అయితే వీటిలో మీరు కాటుక మరియు లిప్ గ్లాస్ అప్లై చేయాలంటే కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అటు ఇటుగా అప్లై చేసినప్పుడు ఫర్ఫెక్ట్ షేప్ రాకుండా అందవిహీనంగా చేస్తుంది. కాబట్టి కళ్ళకు కాటును, పెదాలకు లిప్ గ్లాస్ ను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అసలైన అందం మీ సొంతం అవుతుంది.
పెదాలకు రంగు ఇచ్చే సాధనం పేరే లిప్ గ్లాస్. ఇది పెదాలను కళకళలాడించడమే గాక మృదువుగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. లిప్ స్టిక్ పై దీనిని వాడొచ్చు. లేకుంటే లేతగా కన్పించేందుకు దీనిని మాత్రమే వాడవచ్చు.
మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కలిగిన లిప్ గ్లాస్‌లు కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. లిప్‌స్టిక్‌పై దీనిని వాడే సమయంలో గట్టిగా రుద్దకూడదు. లేకుంటే లిప్‌స్టిక్ అలాగే కారిపోతుంది.
1. తక్కువగా అప్లై చేయాలి: లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు తక్కువగా అప్లై చేయాలి. తక్కువగా అప్లై చేసినప్పుడు పెదాలు తడిగా.. నిండుగా జ్యూసిగా కనబడుతాయి. లిప్ స్టిక్ అప్లై చేసిన తర్వాత మరింత అందంగా కనబడాలంటే, లిప్ స్టిక్ తర్వాత మినిమాల్ లిప్ గ్లాస్ అప్లై చేయాలి. లిప్ గ్లాస్ అప్లై చేసేటప్పుడు పెదవులకు చివరగా అప్లై చేయకూడదు. అలా చేయండం వల్ల పెదవుల క్రిందిగా లిప్ గ్లాస్ కారినట్లు కనబడుతూ అస్యహ్యంగా ఉంటుంది.
2. స్కిన్ ఫౌండేషన్: చర్మానికి ఫౌండేషన్ వేయడం వల్ల మేకప్ చాలా సేపు నిలిచి ఉండేట్లే చేస్తుంది. కాబట్టి లిప్ గ్లాస్ చెరిగిపోకుండా మొదట లిప్ లైనర్ అవుట్ లైన్ గీసుకొని ఆ తర్వాత లిప్ లైన్ దాటకుండా లిప్ గ్లాస్ అప్లై చేయాలి. మరొక విషయం ఏమిటంటే లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు ఫౌండేషన్ ను పెదాలకు కూడా వేసుకోవచ్చు. ఫౌండేషన్ క్రీమ్ ను ఒకటి రెండు చుక్కలు చేతి వేళ్ళ మీద వేసుకొని పెదాలకు అప్లై చేయాలి.
3. పౌడర్: ఫౌడేషన్ క్రీమ్ అప్లై చేయనట్లయితే టాల్కమ్ పౌడర్ ను కూడా పెద్దాల మీద అప్లై చేసి, దాని మీదుగా లిప్ గ్లాస్ ను రాయొచ్చు. ఇది ఒక సులభమైన మేకప్ చిట్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఫార్ములా కళ్ళకు కు కూడా వర్తిస్తుంది. కళ్ళకు కాజల్ పెట్టుకొనేటప్పుడు కళ్ళ క్రిందుగా పౌడర్ ను అప్లై చేసి ఆ తర్వాత కాటుకను రాయడం వల్ల చెదిరిపోకుండా ఉంటుంది. పౌడర్ రాయడం వల్ల కాటుక కానీ, లిప్ గ్లాస్ కానీ చెదిరిపోకుండా ఉంటుంది.
4. లిప్ లైనర్: చాలా మంది మహిళలు లిప్ గ్లాస్ వేయడానికి, లిప్ లైనర్ అవసరం ఉండదు అనుకొంటారు. అయితే లిప్స్ షేప్స్ అందంగా కనబడాలన్నా, జ్యూసీగా ఆకర్షించాలన్నా లిప్ గ్లాస్ ముందు లిప్ లైనర్ ను ఉపయోగించాలి. దాంతో పెదాలు నిండుగా కనబడేలా చేస్తుంది. లిప్ గ్లాస్ చెరిగిపోకుండా చేస్తుంది. కాబట్టి మేకప్ టిప్స్ లో ఈ చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవడంతో మరింత అందంగా... ఆకర్షణీయంగా కనబడతారు.
No comments:
Post a Comment