all

Wednesday, November 21, 2012

కురుల సౌందర్యానికి కావాలి మెరుగైనా వంటింటి చిట్కాలు

జుట్టు మెరుస్తూ.. అందంగా కనబడాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువ కేర్ తీసుకొంటుంటారు. ఎందుకంటే స్త్రీల కంటే పురుషుల్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం, ఆహారం, హార్మోన్లు, వాతావరణం, కాలుష్యం, జీన్స్ కారణంగా హెయిర్ ఫాల్ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంటుంది. వాటికోసం చాలా రకాల కండీషనర్స్ ను, షాంపూలను తరచూ మార్చుతుంటారు కూడా.. అయితే వాటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇంటి చిట్కాలను పాటించినట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది.

. డైయట్: అందంగా హెయిర్ ఉండాలనుకొనే వారికి తీసుకొనే ఆహారంలో మార్పులు తప్పనిసరి. మీరు తీసుకొనే ఆహారం బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో.. అలాగే మీరు తీసుకొనే ఆహారం బట్టే కేశసౌందర్యం ఆధారపడి ఉంటుంది. అందుకు పండ్లు, కూరగాయలు, పోటీన్లు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కురులకు కావలసినంత తేమను అందించడమే కాకుండా అవసరమైన పోషకాలను అందించి మీ జుట్టును ఆరోగ్యంగా మృదువుగా ఉంచుతుంది.


2. గుడ్డులోని పచ్చసొన:
జుట్టు రాలడానికి అరికట్టుటలో ఇది ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. గుడ్డులోని పచ్చసొనను తలమాడుకు బాగా మర్ధన చేయడం వల్ల హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. గుడ్డులోని పచ్చసొనను తలకు బాగా పట్టించి అర గంట నుండి గంట పాటు అలాగే వదిలేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే చాలు మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు.


3. ఆయిల్ మసాజ్: వేడి నూనె శరీరారనికే కాదు తలకు కూడా పట్టించి మన పూర్వీకుల తలంటు పోసుకొనేవారు. ఇలా చేస్తే చర్మ వ్యాదు దరిచేరవని తలకు శాంతం చేకూరుతుందని వారి నమ్మకం. కాబట్టి తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలున్నాయి. అందుకు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా కాస్ట్రాల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మరసం, కొద్దిగా వెనిగర్ కలిపి తలకు పట్టించి కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేయడం వల్ల తలలోని చుండ్రు వదిలిపోతుంది.

4. ఆమ్లా(ఉసిరి): హెయిర్ కేర్ లో ముఖ్యంగా ఉపయోగించేది ఆమ్లా (ఉసిరి). దీన్ని ఆనాది కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఉసిరి రసాన్ని లేదా ఉసిరితో తయారు చేసినటువుంటి నూనె కానీ జుట్టు ఆరోగ్యానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఇది ఎర్రగా ఉన్న జుట్టుకు మాత్రమే కాదు కురులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుంది.

5. నీమ్(వేప): జుట్టు సంరక్షణలో వేప కంటే మంచి ఔషదం మరికటి ఉండదనే చెప్పాలి. ఎందుకంటా చాలా మంది తలలో చుండ్రు, దురద, పేను సమస్యతో బాధపడే వారికి వేప చాలా బాగా పనిచేస్తుంది. వేప ఆకును మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. అలాగే వేప నూనెను కూడా అప్పుడప్పుడు తలకు పట్టించడం వల్ల తలలోని ఏదేని బ్యాక్టీరియాను నశింపచేసి, కురులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. అలోవెరా(కలబంద): అలోవెరా చర్మ సౌందర్యానికే కాదు జుట్టు పోషణకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది ప్రకతి సిద్దంగా లభించే సహజ పదార్థం. ముందుగా తలను చల్లటి నీటితో శుభ్రం చేసుకొని తర్వాత అలోవెరా జెల్ ను కురులకు పట్టించాలి. ఇది జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది.

7. మయోనైజ్: మార్కెట్లో దొరికేటటువంటి మయోనైజ్ ను తీసుకొచ్చి దీన్ని కొబ్బరి నూనె, లేదా బాదాం నూనె లేదా ఆలివ్ నూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ నేచురల్ కండీషనర్ ను పది నుండి ఇరవై నిముషాల పాటు ఉంచి తర్వాత తలస్నానం చేస్తే కురులు మెరుస్తూ ఉంటాయి.


8. బీర్: నేటి జనరేషన్ లో హెయిర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ముందకాలం నాటి పదార్థాలే కాదు కొత్తగా జుట్టుకు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి బీర్. బీర్ ను తలకు పట్టించడం మంచి మంచి లుక్ ఇవ్వడమే కాకుండా మంచి షైనింగ్ తో సిల్కీగా మారుతాయి.
కురుల సంరక్షణలో ఈ చిట్కాలను పాటించి, కురులకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా కృత్రిమ మరియు రసాయన పదార్థాలకు దూరంగా ఉంటూ డబ్బును ఆదా చేయవచ్చు....
 

No comments: