all

Wednesday, November 21, 2012

చర్మ తత్వాన్ని బట్టి ఫేస్ పౌడర్ ఎంపిక.. వాడకం...

ఫేస్ పౌడర్ అప్లై చేయడం చాలా సులభం, ఫేస్ పౌడర్ అప్లై చేయడం వల్ల సహజ అందంతో పాటు ముఖం ఫ్రెష్ గా, చర్మం తాజాగా కనబడుతుంది. ఫేస్ పౌడర్ ను మీరు వేసుకొనే మేకప్ ను కూడా అందంగా సెట్ చేసి ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుంది. చాలా మంది అమ్మాయిలకు తెలుసు పౌడర్ ను ముక్కు మీద ఎందుకు ఉపయోగిస్తారో.. ముఖంలో ఏర్పడే ఆయిల్ మరియు జిడ్డును తొలగించి క్లీన్ లుక్ ను అందిస్తుంది. అంతే కాదు ఫేస్ పౌడర్ అప్లై చేయడం వల్ల సూర్మ రశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది. వాతావరణ కాలుష్యం నుండి కాపాడుతుంది. కొన్ని రకాల ఫేస్ పౌండర్ ను అప్లై చేయడం వల్ల ముఖంలో మచ్చల మీద, ముడుతల్లో పౌడర్ నిల్వఉండి తడిఆరిన తర్వాత అసహ్యంగా కనబడేలా చేస్తుంది. అది అందవిహీనంగా ఉండి చర్మానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి వాటి ఎంపికలో.. వాటిని వాడే విధానంలో చాలా మెలుకవలు తెలుసుండాలి.

How Apply Face Powder
మనం సాధారణంగా పౌడర్ కొనుక్కునేప్పుడు మంచి కంపెనీ చూస్తాం. కొంతమంది ఏళ్ళతరబడి ఒకే కంపెనీ పౌడర్ ఉపయోగిస్తారు. మరి కొందరు తరచుగా కంపెనీలు మారుస్తుంటారు. ఇక నుంచి ఫేస్ ఫౌడర్ కొనుకునేముందు మీ ఛర్మ స్వభావం, రంగు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వీలైనంతరవకు ముక్కు అదిరిపోయేలా వసనవచ్చే పౌడర్లుకొనవద్దు. ఉపయోగించవద్దు. చాలా పౌడర్లు కొన్ని గంటల తర్వాత వాటి సువాసన కోల్పోతాయి.
పొడిచర్మం: పొడిచర్మంవారు, చర్మం మడతలు పడినవారు క్రీమ్ పౌడర్ను ఉపయోగించాలి. దీనివల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
జిడ్డుచర్మం: మాయిశ్ఛరైజింగ్ ఎపెక్ట్స్ ఇచ్చే ఫేస్ పౌడర్ కొనుక్కోవాలి.
యూత్ పౌడర్: టీనేజ్ అమ్మాయిలు షమ్మర్ పౌడర్ అప్లై చేసుకుంటే వారిలో అందం మాత్రమే కాదు ముఖానికి చక్కటి మెరపు వస్తుంది.
ఈవినింగ్ పౌడర్: సాయంత్రం వేళల్లో అందునా పార్టీలకు వెళ్లేటప్పుడు గ్లిట్టర్ పౌడర్ ఉపయోగించాలి.
పౌడర్ రాసుకోవడం ఎలా? మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటే బాగుంటింది. పౌండేషన్ అప్లై చేసినప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్ ముఖం మీద సరిగ్గా సెట్ అయిందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఫౌడర్ రాసుకోవాలి.
ముందుగా పఫ్ తో ఫౌడర్ అద్ది ముఖానికి అద్దండి ఎప్పడూ పఫ్ తో పౌడర్ రాసుకోవద్దు. పౌడర్ ముఖానికి అద్దడానికి పఫ్ వాడండి, ఆ తర్వాత పౌడర్ బ్రష్ తీసుకుని ఫౌడర్ సరి చేయండి.
ఫేస్ పఫ్ తో మీడియం సైజులో చక్కటి ఆకరం కలిగి మంచి కలర్స్ లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో మీ చర్మ తత్వానికి తగ్గ ఫేస్ పఫ్ ను ఎంపిక చేసుకోవాలి. పౌడర్ ను అప్లై చేయడానికి కంటే పౌడర్ అప్లై చేసి బ్రష్ లు తక్కువ పౌండర్ ను అప్లై చేసి సహజంగా కనబడలే చేస్తుంది. ఒకే సారిఎక్కువగా పౌడర్ ను అప్లై చేయకూడదు. ముందుగా బ్రష్ తో పౌడర్ లో అద్ది ముఖానికికంతటికి అప్లై చేయాలి. ఇలా చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్ ఉపయోగించినట్లైతే ముఖం అందంగా.. ఆకర్షణీయంగా కనబడుతుంది.


No comments: