నా వయసు 27. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోలేదు. బర్త్ కంట్రోల్ పిల్స్ కాకుండా కండోమ్స్ వాడుతున్నాం. మూడు నాలుగేళ్లుగా పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయి. డాక్టర్ని సంప్రదించి హార్మోన్ ట్యాబ్లెట్స్ మూడు నెలల పాటు వాడాను. పీరియడ్స్ మాత్రం రెండు, మూడు నెలలకు ఓసారి వస్తున్నాయి. బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. మొదటి రోజున రక్తస్రావం గడ్డలుగా అవుతోంది. ఎందుకిలా? తెలియజేయగలరు.
- కె. రాజీ, సూర్యాపేట
పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తరచూ కనిపించే కారణాలలో కొన్నింటిని చూద్దాం.
మొదటిది : హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే సమస్యలు. పీరియడ్స్ సక్రమంగా రావడానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, టెస్టోస్టిరాన్ వంటి ఎన్నో హార్మోన్లు దోహదపడతాయి. ఈ హార్మోన్లలో ఏదైనా హెచ్చుతగ్గులు కలిగినా, లేక వీటి నిష్పత్తిలో తేడా వచ్చినా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి.
రెండో అంశం: గర్భసంచి, ఓవరీస్‌కు సంబంధించిన సమస్యలు. పుట్టుకతోనే యూటెరస్, ఓవరీస్ సరిగ్గా ఎదగకపోవడం, జన్యుపరమైన లోపాలు ఉండటం, ఓవరీలో సిస్టులు లేక గడ్డలు వంటివి, యూటెరస్‌లో ఎండిమెట్రియోసిస్ వంటి సమస్యలు, యూటెరస్ ఆకృతి, పనితీరుకు సంబంధించిన సమస్యలన్నీ పీరీయడ్స్‌పై ప్రభావం చూపుతాయి.
మూడు: వయసుకు సంబంధించిన సమస్యలు. యుక్తవయసులో ఓవరీస్ పరిపక్వత చెందకపోవడం వల్ల, నలభై ఏళ్లు దాటిన స్త్రీలలో ఓవరీ పనీతీరు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి.
నాలుగు: శారీరక శ్రమ లోపించిన జీవనశైలి, ఊబకాయం వల్ల కలిగే సమస్యలు మొదలైనవి. అన్ని వసతులు కలిగిన ఈ ఆధునిక యుగంలో ఏ మాత్రం శ్రమ లేకుండా మిషిన్ల ద్వారా అన్ని పనులూ జరిగిపోతున్నందున మనం తీసుకునే ఆహారానికి పడే శ్రమకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీని వల్ల రకరకాల హార్మోన్ల సమస్యలు, ఊబకాయం వంటివి వస్తున్నాయి.అవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి కారణం అవుతున్నాయ.
ఐదు: సొంతవైద్యం. మందులు, అవి కలిగించే ప్రభావంపై ఏమాత్రం అవగాహన లేని వైద్యుల సలహాపై హార్మోన్ మాత్రలను ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిపడితే అన్ని తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఇక మీ విషయంలో సరైన పరీక్షల ద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు కారణం కనుక్కోండి. దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక మీ పీరియడ్స్ క్రమబద్ధమైపోయాక స్వాభావికంగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలావరకు ఉంటుంది.

No comments:
Post a Comment