all

Wednesday, November 21, 2012

శెనగపిండితో చర్మ సౌందర్యం రెట్టింపు...

శెనగపిండితో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. శెనగపిండి వంటింటి వస్తువే అయినా దీన్ని బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తారు. శెనగ పిండి చర్మ సంరక్షణకు ఏవిధంగా పనిచేస్తుందో అందరికీ తెలసిన విషయమే. అందుకే ఎక్కువగా ఫేస్ మాస్క్ లుగా శెనగపిండి వేసుకొంటుంటారు. ఇది ఇప్పటి ఆచారమో... పద్దతో కాదు. పూర్వ కాలం నుండి వస్తున్న పద్దతే మన పూర్వ కాలంలో కూడా శెనగపిండి, సున్నిపిండిని నలుగు పెట్టుకొని తర్వాత స్నానం చేసేవారు.

శెనగపిండి చర్మంలో పేరుకొన్న మురికి తొలగించి ముఖానికి కాంతిని నింపుతుంది. కాబట్టి మీ చర్మ కాంతిని పెంచుకోవాలనుకుంటే శెనగపిండితో ఫేస్ మాస్క్ వేసుకొని అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. శెనగపిండిలో యాంటిసెప్టిక్ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మసంరక్షణకు బాగా ఉపయోగపడుతంది. కాబట్టి ముఖంలో మొటిమలు, వాటి తాలూకు మచ్చలు వున్నట్లైతే ఈ ఫేస్ మాస్క్ పద్దతులను ఉపయోగించి కోమలమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

5 face masks using besan

పసుపు- శెనగపిండి ఫేస్ మాస్క్: భారతీయ సౌందర్య ఉత్పత్తుల్లో అత్యుతంగా ప్రాచుర్యం పొదినది పసుపుతో తయారు చేసిన ఉత్పత్తులు. భారతీయ సౌందర్య సాధనాల్లో సౌందర్యాన్ని పెంచుకొనే బ్యూటీ సీక్రెట్స్ లో పుసుపు శెనగ పిండి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో ఈ రెండింటి మిశ్రమంతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల.. ముఖంలో కొత్త కాంతులు ఏర్పడుతాయి. ముఖంలో మెరుపును మాత్రమే కాదు సహజ అందాన్ని కూడా అందిస్తుంది.
శెనగపిండి-పాలు ఫేస్ మాస్క్: అరకప్పు పాలు తీసుకొని అందులో రెండు చెంచాల శెనగపిండి, ఒక చెంచా తేనె వేసి, బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేయడం వల్ల చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వింటర్ లో బాగా పనిచేస్తుంది.
శెనగపిండి తో నిమ్మ-బాదాం: వీటితో వేసుకొనే ఫేస్ మాస్క్ వల్ల చర్మం ప్రకాశవంతంగా మారడానికి కారం నిమ్మ, బాదాలో ఉన్న యాంటిఆక్సిండెంట్స్ మరియు విటమిన్ ఇ. బాదంను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పొట్టు తీయకుండానే వాటిని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానికి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా శెనగపిండి చేర్చి బాగా మెత్తగా పేస్ట్ లా కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖానికి మంచి ఫేషియల్ స్ర్కబ్ గా పనిచేసిచేస్తుంది. శెనగపిండి, బాదం మిశ్రమం ముఖంలో మచ్చలను, మొటిమలను తగ్గించి ముఖానికి కాంతిని అందిస్తుంది.
శెనగపిండి -ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్: ముఖంలో మొటిమలు, మచ్చలతో అస్యంగా మారినట్లైతే గుడ్డులోని తెల్లసొన శెనగపిండి మిశ్రమంతో అద్భుతంగా పనిచేస్తుంది. గుడ్డులోని తెల్ల సొన తీసుకొని బాగా గిలకొట్టి అందులో శెనగ పిండిని వేసి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకొంటే ముఖంలో జిడ్డు వదలి, మొటిమలు మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
శెనగపిండి మరియు పెరుగు: ఫేషియట్ స్కిన్ కేర్ లో పెరుగును ఉపయోగించడం వల్ల చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. శెనగపిండితో పెరుగును మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ టాన్ ను తొలగిస్తుంది. చర్మానికి చల్ల దనాన్ని చేకూర్చుతుంది. వేడి వల్ల చర్మంలో ఏర్పడే మచ్చలును తొలగిస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఫేస్ మాస్క్ లను ఉపయోగించి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి..

No comments: