సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారిలో అధిక బరువు ఉన్నవారిలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారిలో ముందు కాన్పులో బిడ్డ కడుపులో చనిపోవడం లేదా పుట్టాక చనిపోవడం, బిడ్డ సైజు పెద్దగా ఉండటం వంటివి జరిగితే, ముందు పుట్టిన బిడ్డకు అంగవైకల్యాలు ఉండటం జరిగితే... ఇలాంటి వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశాలెక్కువ
వ్యాధి నిర్ధారణ: పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నవారు మొదటిసారి చెకప్‌కు వచ్చినప్పుడే డాక్టర్ కు ఈ విషయాలు చెప్పి రక్తంలో చక్కెరపాళ్ల పరీక్ష చేయించుకోవాలి. తర్వాత ఆరో నెలలో షుగర్ పరీక్ష చేయించుకోవాలి. మొదట రాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకుని, అది 150 ఎంజీ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 కంటే ఎక్కువగా ఉన్నా లేదా తిన్న రెండు గంటల తర్వాత షుగర్ 140 కంటే ఎక్కువగా ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేయించాలి. తినడంతో సంబంధం లేకుండా 50 గ్రా. గ్లూకోజ్ తాగిస్తారు. గంట తర్వాత రక్తంలో షుగర్ పాళ్లు ఎంత ఉన్నాయో పరీక్షిస్తారు. ఒకవేళ ఇది 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే వారిలో డయాబెటిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం.
ఆహారం: గర్భిణుల రక్తంలో షుగర్ పాళ్లు కొద్దిగానే ఎక్కువ ఉంటే, డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకుని షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలతో షుగర్ నియంత్రణలోకి రాకపోయినా, షుగర్ మరీ ఎక్కువగా ఉన్నా, మందుల (ఇన్సులిన్) ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్న గర్భిణుల బరువును బట్టి, వారు చేసే పనిని బట్టి, వారి రక్తంలోని షుగర్ పాళ్లను బట్టి ఎన్ని క్యాలరీల ఆహారం, ఎలా తీసుకోవాలి అన్నది వారి ఫిజీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ నిర్ధారణ చేస్తారు. వీరు ఆహారాన్ని రోజుకు మూడు సార్లు ప్రధాన ఆహారం రూపంలో, మళ్లీ మధ్యమధ్యన స్నాక్స్ రూపంలో మరో మూడు సార్లు తీసుకోవాలి. చక్కెరపాళ్లు తక్కువగానూ, కొవ్వు తక్కువగానూ, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే అన్నం తక్కువగా తింటూ కూరులు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంతవరకు చక్కెర, తేనె, బెల్లం, స్వీట్స్, బేకరీ ఫుడ్, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడిపండు, పనస, నెయ్యి, డ్రైఫ్రూట్స్, నూనె వస్తువులు... వంటివి తినకపోవడం మంచిది. మిగతా పండ్లు కూడా జ్యూస్‌గా కంటే పండ్ల రూపంలోనే తినడం మంచిది. జ్యూస్ తీసుకున్నా చక్కెర లేకుండా తాగడం మంచిది.
వ్యాయామాలు: గర్భిణుల్లోని ఆరోగ్య పరిస్థితిని బట్టి చిన్న చిన్న వ్యాయామాలు, నడక వంటివి చేయడం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని రక్తంలో చక్కెరపాళ్లను తగ్గిస్తాయి. దాంతో చక్కెరతో వచ్చే దుష్పరిణామాలు తగ్గుతాయి.
ఇన్సులిన్ : ఆహార నియమాలు, వ్యాయామాలతో రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ హార్మోన్ ద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంజెక్షన్ ద్వారా చర్మం కిందపొరల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణి రక్తంలో చక్కెరపాళ్లను బట్టి, ఈ ఇన్సులిన్ మోతాదు ఎంత, ఎన్నిసార్లు తీసుకోవాలి అన్నది వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు.
మెట్‌ఫార్మిన్ మాత్రలు : ఈమధ్యకాలంలో చేసిన కొన్ని పరిశోధనలలో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బదులు మెట్‌ఫార్మిన్ మాత్రలు కూడా గర్భిణుల్లో సురక్షితంగా వాడవచ్చునని తేలింది.

No comments:
Post a Comment