- వంటనూనె నిల్వ కంపు కొడుతూంటే, దానిలో ఎనిమిది లేదా పది నల్లటి మిరియాలు వేయండి. అది కొన్ని వారాలవరకు చెడు వాసన రాకుండా వుంటుంది.
- పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? చీమలు పట్టకుండా డబ్బాలో 3 లేదా 4 లవంగాలు పడేయండి. ఇక చీమలు అక్కడికిచేరవు.
- పప్పు దినుసులను డబ్బాలలో పోసే ముందు వాటిని వేయించండి. ఇలా చేస్తే వాటికి పురుగు, బూజు పట్టకుండా వుంటుంది.
- కొత్తిమీర కట్టలు ఫ్రిజ్ లో పెట్టేటపుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి అందులో పెట్టండి. త్వరగా వాడకుండా వుంటాయి.
- బాండ్లీలో నూనె పొంగకుండా నూనె వేడి ఎక్కేటపుడే కొంచెం ఉప్పు వేయండి. నూనె పొంగకుండా వుంటుంది. లేదా అతి తక్కువగా పొంగుతుంది.
- పాలు త్వరగా తోడుకోవాలా? పాలలో కొద్దిగా జొన్న పిండి లేదా విటమిన్ సి టాబ్లెట్ వేయండి. గడ్డ పెరుగు తోడుకుంటుంది.
- యాపిల్ కోసిన తర్వాత దానిని ఉప్పు నీటిలో కడగండి. ఇక ఆ ఆపిల్ ముక్కలు ఎప్పటికి తాజాగా వుంటాయి.
- చికెన్ లేదా మటన్ లివర్ ను పాలలో 15 నుండి 20 నిమిషాలు నానపెట్టి ఉడికించండి. అది మెత్తగా వుండటమే కాక, మంచి రుచిని కూడా ఇస్తుంది.
- ఆహారంలో గరిష్ట విలువ కొరకు కొద్ది చుక్కలు చింతపండు రసాన్ని వేయండి.
- పాలు అధికంగా మరిగి వాసనా? దానిలో కొద్దిగా ఉప్పు వేయండి. వాసన తగ్గుతుంది.
- గుడ్లు ఉడికించే ముందు అవి పగలకుండా కొద్దిగా ఉప్పు మరియు కొద్ది చుక్కలు వినేగర్ వేయండి.
- కేక్ ను కోసే టపుడు, కత్తిని చల్లని నీటిలో కొంత సమయం వుంచండి. ఈ చర్య కేక్ సమంగా కోసేలా చేస్తుంది.
- ఉప్పును వర్షాకాలంలో గడ్డ కట్టకుండా వుంచటానికిగాను కొద్ది బియ్యాన్ని ఒక గుడ్డలో గట్టిగా కట్టి ఉప్పు డబ్బాలో వేయండి.
- పచ్చళ్ళు ఎపుడూ బూజు పడుతూంటాయి. బూజు పట్టకుండా ఒక చిన్న గుడ్డలో ఆవాలు మూట కట్టి దానిని పచ్చడి జాడీలో శుభ్రమైన చెంచాతో పెట్టి వుంచండి. పచ్చడి జాడీనుండి ఎపుడు బయటకు తీసినా, దానిని పొడి గరిటె తో తీయండి, గాలి చొరకుండా మూత గట్టిగా పెట్టండి.
- వెల్లుల్లి వలవకుండా వుండాలంటే, వాటి రెబ్బలు విడదీని వాటిని కొద్ది ఉప్పు, వినేగర్ తో కలిపి ఫ్రిజ్ లో వుంచండి. అవి చాలా రోజులు తాజాగా వుంటాయి.
మీ ఫ్రిజ్ లో చేపలు తాజాగా వుండాలంటే, పచ్చి చేపలను లేదా మాంసాన్ని బాగా కడగండి, పూర్తిగా ఎండపెట్టండి. వాటిని ప్లాస్టిక్ బేగ్ లలో వుంచి రిఫ్రిజిరేటర్ లో పెట్టండి.
ప్రతిరోజూ వంట చేసే వారికి ఈ వంటింటి చిట్కాలు ఎంతో సహకరిస్తాయి. ఇవి ఆచరణలో పెడితే, వంట ఎంతో తేలిక. మీకు కనుక మరిన్ని చిట్కాలు తెలిసివున్నట్లయితే, మాకు వ్రాయండి. మీ అనుభవాలు మాతో పంచుకోండి.