అర్శమొలలు (పైల్స్ లేదా హెమరాయిడ్స్) అంటే మలద్వారం వద్ద ఉన్న కణజాలం ఉబ్బిపోవడం. ఇది సాధారణంగా పెద్దవాళ్లలో కనిపిస్తుంది.
పైల్స్ అంటే : మలాశయాన్ని, మలద్వారాన్ని కలిపే ప్రదేశాన్ని యానల్ కుషన్ అంటారు. ఆ యానల్‌కుషన్‌లోని కణజాలం గుండ్రంగా ఉబ్బి ద్రాక్షపండ్లలా తయారవుతాయి. ఆ కండిషన్‌ను పైల్స్ అంటారు.
లక్షణాలు మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుంటుంది.
మలద్వారం వద్ద గడ్డ
మలవిసర్జన సమయంలో నొప్పి, బాధ
మలద్వారం నుంచి శ్లేషం బయటకు వచ్చి దురద కలిగిస్తుంది
మలవిసర్జన సంతృప్తికరంగా ఉండదు.
కారణాలు : పైల్స్ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తెలియదు. అయితే యానల్‌కుషన్స్... ఇంకా దానికింద ఉండే కండరాలు బలహీనం కావడం ఒక కారణమని చెప్పవచ్చు. ఈ బలహీనత వల్ల యానల్ కుషన్స్ కిందికి జారతాయి.
ఈ కింది అంశాలు పైల్స్ వచ్చేందుకు దోహదపడతాయి. మలబద్దకం ( మలవిసర్జన కోసం ఎక్కువగా కష్టపడటం, ముక్కడం)
పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవడం
ఎక్కువ రోజులు విరేచనాలతో బాధపడటం
గర్భవతుల్లో హార్మోన్ల వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పడటం, ఇంకా పొట్టలో శిశువు బరువు పెరగడం
కుటుంబంలోని పెద్దవారిలో పైల్స్ ఉండటం
పొట్టలో క్యాన్సర్ లేదా ఏవైనా గడ్డలు పెరగడం వల్ల లేదా ఒత్తిడి పెరగడం వల్ల.
గుర్తించడం ఎలా : లక్షణాల ద్వారా, అనంతరం పరీక్షల ద్వారా
మెడికల్ హిస్టరీని బట్టి
ప్రాక్టోస్కోప్‌తో పరీక్ష చేసి
సిగ్మాయిడోస్కోప్ ద్వారా పెద్దపేగు మొత్తం చూడటం ద్వారా
కొలనోస్కోపీ... అంటే సన్నటి గొట్టంతో పెద్దపేగును చూడటం ద్వారా
నివారణ, చికిత్స: రోజూ మలవిసర్జన సులువుగా అయ్యేలా చూసుకోవడం. దీనికి చేయాల్సిందల్లా ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడమే. అంటే మనం తినే ఆహారపదార్థాల్లో తాజా పండ్లు, కూరగాయలు, ముడిబియ్యం, పొట్టుతీయని గోధుమలు ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం. లక్షణాలను బట్టి యాసిడ్‌నైట్రికమ్, నక్స్‌వామికా, సల్ఫర్ లాంటి అనేక మందులు వాడవలసి ఉంటుంది.
- డాక్టర్ ఎం. శ్రీకాంత్
సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్
No comments:
Post a Comment