all

Wednesday, November 21, 2012

సిట్రస్ ఫ్రూట్ క్లీనర్ తో ఇల్లు పరిమళం...మరకలు మటు మాయం..

సాధారణంగా మనం తీసుకొనే ఆహారాల్లో పండ్లకు చాలా ప్రాధాన్యం ఇస్తుంటాం..రోగాన్ని నిలువరించి ఆరోగ్యాన్ని అన్నివిధాలా కాపాడేందుకు ‘సి' విటమిన్ అతి ముఖ్యమైనది. ఈ ‘సి' విటమిన్ ఉండే పళ్లలో నారింజ, నిమ్మ, బత్తాయి, కమలాపండు ముఖ్యమైనవి. వీటినే ‘సిట్రస్' పండ్లు అంటారు. వీటిలో ‘సి' విటమిన్ అధికంగా ఉంటుంది. నాలుగు ఔన్స్‌ల నారింజ పండులో 66 మిల్లీగ్రాములు, ఒక నిమ్మకాయలో 39 మిల్ల్లీగ్రాముల ‘సి' విటమిన్ ఉంటుంది. శరీరంలోని కణజాలంలో కణాలు దగ్గరగా చేరి ఉండటానికి రక్తనాళాల్లో టిష్యూలని కాపాడటానికి అవసరమయ్యే ‘కొల్లాజెన్' పదార్థం కోసం విటమిన్ ‘సి' అత్యవసరం. అందుకే నారింజ, నిమ్మ వంటి పండ్లు తరచూ వాడుతుండాలి. ‘సి' విటమిన్ ఆరోగ్యాన్నే కాక చర్మసౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాదు సిట్రస్ పండ్లలో మరో అద్భుతమైన గుణం కూడా కలిగి ఉంది ఏంటే ఆరోగ్యానికి, చర్మసంరక్షణకే కాకుండా, ఇంటిని శుభ్రపరచడంలో బహు చక్కగా పనిచేస్తాయి. సిట్రపండ్లు గుజ్జు, తొక్కలు వంటి వాటితో చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇంటి పరిశుభ్రతలో సింట్రస్ పండ్ల ప్రభావం ఎంతో ఉంటుందో ఒక సారి చూడండి....
uses citrus fruits cleaning

సిట్రస్ జాతికి చెందిన నిమ్మ: నిమ్మతో ఇంట్లోని, కాపర్ మరియు ఇత్తడి, మెటల్ వంటి దుమ్ము, ధూళి, తుప్ప పట్టిన వస్తువులను సులభంగా శుభ్రం చేయవచ్చు. ప్లాస్టిక్ వస్తువులు, టప్పర్ వేర్, గ్లాస్ డోర్స్, విడోస్, ఇనుము లోహాలు, తుప్పు మరకలను అతి సులభంగా వదలగొడుతుంది. వీటిని నిమ్మ తొక్కతో రుద్ది శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాదు బట్టలపై పడ్డ ఎటువంటి మరకలైనా సరే నిమ్మ తొక్కలు, నిమ్మరసం వేసి శుభ్రం చేసి మరకలను అతి సులభంగా వదలగొట్టవచ్చు. నిమ్మ తొక్కలను డస్ట్ బిన్స్ లో వేయడం ద్వారా చిన్నచిన్న కీటకాలు డస్ట్ బిన్ చుట్టు తిరగకుంటా చెడు వాసనలు రాకుండా అరికడుతాయి. బట్టలు ఉతికే నీటిలో కొద్దిగా నిమ్మరసంను మిక్స్ చేసినట్లైతే దుస్తులు సువాసనతో, తళతళ మెరుస్తుంటాయి. వంటగదిలో ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు, చికెన్ వంటివి ముట్టుకొన్నప్పుడు చేతులకు ఆవాసన అలాగే ఉంటుంది. చేతులకు నిమ్మతొక్కతో రుద్ది కడగడం ద్వారా అటువంటి వాసనలకు చెక్ పెట్టవచ్చు.
ఆరెంజ్: ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అంటారు. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
ఇన్ని సుగుణాలున్నా ఆరెంజ్ ఇంటి పరిశుభ్రతలో ఉపయోపడుతుందంటే ఆశ్చర్యమే...ఆరెంజ్ తొక్క లేదా ఆరెంజ్ గుజ్జులో కొన్ని చుక్కల వెనిగర్ కలిపి ఇంటిని శుభ్రం చేయవచ్చు. అలాగే ఇనుము, గాజుతో తయారు చేసినటువంటి పాత్రలను, గాజు టేబుల్ ను శుభ్రం చేయవచ్చు. లైట్ కలర్ దుస్తులమీద పడ్డ మెండి మరకలను సులభంగా తొలిగించవచ్చు. కొన్ని ఆరెంజ్ తొనలను నీళ్ళలో వేసి ఉడికంచి వాటిని చల్లార్చి బాటిల్ లో పోసి రూమ్ స్ప్రేగా ఉపయోగించి తాజా సువాసనను ఆస్వాదించవచ్చు. ఆరెంజ్ తొక్కలను బుక్స్ రాక్స్ లేదా షూరాక్స్, ఇతర సామాగ్రి నింపే రాక్స్ లో వేస్తే అక్కడ క్రిమి కీటకాలు చేరకుండా ఉంటాయి.
ద్రాక్షపండ్లు: మన అందరికీ తెలుసు ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి, అందానకి ఎంత ప్రయోజకారణి అని. ద్రాక్షను ఫేస్ ప్యాక్ లలోకూడా ఉపయోగిస్తుంటారు. ఇది పరిశుభ్రతలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ద్రాక్ష పండ్ల పొట్టును ఎండబెట్టి ఉప్పునీటితో కలిపి ఆ నీటిని, మెటల్, స్టీల్, ఇత్తడి, వంటి సామాగ్రిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఈ హోంమేడ్ సిట్రస్ ఫ్రూట్ క్లీనర్ తో మార్బల్స్ మీద, బాత్ టబ్ లలో పడ్డ నీటి మరకలను అతి సులభంగా వదలగొట్టవచ్చు. అలాగే ద్రాక్షపండు తొక్కను వైట్ వెనిగర్ తో మిక్స్ చేసి ఫ్లోర్స్ ను శుభ్రం చేయవచ్చు. కాబట్టి చాలా చౌకగా లభించే ఈ సిట్రస్ ఫ్రూట్స్ తో చక్కగా వినియోగించుకొని డబ్బును ఆదా చేసుకోండి.
 

No comments: