో చల్లని గాలుల వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మసౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదాలు, ముఖం, చేతులు, పాదాలు, కురులపై చలిగాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో చర్మం పొడి ఆరిపోయినట్లు ఉండటమే కాక దురద కూడా ఉంటుంది. పెదాలు పగులుతాయి. ముఖం మీద మచ్చలు ఏర్పడతా యి. పాదాల చివర పగుల్లు వస్తాయి.
hair care tips winter season

శిరోజాలు చిట్లిపోయి రాలిపోతాయి. చర్మానికి ఏర్పడే ఇటువంటి మార్పుల వలన చర్మ సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిగుసు ఎక్కి ముఖం అంధవికారంగా కనిపిస్తుంది. అందుకే చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు.
ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి.
1. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.
2. చలికాలంలో తలస్నానం చేసిన తర్వాత శిరోజాలక్రు డైయర్‌లను వాడకూడదు. మెత్తని తువాలుతో తుడుచుకుని గాలికి ఆరనివ్వాలి.
3. తలకు నూనె పట్టించేవారు ఈ కాలంలో ఎక్కువ సేపు నూనెను అలాగే ఉంచుకోకూడదు.
4. వారంలో కనీసం రెండు సార్లు ఆలివ్ ఆయిల్ పట్టించడం వలన శిరోజాలు సమృద్ధిగా పెరుగుతాయి. అలోవీరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి.
5. ఈ కాలంలో బయటికి వెళ్ళవలసి వస్తే తలకు ఊలు స్కార్ప్ కంటే శిల్కు స్కార్ప్‌లు వాడటం మంచిది.
6. ప్రతిరోజూ కండీషనర్ తప్పని సరిగా వాడాలి. ఒకసారి జుట్టుకు మాయిశ్చరైజర్లు వాడిన తర్వాతా చల్లని నీళ్లలో జుట్టును తడిపితే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అంతేకాక జుట్టును మరింత కాంతివంతంగా చేస్తుంది.
7. జుట్టును గాలికి వదిలివేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది. దీంతో చలిగాలులు వల్ల జుట్టు త్వరగా పాడయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు.
8. తరుచుగా జుట్టును శుభ్రపరచటం కన్నావారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే చాలు. సహసిద్ధంగా జుట్టును ఆరబెట్టుకోవడం మంచిది.
9. అతి శీతల, వేడి గాలుల రక్షణ కోసం తల చుట్టూ టోపీ లేదా మఫ్లర్ లాంటివి చుట్టుకోవాలి.
10. శీతాకాలంలో జుట్టుకు అసలు కెమికల్ ట్రీట్ మెంట్ చేయించవద్దు. కలర్ వేయడం లేదా స్ట్రీకింగ్, ఐరనింగ్ లాంటివి కూడా మానేయాలి. అప్పుడప్పుడు కొబ్బరినూనెతో మర్దనం చేయడం ద్వారా డ్రైనెస్ పోగొట్టుకోవచ్చు. జుట్టు చివరలు చిట్లడం లాంటి సమస్యను అధిగమించవచ్చు.

No comments: