all

Wednesday, November 21, 2012

వంట గదిని విస్మరిస్తే... పడక గదిలో పర్మినెంట్ బెడ్....

సాధారణంగా ఇంట్లో మహిళలు వంటగదిలో ఎక్కువ సేపు గడుపుతుంటారు. ఉదయం బ్రేఫాస్ట్, మధ్యాహ్నాం లచ్, రాత్రి డిన్నర్ అంటూ, ఈవెనింగ్ స్నాక్స్ అంటూ ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటారు. అయితే ఆ వంటగది పరిశుభ్రంగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువుల్లో క్రిములు చేరి ఆరోగ్యాన్ని ఎలా హాని చేస్తాయో చూద్దాం. మీరు తరచూ వంటకు వినియోగించిన పాత్రలు, వంటగదిలో ఉపయోగించే తువాళ్ళను డిటర్జెంట్లతో శుభ్రపరుస్తుంటారు. అయినే కూడా ఏదో ఒకప్రదేశంలో, మూలలో కంటికి కనబడని బ్యాక్టీరియా, క్రిములు చేరి ఇంటిల్లిపాదికి అనారోగ్యానికి గురిచేస్తాయి. వంటగది ప్లోర్, స్లాబ్, గ్యాస్ స్టౌ, ఓబెన్, ఎక్సాస్ట్ ఫ్యాన్ వంటివి శుభ్రం చేస్తే సరిపోదు...! మరికొన్ని చిన్న చిన్న వస్తువులపై క్రిముల తిష్టవేసి వుంటాయి, వాటిని అంతగా పట్టించుకోరు. బ్యాక్టీరియా, క్రిములు ఉండే అటువంటి వస్తువులు, ప్రదేశాల గురించి కొన్ని మీకోసం ...
unseen sources germs kitchen

కట్టింగ్/చోపింగ్ బోర్డ్: సాధారణంగా ప్రతి రోజూ వెజిటేబుల్స్ ను కట్ చేసే కట్టింగ్ బోర్స్, తప్పనిసరిగా బ్యాక్టీరియా చేరుతుంది. పనిపూర్తైయన వెంటనే సాధారణ నీటితో డిటర్జెంట్ పెట్టి శుభ్రం చేస్తే సరిపోదు. క్రిములు కటింగ్ బోర్డ్ మద్యలోనే కాదు, బోర్డ్ హాండ్స్ దగ్గర, మరియు బోర్డు చూట్టు, ఏదైనా ఫోల్డ్ అయిన ప్రదేశాల్లో కూడా చేరి బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. టమోటో, పచ్చిమిర్చి వంటివి కట్ చేసినప్పుడు అందులోని గింజలు అంత సులభంగా పోవు, దాంతో బ్యాక్టీరి ఫామ్ అవుతుంది. కాబట్టి కటింగ్ బోర్డ్ ను బాగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా ఏర్పడి ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకు పని పూర్తి అయిన వెంటనే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. వెజిటేబుల్ కటింగ్ బోర్డ్, మాంసాహారం కటింగ్ బోర్డ్ ను వేరు వేరుగా శుభ్రం చేయడం వల్ల అనవసరమైన కాలుష్యాన్ని నివారిస్తుంది.
కిచెన్ షింక్: వండిన పాత్రలను, కిచెన్ షింకు నిండా వేసేస్తుంటాం. వాటిని అప్పటికప్పుడు శుభ్రపరచుకోకుంటే అతి త్వరగా బ్యాక్టీరియా, క్రిములు వృద్ధిచెందడానికి దారితీస్తుంది. కాబట్టి ఏమైనా ఆహారపదార్థాలు మిగిలి ఉంటే వాటిని ముందుగా పాత్రల నుండి తీసివేసి తర్వాత షింక్ లో వేయాలి. పాత్రలను శుభ్రం చేసిన వెంటనే కొద్దిగా వేడినీళ్ళతో, డిటర్జెంట్ లతో రెగ్యులర్ గా వాష్ చేస్తుండాలి. వేడినీళ్ళతో కడిగే ముందుగా చిటికెడు బేకింగ్ షోడా వేసి శుభ్రం చేయడం వల్ల, కిచెన్ షింక్ కార్న్ లో దాగున్న బ్యాక్టీరియాను సులభంగా చంపేయవచ్చు.
డిష్ టవల్స్: ఒక్కువగా ఉపయోగించేది డిష్ టవల్స్. వేడి పాత్రలను దింపుకోవడానికి, డైనింగ్ టేబుల్స్ పై సర్దడానికి, తర్వాత ఆప్రదేశంలో తేమను తుడవడానికి ఎక్కువగా డిష్ టవల్స్ ఉపయోగిస్తుంటారు. ఇలా తుడవడం వల్ల తేమ ఉన్న బట్టలలో బ్యాక్టీరి అతి సులభంగా వృద్ధిచెందుతుంది. కాబట్టి పని పూర్తవగానే డిష్ టవల్స్ ను గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ తో శుభ్రం చేసి, తర్వాత ఫినాయిల్ లేదా డెటాల్ నీటిలో వేసి అందులో ముంచి తీసి తర్వాత ఎండలో వేసి పూర్తిగా ఆరనివ్వాలి.
స్పాంజ్ మరియు స్ర్కబ్స్: బ్యాక్టీరియా అతి సులభంగా ఏర్పడ్డానికి కారణం తడి, తడి ప్రదేశాలు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటగదిలోని స్పాంజ్ లను, స్ర్కబ్ లను నెలకొక్కసారైనా మారుస్తుండాలి. స్పాంజ్ లు, స్ర్కబ్ లు ఉపయోగించిన తర్వాత వాటి శుభ్రంగా కడిగి నీటిని పూర్తిగా పిండేసి ఆరనివ్వాలి. స్పాంజ్, స్ర్కబ్, డిస్ సోపులను ఓపెన్ ప్రదేశంలో ఉంచడం వల్ల త్వరడా తడిఆరి శుభ్రంగా కనిపిస్తుంటాయి.
నైఫ్(కత్తులు)స్టాండ్: బ్యాక్టీరియాకు ఆవాసాలు చెక్కతో ఉన్నటువంటి వస్తువులు. ముఖ్యంగా కత్తులను నిల్వ ఉంచే స్టాండులు. తడితో ఉన్నటువంటి కత్తులను ఎప్పుడు కానీ వుడెన్ స్టాండ్ లో ఉంచకూడదు. చెక్క నీటిని అతి త్వరగా పీల్చుకొని బ్యాక్టీరియా ఏర్పడటానికి సహకరిస్తుంది. అందుకోసం స్టీల్ లేదా ప్లాస్టిక్ కత్తులను ఉపయోగించడం వల్ల వాటి సులభంగా శుభ్రం చేయడమే కాకుండా త్వరగా తడి ఆరిపోతాయి. బ్యాక్టీరియా ఏర్పడాటానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. అలాగే కిచెన్ రాక్స్ ను కూడా తరచూ శుభ్రం చేస్తుండాలి.


No comments: