చిన్న వయస్సులోనే ఈ తరం అమ్మాయిలకు జుట్టు తెల్లబడిపోతోంది. వీటితో పాటు జుట్టు పలుచన కావడం, తెల్లబడటం, చిట్లిపోవడం సర్వ సాధారణం అయింది. చదువులు, ఉద్యోగాల రీత్యా వత్తిడి శరీరం పైనే కాకుండా మనస్సుపై ఎక్కువ గా పడుతుంది. దీని వల్ల పిన్న వయస్సు లోనే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజూ తీసుకునే ఆహారంలో తెలియకుండానే ఎన్నో రకాల రసాయనాలను తింటూ ఉంటాము. జుట్టు మెరవడం కోసం లేక రంగు మారడం కోసం ఉపయోగించే ప్రోడక్ట్స్ వల్ల జుట్టు అందంగా తయారయ్యేకన్నా ఊడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది.
షాంపూ, జెల్ ల వంటి వాటికీ దూరంగా ఉంటేనే మంచిది. వీటివల్ల అందంగా అనిపించినా రానూ రానూ కెమికల్స్ వల్ల జుట్టు మెరుపును కోల్పోయి నిర్జీవంగా, కళావిహీనంగా తయారువుతుంది. ప్రకృతి చికిత్సాలయంలో జుట్టుకు సబంధించిన సమస్యలతో బాధపడేవారికి స్టీమ్ బాత్, టబ్ బాత్ ల ద్వారా ఉపాశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జుట్టుకోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో సూచనలు, సలహాలు అందిస్తారు. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికీ సహజ సిద్ధమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురైతే ఇంటి వద్దనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
తినే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో సిట్రస్ ఉండే పండ్లను తీసుకోవాలి. దీని వల్ల జుట్టు మందగా ఉంటుంది.
శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. తేనె, రాగులు, సజ్జలు, వెజిటేబుల్ నూనె అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం తప్పని సరిగా యోగా చేయాలి
మాంసాహారం ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకున్నా అది బాగా ఉడికిన తర్వాత తినాలి. బయట దొరికే హెన్న ప్యాకెట్ లు వాడకుండా ఇంటిలోనే తయారు చేసుకుని వాడితే జుట్టుకు మంచిది. తలస్నానం చేసే ముందు రోజు రాత్రి గోరు వెచ్చని కొబ్బరినూనెతో మర్దనా చేయడం వల్ల కుదుళ్ళకు పోషణ అందుతుంది. దానివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
మెంతిపొడి తలకు పట్టించి అరగంట ఉన్నతర్వత తలస్నానం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా అవుతుంది.
పది రోజులకు ఒకసారి ఇంటిలో తయారు చేసిన మెంతిపొడి, ఉసిరికాయ పొడి, గోరింటాకు పొడిలో నిమ్మకాయ, పెరుగు కలిపి తలకు పెట్టుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఇవన్నీ పెట్టుకునే సమయం లేకపోతే పెరుగులో నిమ్మకాయ కలుపుకుని మూడు రోజులకు ఒకసారి వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు మెరుపును సంతరించుకుంటుంది.
నూనె పెట్టకపోవడం వల్ల జుట్టు పెరగక పోవచ్చు. అలాగే నెమ్మది నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారి, తెల్లబడే అవకాశం కూడా వుంది. నల్లగా ఉండాలంటే తరచూ వెంట్రుకలకు నూనె పెట్టాలి.
No comments:
Post a Comment