all

Wednesday, November 21, 2012

అందమైన ‘కళ్ళు’.. సౌందర్యం వీటితో సొంతం..

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు క్రమం తప్పకుండా కళ్లను రెప్పలాడిస్తూ ఉండాలి. అలా చేయకపోతే కళ్లు పొడిబారిపోయి కంటిచూపుపై ప్రభావం పడుతుంది. కళ్లపై మరీ ఎక్కువ లైటింగ్ పడకుండా చూసుకోవాలి. అలాగే చదువుతున్నప్పుడు సరిపడా కాంతి ఉండేలా జాగ్రత్తపడాలి. లేకుంటే కళ్లు అధిక శ్రమ, ఒత్తిడికి లోనై చూపు మందగిస్తుంది. కళ్లకు సరైన విశ్రాంతి లేకపోయినా, ఎక్కువ అలసట, ఒత్తిడికి లోనైనా కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మూడు బాదం గింజలను పాలతో కలిపి పేస్ట్‌లా చేసి కంటికింది భాగంలో రాసుకుని కొంచెంసేపు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా కళ్లకింద ఏ క్రీమునైనా ఉంగరం వేలుతో రాసుకోవడం మంచిది.
కళ్లు దురదపెట్టినా, మంటపెట్టినా ఎట్టిపరిస్థితుల్లోనూ నలపకూడదు. దానివల్ల కళ్లల్లోని సున్నితత్వం దెబ్బతింటుంది. చేతులకున్న బ్యాక్టీరియా కళ్లలోకి చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టీవీని కనీసం పది అడుగుల దూరం నుంచి చూడడం క్షేమకరం. చదివే పుస్తకాన్ని కళ్లకు రెండు అడుగుల దూరం పెట్టుకోవడం మంచిది. గోరువెచ్చటి పాలలో దూదిని ముంచి రెండు కళ్లపై పెట్టుకుని పదిహేను నిమిషాలపాటు ఉంచుకోవాలి. అలసిన కళ్లకు విశ్రాంతికోసం చల్లటి పాలలో దూదిని ముంచి రెండు కళ్లపై పదినిమిషాలపాటు ఉంచుకుంటే మంచిది.

రాత్రి నిద్రించడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎటువంటి క్రీము రాసుకోకపోవడమే మేలు. కళ్లు అలసటకు లోనైనప్పుడు విశ్రాంతి కోసం కనుగుడ్లను కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అలా తిప్పుతూ ఉండమని యోగా నిపుణుల సూచన. కళ్లకు, కళ్లచుట్టూ ఉండే కండరాలకు తగినంత విశ్రాంతి కోసం కళ్లు మూసుకుని ప్రశాంతమైన మనస్సుతో నచ్చిన విషయాలను గుర్తుచేసుకోవాలి.
తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి దూరంగా చూడాలి ఇలా నాలుగైదు సార్లు చేస్తే కళ్లకు ఎంతో ఆరోగ్యం. చేతిలో ఓ పెన్సిల్‌ను పట్టుకుని దాన్ని నెమ్మదిగా ముక్కు దగ్గరకు తీసుకురావాలి. ఆ సమయంలో కంటిచూపును పెన్సిల్‌మీద కేంద్రీకరించాలి. ఇలా పలుమార్లు చేయడంవల్ల కళ్లకు మంచి వ్యాయామం అవుతుంది. దీనివల్ల కంటిచూపు మసకబారకుండా నివారించుకోవచ్చు.
క్రమం తప్పకుండా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. తలనొప్పి రావడానికి ఒత్తిడి, కంటి చూపులో తేడాలు. మైగ్రేయిన్, నరాల సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి. కళ్లు పొడిబారుతున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. దీనికి పలు ఆరోగ్య సమస్యల నివారణ కోసం వేసుకునే మందులు కారణమవుతాయి. కంటికి సంబంధించి ఏ సమస్య లేకపోయినా ప్రతి ఆరునెలలకోసారి కంటిడాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
ఐ మేకప్ కోసం పౌడర్ కంటే క్రీము వాడుకోవడం మంచిది. పౌడర్ అయితే కంట్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కళ్లకు ఆరోగ్యకరం. బొప్పాయి, గుడ్లు, చేపలు, పాలు, క్యారట్, కొత్తిమీరలో విటమిన్-ఎ ఎక్కువగా లభిస్తుంది. ఒక ఉసిరికాయను రాత్రంతా నీళ్లలో నానవేసి ఉదయం లేచిన తర్వాత ఆ నీటితో కళ్లను కడుక్కుంటే చాలా మంచిది.

బొప్పాయి


బొప్పాయి: బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.



క్యారెట్


క్యారెట్: క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చరమ సౌందర్యాన్ని పెంచుతుంది. క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది ,-- ఉడక బెట్టి తినాలి . యాంటి ఆక్షిదేంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను (FreeRadicles) తొలగిస్తుంది , శరీర వ్యాదినిరోధక శక్తి ని పెమ్పొందిస్తుడి.



గుడ్డు


గుడ్డు: ఇది శాకాహారం కాదు. గుడ్డులోని తెల్ల సొన చర్మ సంరక్షణకు ఒక మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగ పడుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది . పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు . మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి . కండపుష్టికి , కండర నిర్మాణానికి ఎంతో మేలు. కళ్ళు కావలసిన పోషణను అందిస్తుంది.



పాలు


పాలు: పాలు శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. మూడు ప్రోటీనులూ, ఆరు విటమినులూ, ఇరవై ఐదు ఖనిజాలు గల ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంది. శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తాయీ. స్తన్యములను వృద్ధిచేయును. శరీరానిని కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడములో పాలు తోడ్పడుతుంది



చేపలు


చేపలు: చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. కాబట్టి కళ్ళు ఉపయోగ పడే విటమిన్ ఎను పుష్కలంగా అందిస్తుంది.


No comments: