all

Wednesday, November 21, 2012

ప్రెజర్ కుక్కర్ మన్నికగా ఎలా ఉపయోగించాలి....!?

ప్రస్తుత ఉరుకుల పరుగుల మయ జీవితంలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం ఎక్కువ అవుతోంది. సమయం ఆదా అంటారు కానీ కరెంట్ వృదా చేస్తారు. వంట సులభం అంటారు పోషక విలువలను నష్టపరుస్తుంటారు. పని సులభం అంటారు. వంట్లో కెలరీలు పెంచేస్తారు. ఇలా ఒకటేంటి అన్ని రకాలుగాను కొన్ని సందర్భాల్లో నష్టపోతుంటారు. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత వరకూ ఉపయోగమో అంత వరయే కొనుగోలు చేస్తే కొంత వరకూ ఆదా చేయవచ్చు. ప్రస్తుతం ప్రతి వంటింట్లో వంట చేయడానికి ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఉపయోగించే వస్తువు ప్రెజర్ కుక్కర్. ఇబ్బందులకు గురికాకుండా ఎక్కువ కాలం దాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
how use pressure cooker long time

కుక్కర్‌తో ఇబ్బందులు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. కుక్కర్‌ లో కొలత ప్రకారం నీటిని పోయాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్లో పడిపోయి, కుక్కర్‌ లోని నీటితో ఉడకటం వల్ల, కుక్కర్లోనీరు ఇంకిపోయి స్టేఫ్టీ వాల్వ్ బద్ధలవడం, వెయిట్ ఎగిరిపోయి కుక్కర్లోని పదార్థాలు పైకి చిమ్మటం లాంటివి జరుగుతాయి.
గాస్కెట్ పాడయిపోతే, కుక్కర్ పక్కల నుంచీ ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందువల్ల లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికీ విజిల్‌ రాదు. కుక్కర్‌ లోని నీరంతా అయిపోయి, సేఫ్టీ వాల్వ్ పోతుంది. కుక్కర్‌ మూత పక్కనుంచీ ఆవిరి బయటకు వస్తుంటే గాస్కెట్‌ను మార్చాలి.
కుక్కర్‌లో పెట్టిన గిన్నెలలో ఆహార పదార్థాలను, బియ్యాన్ని పెట్టినప్పుడు ఆ పాత్రలలో నీరు అవి ఉడికించేందుకు సరిపడా పోయాలి. చిన్న గిన్నెలలో ఎక్కువ పదార్థాలను పెట్టడం వల్ల అవి సరిగ్గా ఉడకవు. లేదా పొంగి కుక్కర్లో పడతాయి.
కుక్కర్లో మూతకున్న ఆవిరి రంధ్రం మూసుకుపోకుండా ప్రతిరోజు శుభ్రపరచాలి. అదేవిధంగా వెయిట్‌ ని కూడా ప్రతిరోజు శుభ్రం చేయాలి. కుక్కర్లోంచి ఆవిరి త్వరగా రావటానికి, లోపలి పదార్థాలు ఉడకటానికి హెచ్చు మంటను పెట్టాలి. వెయిట్ పెట్టిన తర్వాత కూడా మంటలను తగ్గించకూడదు.
విజిల్ వచ్చిన తర్వాత మంటను తగ్గించి, ఆ తర్వాత మంటను తగ్గించి, ఆ తర్వాతే స్టౌను ఆర్పాలి. కుక్కర్‌ ను దింపిన తర్వాత వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకూడదు. దానివలన గ్యాస్‌కట్ దెబ్బతింటుంది.
కుక్కర్‌లో పదార్థాలను వండేటప్పుడు మొత్తం గిన్నెలతో నింపకూడదు. మూతకు, గిన్నెకు మధ్య కొంచెం గ్యాప్ ఉంచాలి. ఆవిరి బయటకు వస్తున్నప్పుడు మాత్రమే వెయిట్ పెట్టాలి తప్ప ముందుగానే పెట్టేయకూడదు.
కుక్కర్‌ ని స్టవ్‌ మీద నుంచి దింపిన వెంటనే మూత తీసే ప్రయత్నంలో వేడిదానిపై నీళ్ళు పోయకూడదు. లోపలి ప్రెజర్ అంతా బయటకు పోయాక మూత తీయాలి.
మొదట వెయిట్ తీశాక కుక్కర్ పైమూత తీయాలి. వెయిట్ వుండగా మూత తీయకూడదు.
కుక్కర్ అడుగుభాగం గారపట్టకుండా తెల్లగా ఉండాలంటే వంటచేసేప్పుడు అడుగున పోసే నీళ్ళలో నిమ్మచెక్క కానీ, కొంచెం చింతపండు కానీ వేయాలి. గోరువెచ్చగా వున్న నీటిలో సబ్బుగాని, సర్ప్‌ గాని కలిపి కుక్కర్‌ ను శుభ్రంచేయాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడిచి బోర్లించాలి.
కుక్కర్‌ లో అన్నం, పప్పు వండేప్పుడు ముందుగానే కడిగి కొంచెంసేపు నానబెట్టి వండితే బాగా వుడుకుతాయి. కుక్కర్ ఉపయోగించిన వెంటనే గ్యాస్‌కట్‌ ను తీసివేసి చల్లటి నీటిలో వేయాలి. వారానికోసారి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువకాలం మన్నుతుంది.
 

No comments: