శీతాకాలంలో చల్లని గాలుల వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మసౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదా లు, ముఖం, చేతులు, పాదాలు, కురులపై చలిగాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ కాలం లో చర్మం పొడి ఆరిపోయినట్లు ఉండటమే కాక దురద కూడా ఉంటుంది. పెదాలు పగులుతాయి. ముఖం మీద మచ్చలు ఏర్పడతా యి. పాదాల చివర పగుల్లు వస్తాయి. శిరోజా లు చిట్లిపోయి రాలిపోతాయి. చర్మానికి ఏర్పడే ఇటువంటి మార్పుల వలన చర్మ సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిగుసు ఎక్కి ముఖం అంధవికారంగా కనిపిస్తుంది. చలికాలంలో ప్ర త్యేకించి మహిళలు ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి చర్మానికి రక్షణ కల్పించుకోవచ్చు.
శీతాకాలంలో చర్మ సంరక్షణ జాగ్రత్తలు సరేసరి.. మొహంలో సున్నితభాగాలైన పెదాలు, కళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపల్సి ఉంటుంది. ఈకాలంలో పెదాలు తొందరగా పొడిబారతాయి. ఎన్ని లోషన్స్ రాసినా కొద్దిసేపటికే పొడిబారిపోతాయి. మరి ఈ చలికాలంలో మీ పెదాలు నునుపుగా మెరిసిపోతూ ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్న సలహాలు చూద్దాం.
1. పెదాలలో నూనెక్షిగంధులు లేకపోవడం వల్ల తొందరగా చిట్లిపోవడం, పొడిబారడం జరుగుతుంది. తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి.
2. ప్రతిరోజూ పడుకునేముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి.
3. ఎప్పుడూ పెదాలను పొడిగా వదిలేయకుండా, నాణ్యత కలిగిన లిప్ లోషన్ తీసుకుని తరచూ పెదాలకు అపె్లై చేయాలి
4. పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
5. బ్లాక్ టీ బ్యాగ్‌ను గోరు నీటిలో ముంచి రెండు మూడు నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది.
6. ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని నీళ్లు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.

No comments:
Post a Comment