all

Wednesday, November 21, 2012

ఆరోగ్యాన్ని.. అందాన్ని రెంటింపు చేసే పండ్లను తాజాగా ఉంచడం ఎలా...?

ప్రకృతి పరంగా లభించే పండ్లును తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి.
పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం

ప్రతి రోజూ పండ్లును తినేటప్పుడు వాటిని కట్ చేసి కొంచెం తిని తర్వాత తిందాంలే అని పక్కన పెట్టేస్తుంటారు. అది మనకు తెలియకుండానే చేస్తుంటాం. అయితే పండ్లను అలా కట్ చేసి పెట్టడం వల్ల ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అలాంటి వాటిని కట్ చేసిన తర్వాత ఎండిన లేదా తాజాదనం నుండి కలర్ మారినటువంటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందులో ఉన్న పోషక విలులవలన్నింటినీ కోల్పోవడంతో ప్రయోజనం చేకూరదు. అందుకోసం పండ్లను తాజాగా ఉంచడం కొరకు కొన్ని చిట్కాలు మీ కోసం...
ఆపిల్: తినడానికి ఆపిల్ కట్ చేసి సగం భాగం తిని, మరో సగభాగాన్ని అలాగే ఉంచేయాలనుకొన్నప్పుడు అవి తాజాగా ఉండాలంటే అందుకు కొన్ని సింపుల్ చిట్కాలున్నాయి. మిగిలిన ఆ సగభాగాన్ని తీసుకొని దానికి యాపిల్ సైడర్ వెనిగర్ ను రాసి ఒక మూత ఉన్న ఔల్ లో ఉంచినట్లైతే ఆపిల్ తాజాగా ఉంటుంది. యాపిల్ సైడర్ దొకనట్లైతే మరే ఇతర సాధరాణ వెనిగర్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల యాపిల్ ఎక్కువ సమయం ఫ్రెష్ గా ఉంటాయి. మరియు నిమ్మరసం ఉపయోగించి కూడా యాపిల్స్ ను తాజాగా ఉంచవచ్చు. కాబట్టి యాపిల్స్ ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఇది ఒక ఉత్తమైన పద్దతి అని చెప్పవచ్చు.
అవోకాడో: కట్ చేసిన అవోకాడోను తాజాగా ఉంచడం చాలా సులభం. మొత్తం అవోకాడోను తినాలనిపించి కట్ చేసుకొని సగభాగం తిని మరో సగభాగం తినలేని సమయంలో నిమ్మరసంను అవాకాడో మీద చల్లి మూత గట్టిగా ఉండే గాలి చొరబడిని ఫ్రూట్ బౌల్ లో పెట్టి రిఫిజరేటర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవోకాడో ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది.
జామ పండ్లు: జామ పండ్లలో విటమిన్ సి తో పాటు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది అతి తర్వగా రంగు మారిపోతుంది. అలా జరగకుండా ఫ్రెష్ గా ఉండాలంటే అందుకు రెండు చిట్కాలున్నాయి. ఒకటి జామ పండు లేదా కాయను కట్ చేసిన తర్వాత వాటి మీద నిమ్మరసం చల్లి ఉంచితే ఫ్రెష్ గా ఉంటాయి. మరి రెండవది జామ కాయ ముక్కల మీద జలపెనో పెప్పర్ ను చిలకరించడం వల్ల ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
బొప్పాయి: పప్పాయను కట్ చేసి మొత్తాన్ని ఒక్కేసారి తినలేం కాబట్టి, కట్ చేసి తినగా మిగిలి బొప్పాయిని ఒక న్యూస్ పేపర్ లో చుట్టి పెట్టడం వల్ల తాజాగా ఉంటుంది. న్యూస్ పేపర్ లో చుట్టి రిఫిజరేటర్ లో పెట్టాలి. పపాయను ఎక్కువ సమయం తాజాగా నిల్వ ఉంచడానికి ఇది ఒక ఉత్తమైన పద్దతి.
లెమన్(నిమ్మపండు): సాధారణంగా నిమ్మపండును జ్యూస్ గా, లేదా లెమన్ రైస్ కు, లేదా గార్నిషింగ్ కోసం కట్ చేస్తుంటాం. అయితే కొంత బాగాన్ని ఉపయోగించి మరికొంత భాగాన్ని అలా పెట్టేస్తుంటాం. అది తిరిగి ఉపయోగించాలంటే గట్టిపడి లేదా ఎండిపోయి, లేదా చెడిపోయి ఉంటుంది. అలా జరగకుండా ఫ్రెష్ గా ఉండాలంటే కట్ చేసి మిగిలిన నిమ్మ పండును పాలిథిన్ కవర్ లో ఉంచి గట్టిగా ముడివేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
వాటర్ మెలోన్(పుచ్చకాయ): పుచ్చకాయ పెద్ద సైజులో ఉడటం వల్ల పెద్ద మొత్తాన్ని ఒక్కే సారి తినలేరు కాబట్టి, మిగిలిన భాగాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు లేదా ఫ్లాస్టిక్ షీటల్ లో భద్రపరచుకోవచ్చు.
పైనాపిల్: పైనాపిల్ ముక్కలను గాలిచొరవడని ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచడం వల్ల ఎక్కువ సమయం తాజాగా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల పండ్లకు తగినంత తేమనందించి ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఈ చిన్న చిట్కాలను ఉపయోగించి పండ్లను తాజాగా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి...

ఆపిల్


తినడానికి ఆపిల్ కట్ చేసి సగం భాగం తిని, మరో సగభాగాన్ని అలాగే ఉంచేయాలనుకొన్నప్పుడు అవి తాజాగా ఉండాలంటే అందుకు కొన్ని...



అవోకాడో


కట్ చేసిన అవోకాడోను తాజాగా ఉంచడం చాలా సులభం. మొత్తం అవోకాడోను తినాలనిపించి కట్ చేసుకొని సగభాగం తిని...

జామ పండ్లు


జామ పండ్లలో విటమిన్ సి తో పాటు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది అతి తర్వగా రంగు మారిపోతుంది.

బొప్పాయి


పప్పాయను కట్ చేసి మొత్తాన్ని ఒక్కేసారి తినలేం కాబట్టి, కట్ చేసి తినగా మిగిలి బొప్పాయిని ఒక న్యూస్ పేపర్ లో...

No comments: