all

Wednesday, November 21, 2012

టీనేజ్ లో ఇబ్బంది పెట్టే మొటిమలు, బ్లాక్ వైట్ హెడ్స్..

అందం.. అందంగా ఉండాలంటే ఒక్క చర్మ ఛాయ మాత్రం ఉంటే సరిపోదు. ఎందుకంటే ... కలర్ ఎంత ఉన్న చర్మం ఆరోగ్యంగా లేకపోతే అందం అంతా వేస్టే. ప్రస్తుత కాలంలో జీవనశైలిలోని మార్పుల వల్ల మొటిమలు, మచ్చలు, బ్లాక్, వైట్ హెడ్స్ టీనేజీ అమ్మాయినలు వేధించే అతి సాధారణ సమస్యలు. మనకు ఉన్నటువంటి చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు ఏర్పడుతుంటాయి. ముందుగా ఆయిలీ స్కిన్‌ గల వారికి వచ్చే సమస్య గూర్చి తెలుసుకుందాం.
beauty tips remove pimples white blackheads

మొటిమలు: ఎకనీ : పిగ్‌మెంటేషన్‌ బ్లాక్‌ హెడ్స్‌ - వైట్‌ హెడ్స్‌ వస్తుంటాయి.
మొటిమలు: ఇవి టీనేజ్‌ నుంచి ముఖం మీద మొదలవుతాయి. చర్మంలోగల నూనెల తయారీ వల్ల ఇవి వస్తుంటాయి. ఈ మొటిమలు కలవారు మొటిమల కోసం వాడే సింపుల్‌ క్రీమ్సు కన్నా తీసుకునే ఆహార పదార్థాలలో నియమం పాటిస్తే వీటిని రాకుండా కొంత వరకు నివారించుకొనవచ్చును. ముఖ్యంగా వేపుడు పదార్థాలు, క్రొవ్వు పిండి పదార్థాలు, బిస్కెట్స్‌, స్వీట్స్‌, కేకులు, కోకోతో చేసేటటువంటి తినుబండారాలు, డ్రింక్స్‌ పూర్తిగా మానాలి. కాఫీ - టీ కూడా లిమిట్‌గా తాగాలి. ఎక్కువ తాగకూడదు.
తాజా ఆకు కూరలు, చేపలు, గ్రుడ్లు, పాలు, పళ్ల రసాలు, ప్రొటీన్స్‌ వాడడం మంచిది. ముఖాన్ని రోజుకు 4, 5 సార్లు మెడికేటెడ్‌ సోప్స్‌తో కడగాలి. వారానికి ఒక్కసారి ఆవిరి తీసుకోవాలి. ఈ సింపుల్స్‌ ఉంటే తల్లో చుండ్రు కూడా ఉంటుంది. కనుక తల ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి.
ఎకనీ :ముఖంపైన ఒక ఆకారమంటూ లేకుండా వచ్చే నల్లటి - తెల్లటి - ఎర్రటి మచ్చల్ని ఎకనీ అంటారు. ఈ మచ్చలు చర్మంలో గల ఆయిలీ స్వెట్‌ గ్లాండ్స్‌ ఎక్కువగా పని చేయడం వల్ల, తలలో చుండ్రు బాగా ఎక్కువయినపుడు, పోషకాహారలోపం వల్లకూడా మచ్చలు వస్తుంటాయి. ఎక్కువ పోషకాహారములు గల మీగడ తీసిన పాలు, తాజాకూరలు పళ్ళు తీసుకోవడం వల్ల ఇవి రాకుండా అరికట్టవచ్చును. వీటిని ఫేషియల్‌ ట్రీట్‌మెంటు ద్వారా పూర్తిగా అరికట్టవచ్చును.
పిగ్‌మెంటేషన్‌ ఇవి కూడా ముఖం మీద ఒక ఆకారంలో గోధుమ వర్ణం తెలుపు వర్ణం మచ్చలుగా ఏర్పడి ముఖానికి అందవికారాన్ని కలిగిస్తుంటాయి. పోషకాహారలోపమే దీనికి ముఖ్యకారణం. చర్మానికి కావలసిన మోతాదులో లేని విటమిన్‌ డెఫిషయన్సీ వల్ల వస్తుంది. ఇది స్త్రీలకు గర్బిణీ కాలమందు వచ్చినట్లయితే నిదానంగా డెలివరీ అయ్యాక వారు తీసుకునే బలవర్దకాహారం వల్ల తగ్గిపోతాయి. దానికి బ్యూటీపార్లర్స్‌లో చేసే మసాజ్‌ ద్వారా తగ్గుతుంది.
బ్లాక్‌ హెడ్స్‌ - వైట్‌ హెడ్స్‌: ఇవి ముఖంపైగల నూనె గ్రంధులు ఎక్కువగా పని చేయడం వల్ల నల్లని తెల్లని చుక్కలుగా వస్తుంటాయి. ముఖ్యంగా ముక్కుమీద, క్రింది పెదవికి క్రింద భాగాన, గడ్డం భాగాన, గడ్డం వద్ద బాగా ఏర్పడి అక్కడ చర్మం గరుకుగాను, రఫ్‌ గాను వుండి చూసేవారికి అసహ్యంగా వుంటుంది. ఆహారంలో గల క్రొవ్వు పదార్థాలనుతగ్గించి, వారానికి ఒక్కసారి ఆవిరి పట్టడం వల్ల బాత్‌ పౌడర్‌తో నలుగు పెట్టు కోవడం వల్ల తగ్గుతాయి. వీటిని బ్యూటీ పార్లర్స్‌లో ప్రత్యేకమైన సాధనం ద్వారా చక్కగా తొలగిస్తారు.
ఈ రకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఆయిలీ స్కిన్‌ వారికే వస్తుంటాయి. వాటి నన్నంటిని చక్కగా ఎదుర్కొని ముఖాన్ని నయనానందకరంగా తీర్చి దిద్దుకోవాలి. టీనేజ్‌లో ఈ ఆయిలీ స్కిన్‌ శాపమయినప్పటికి వయసు పెరిగే కొద్ది ఈ చర్మం ఒక వరంగా తోస్తుంది. ఈ ఆయిలీ స్కిన్‌ ముడతలు పడదు కనుక నెలకు ఒక్కసారి ఫేషియల్‌ చేయించుకోవడం వలన ఈ సమస్యలు అన్నీ కూడా నివారించబడతాయి.
 

 

 

No comments: