all

Wednesday, November 21, 2012

makeup tips

చలికాలం చర్మ తత్వాన్ని బట్టి ఆరోగ్యపరంగానే కాకుండా, మేకప్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

పొడిచర్మం: మేకప్‌కిముందుగా ముఖమంతా మాయిశ్చరైజర్ రాయాలి. టిష్యూపేపర్‌తో అదనపు మాయిశ్చరైజర్‌ని తీసేయాలి. వీరు ఫౌండేషన్‌ని అస్సలు ఉపయోగించకూడదు. వాడితే చర్మం ఇంకా డ్రై అయిపోతుంది. కన్సీలర్, ఆయిల్ మేకప్ వాడాలి. వీటి వల్ల ముఖం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మస్కారా, లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పెదవులకు లిప్ లైనర్, లిప్ గ్లాస్‌ను ఉపయోగించాలి. బుగ్గలకు బ్లష్‌ను అద్ది, టిష్యూ పేపర్‌తో టచ్ చేస్తూ అదనపు రంగును తీసేయాలి. తర్వాత మ్యాచ్ అయ్యే బిందీ, ఇతరత్రా అలంకరణ జాగ్రత్తలు తీసుకోవచ్చు.



జిడ్డు చర్మం: చలికాలంలో జిడ్డు చర్మం కూడా కొద్దిగా పొడిబారుతుంది. అలాగని వీరు మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ను ముఖానికి ఉపయోగించకూడదు. మేకప్‌కు ముందు ప్రైమర్‌లోషన్(మార్కెట్లో లభిస్తుంది)ను ఉపయోగించాలి. దాని మీద కాంపాక్ట్, ఫౌండేషన్ వాడకుండా వాటర్ బేస్డ్ పాన్‌కేక్స్ కొద్దిగా నీళ్లు కలిపి వాడాలి. తప్పనిసరిగా బ్రష్‌తోనే మేకప్ చేసుకోవాలి. చేత్తో చర్మం త్వరగా జిడ్డు అయి మేకప్‌ను డల్ చేస్తుంది. తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలు తీరుగా తీర్చిదిద్దుకోవాలి.

సాధారణ చర్మం: వీరిది కాంబినేషన్ స్కిన్ అనవచ్చు. వీరికి నుదురు, గడ్డం జిడ్డు అవుతుంది. మిగతా చర్మం పొడిబారుతుంది. అందుకని వీరు మేకప్‌కు ముందు నుదురు, గడ్డం మినహా మిగతా భాగానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నుదురు, గడ్డానికి ప్రైమర్ లోషన్‌ని బేస్‌గా వాడాలి. కళ్లు, పెదవులు, బుగ్గలను అందంగా తీర్చిదిద్దుకోవాలి.

No comments: