1. ముందుగా కనుబొమ్మల జిడ్డుగా ఉండకుండా మంచి నీటితో శుభ్రంగా కడిగి త్రెడ్డింగ్ కు సిద్దపడండి.
2. మీ కనుబొమ్మలకు ఎటువంటి నచ్చుతుంది వాటిని ముందుగా ఎంచుకోవాలి. ఎంతసేపటికీ తేల్చుకోలేకపోతే ఏ ఫ్యాషన్ మ్యాగజైన్ నో తిరగేస్తే మీ ముఖాకతికి నప్పే షేప్ ఏమిటో తెలిసిపోతుంది.
3. ఐబ్రో పెన్సిల్ తో మీకు నచ్చిన షేప్ ను ముందుగా గీసుకుని తర్వాత వాటిని షేప్ చేయడం మొదలుపెట్టాలి. ఇందుకోసం వెలుతురు దారాళంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
4. మీరెలా షేప్ చేయించుకోవాలనుకుంటున్నారో అక్కడ కన్సీలర్ వాడితే తీరైన షేప్ చేయించుకోవడం సులభం.
5. కొనుబొమ్మలను షేప్ చేయించుకునే క్రమంలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా, దద్దుర్లు వస్తున్నట్లు చర్మం ఎర్రగా కందినట్లు అనిపించినా ఆపేయాలి.
6. కనుబొమ్మలను తీర్చిదిద్దుకున్న తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా బేబీ ఆయిల్ ను రాస్తే మంచిది.
7. కనుబొమ్మల ప్రాంతం మరీ సున్నితంగా ఉంటే కనుక త్రెడింగ్ కి ముందు, తర్వాత కూడా ఐస్ ప్యాక్ పెట్టుకోండి..
No comments:
Post a Comment