all

Wednesday, November 21, 2012

మసాలా దినుసులతో గుమగుమలాడే రుచులు...!

సాధారణంగా భారతీయు వంటగది సుగంధ పరిమళాలతో నిండి వుంటుంది. ఎందుకంటే మసాలా, స్పైసీ ఎక్కువగా వండుతారు. తింటారు కాబట్టి. మీరు కొత్తగా వంటగదిలోకి అడుగు పెడుతన్నా లేదా వంటల గురించి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నా ముఖ్యంగా వంటకు ఉపయోగించే వస్తువులపై అవగాహన కలిగి వుండాలి. కొన్ని సాధారణంగా అందరికీ తెలిసి ఉంటాయి. అయితే మరికొన్ని స్పైసీ వస్తువులు కొంతమందికి తెలిసి ఉండవు. కాబట్టి వంటగదిలో ఎలాంటి స్పైసీ ఐటమ్స్ ను నిల్వచేసుకోవాలో తెలుసుకోవాలి. ఇండియన్ ఫుడ్ తయారు చేయడంలో వంటకు ఉపయోగించే వస్తువులు కొన్ని వందల్లో ఉన్నాయి. కొన్ని వస్తువులు లేకుండా వంట అనేది పూర్తి కాదు. అందుకోసం ఇక్కడ కొన్ని స్పైసీ వంట దినుసులను మీకోసం తెలియ చేస్తున్నాం. అలాగే వాటి వల్ల ఉపయోగం ఏమిటి వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం...


must have spices an indian kitchen

జీలకర్ర(Cumin Seeds): భారతీయ వంటకాల్లో అత్యంత తరచుగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది ఒకటి. ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి. జీలర్రను వంటల్లో పొడి రూపంలోనూ, గింజల రూపంలోనూ ఉపయోగిస్తాచు. ఇది రుచి మరియు సువాసన ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో బద్రపరచుకోవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధ వ్యాదులకు, నీరసము తగ్గుటకు, గర్భాశక బాధలు, పేగులు శుభ్రపరచుట, పైత్యం నివారించుటకు వాంతులు తగ్గుటకు, కడుపులో నులిపురుగుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
మిరియాలు(పెప్పర్): మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు. పదార్ధాలపై కొంచం మిరియాలపొడి వేసి తింటుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. మిరియాలు రుచికి ఘాటుగానూ, కారంగానూ వుంటాయి. ఆయుర్వేద ఔషధాలలో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు. అతి చవకగా లభించే మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి.
పచ్చిమిర్చి/ఎండు మిర్చి(Green Chilli or Red Chillies): మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది.. కాని మిరప లేకుండా వంట సాగదు, పచ్చి, పండు, ఎండు మిరప లను మనము వాడుతాం. ఇవి శారీరక బరువును తగ్గించడానికి దోహందం చేస్తాయి. వీటిలోని రసాయనిక పదార్థం కాస్పైసిన్ జీర్ణరసాన్ని క్రియాశీలం చేస్తూ జీర్ణకోశం లోపలి భాగాల్ని కాపాడుతుంది. కాలేయం పనితీరును మరింతగా మెరగుపరుస్తుంది.
కొత్తిమీర: ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్, కూరల వంటి వాటికి చేర్చుతుంటారు. అయితే కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీరను ఫ్రెష్ గా ఉంచేందుకు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పెట్టుకోవచ్చు
యాలకులు: సుగంధ ద్రవ్యాలలో రారాణి అయిన యాలకుల్ని తినడము వల్ల నోటిదుర్వాసన తగ్గిపోతుంది. కాలేయ, జీర్ణసంబంధిత రుగ్మతలకు మంచి చికిత్స. దృఢమైన డిటాక్షిఫికేషన్‌ కారకము గా గుర్తింపు పొందినది.
లవంగాలు: లవంగాలు చప్పరించడము వల్ల గొంతు మంట తగ్గుగుంది. దీనిలో యాంటీస్పాస్ మోడిక్ గుణాలు ఉన్నాయి. కండరాలు పట్టేసినప్పుడు లవంగ తైలము రాస్తే ఉపశమనము గా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
పసుపు, మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, జీలకర్ర మొదలగునవి మనము రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు. ఉదాహరనకు పసుపును తీసుకుంటే పపంచము అంతాసుగుణాలను గుర్తిస్తున్నది. పసుపులో యాంటిసెప్టిక్, యాంటి ఇంఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. గాయాలు మానడానికి పసుపు వాడుతారు. పాలలో కొద్దిగ పసుపు కలుపుకొని తాగుతుంటే జలుబు, దగ్గు తగ్గుముఖము పడతాయి. పసుపులో ఉండే "కర్ కర్మిన్‌" అనే పదార్ధము క్యాన్‌సర్ నుండి కాపాడుతుంది అని తాజా పరిశోధనలలో గుర్తించారు.
 

No comments: