షాపింగ్‌కి వెళ్ళి ఆఫర్ ఉన్నది కొనడం కాకుండా, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఇంటివద్దనే జాబితా తయారు చేసుకోండి. దీనివలన మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది.
అప్పుడే షాపింగ్ పూర్తి చేసుకొచ్చిన నీరజ నీరసంగా సోఫాలో కూర్చొంది. షాపింగ్ కోసం తిరిగిన నీరసానికి తోడు... బిల్లు చూసి భర్త నిరంజన్ ఏమంటారోనన్న ఆందోళన మరోవైపు. వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుండటంతో బిల్లు గురించి పట్టించుకోకుండా ఖర్చు పెట్టేసింది. ఇలా ఆఫర్ల మోజులో పడి కొనేవారు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఆఫర్లు, ప్రకటనలతో హోరెత్తిస్తారు. ఈ వ్యాపార సంస్థల వలలో పడకుండా, మీ బడ్జెట్‌లోనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం...
లిస్ట్ తయారుచేసుకోండి...
షాపింగ్‌కి వెళ్ళి ఆఫర్ ఉన్నది కొనడం కాకుండా, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఇంటివద్దనే జాబితా తయారు చేసుకోండి. దీనివలన మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది. అనవసర వస్తువులు కొనుగోళ్లకు దూరంగా ఉండగలుగుతారు. ఒకసారి మీ లిస్ట్ అయిన తర్వాత ఈ వస్తువులు ఎక్కడ తక్కువకు లభిస్తాయన్నది పరిశీలించండి. ఇందుకోసం ఆన్‌లైన్ లేదా వివిధ పేపర్లలో కంపెనీలు ఇస్తున్న ప్రకటనలు, ఇరుగుపొరుగువారి సమాచారంపై ఆధారపడొచ్చు. సాధారణంగా చాలా సంస్థలు పండగల సందర్భంగా వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొనే ముందు ఆ వస్తువు తయారయిన సమయం, ఎక్స్‌పైరీ డేట్‌ను తప్పక పరిశీలించండి. ఇలాంటి ఆఫర్లలో ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గరగా ఉన్న వస్తువులను వదిలించుకునే పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఇటువంటి ఆఫర్లు మనకు సంవత్సరం పొడుగునా కనిపిస్తూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ ఆఫర్ మిస్ అయితే మళ్ళీ మనకు ఇటువంటి అవకాశం రాదన్న ఆందోళన అవసరం ఉమ్మడిగా అయితే బెటర్: పండుగల సమయంలోనైతే ఆఫీసులోని సహద్యోగులు లేదా ఇరుగుపొరుగు వారు నలుగురైదుగురు కలిసి బల్క్‌లో తీసుకోవడం మంచిది.
కార్డులు ఉపయోగించండి:షాపింగ్‌లకు జరిపే లావాదేవీలన్నీ నగదు కంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది. పండగల సమయంలోనైతే కార్డుల ద్వారా చేసే షాపింగ్‌లపై బ్యాంకులు అదనపు రివార్డు పాయింట్లను అందిస్తుంటాయి. ఈ రివార్డు పాయింట్ల ద్వారా మీరు గిఫ్ట్ వోచర్లను పొందవచ్చు.

No comments:
Post a Comment