మీ చర్మాన్ని శుభ్రపరచుకోవడానికి చాలా పద్దతులే ఉన్నాయి. అయితే పాలను ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేయడం చాల సులభమైన పద్దతి. క్లెన్సింగ్ కు ఉపయోగించే పాలను మార్కెట్ల్ అమ్ముతారు. అయితే అవి అంత ప్రయోజనాన్నివ్వవు. కాబట్టి క్లెన్సింగ్ కు సాదారణంగా ఇంట్లో ఉపయోగించే పాలను మాత్రమే ఉపయోగించాలి. పాలు ఒక డైరీ ప్రొడక్ట్ పాలతో చాల రకాల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్య ప్ర.యోజనాలు కూడా ఉన్నాయి. పాలను చాలా రకాలైన ఫేస్ మాస్క్ లలో ఉపయోగిస్తారు. పాలు కలిపిన ఫేస్ మాస్క్ లను ముఖాన్ని అప్లై చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రం చేస్తుంది. మీకోసం కొన్ని పాలతో చర్మాన్ని శుభ్రం చేసే హోంమేడ్ క్లెన్సర్స్ ... మీ చర్మం మెరిసేలా...మంచి షైనింగ్ ను అంధిస్తుంది.
పాలు-రోజ్ వాటర్: చర్మాన్ని పాలతో శుభ్రపరచటం. ఇది చాలా సులభమైన పద్దతి. అందుకు చేయాల్సిందల్లా పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ముఖంను సర్కులర్ మోషన్ లో రెండు మూడు నిముషాలు మర్ధన చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
ఓట్ మీల్- మిల్క్ స్ర్కబ్ క్లెన్సర్: ఇది స్ర్కబ్ మరియు క్లెన్సర్ రెండూ. మీకు టైం లేనప్పుడు ముఖాన్ని స్ర్కబ్ చేయాలనుకొంటే, ఈ పద్దతి చాలసులభం మరియు ఒక్క నిమిషంలో చాలు. ఓట్ మీల్ పౌడర్ తీసుకొని దానిక పాలు మిక్స్ చేసి, మెత్తని పేస్ట్ లా చేసి ముఖానకి అప్లై చేయాలి తర్వాత ముఖాని పట్టించి ఒక నిముషం పాటు బాగా మర్ధన చేస్తే చాలు, ముఖాన్ని శుభ్రం చేసి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
పాలు-తేనెతో క్లెన్సింగ్: తేనెలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల కొద్దిగా తేనె చర్మాన్ని శుభ్రం చేసి ముఖాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఒక్క పాలను మాత్రమే అప్లే చేసేకంటే కొద్దిగా తేనె చేర్చి ముఖాన్నికి పట్టించి మసాజ్ చేయడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అందుకు కొద్దిగా నిమ్మరసం కూడా జోడించాలి.
పాలు-పపాయ క్లెన్సర్: పపాయలోని ఎంజైమ్స్ చర్మాన్ని ప్రకాశించేలా చేసి, డెడ్ స్కిన్ ను అతిసులభంగా తొలగిస్తుంది. మీరు, క్లెన్సింగ్ అప్లై చేయడానికి చాలా బద్దకంగా ఉన్నట్లైతే పపాయ ముక్కలను పాలలో ముంచి అలాగే ముఖానికి ఐదు నిముషాల పాటు మర్ధన చేయవచ్చు. దాంతో చర్మం ఫ్రెష్ గా మెరుస్తుంటుంది.
పాలు - క్యారెట్ జ్యూస్ క్లెన్సర్: క్యారెట్స్ లో ఉన్న బీటా కెరోటిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ క్యారెట్ ను ఉపయోగించడం వల్ల చర్మ తాజాగా మెరిసేలా చేసి ముఖంలో ముడుతలను పోగొడుతుంది. ఫేషియల్ క్లెన్సర్ కు మీరు క్యారెట్ రసంలో పాలు, కొద్దిగా పెరుగు కూడా చేర్చి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. అంతే ఈ క్లెన్సర్స్ చర్మ సంరక్షణకు బాగు ఉపయోగపడుతాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.
No comments:
Post a Comment