మాంసం, చేపలు, గుడ్లు, పాలు...
ఫస్ట్ క్లాస్ ఫుడ్. ఆకులు, కాయలు, దుంపలు, పప్పులు... ఇవీ ఫస్ట్ క్లాసే! రెండూ
బలాన్నిచ్చేవే. రెండూ ‘బిల్డప్’కి పనికొచ్చేవే. తేడా ఏంటంటే... ఒకటి మాంసాహారం,
ఇంకోటి శాకాహారం. ఇంకో తేడా ఏంటంటే... మాంసాహారంలో ఒక ఐటమ్‌తో వచ్చే శక్తి ,
శాకాహారంలో అన్నిటినీ కలిపి కొడితే కానీ రాదు. మరేం చేయాలి? సింపుల్. కాయధాన్యాలను
శాకాహారంలో మిక్స్ చేస్తే సరి. చాలినన్ని ‘మాంస’కృత్తులు! వెజ్‌కి ఇలా ఎక్స్‌ట్రా
దమ్మునిచ్చే కాయధాన్యాలే ఈవారం మన కమ్మటి ‘రుచులు’.
ప్రొటీన్ పులావ్ కావలసినవి: బాస్మతి బియ్యం - 120 గ్రా.
ఎండు
బఠాణీ - 20 గ్రా; రాజ్మా - 20 గ్రా.
సోయాబీన్స్ - 20 గ్రా; క్యారట్ తరుగు -
40గ్రా., ఉల్లితరుగు - కప్పు; టొమాటోలు - 3
ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్
స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు
పేస్ట్
కోసం: అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 4; వెల్లుల్లి రేకలు -
6
కొత్తిమీర - చిన్న కట్ట; లవంగాలు - 2
ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న
ముక్క
షాజీరా - టీ స్పూను; పసుపు - కొద్దిగా
తయారి: బఠాణీ, రాజ్మా, సోయా గింజలు, బియ్యం... వీటిని
విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టి, నీరు ఒంపేయాలి.
బాణలిలో నూనె కాగాక
ఉల్లి తరుగు వేసి వేయించాలి.
టొమాటో తరుగు, మసాలా పేస్ట్, పసుపు వేసి బాగా
కలపాలి.
బియ్యం, నానబెట్టుకున్న గింజలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా
కలపాలి.
తగినంత నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో సుమారు పది నిముషాలు ఉడికించి
దింపేయాలి.
అప్పడం, రైతాలతో సర్వ్ చేయాలి.
రాజ్మా కర్రీ కావలసినవి: రాజ్మా - రెండు కప్పులు
రిఫైన్‌డ్
ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను; ఉల్లితరుగు -
కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; పసుపు - కొద్దిగా
టొమాటో ముక్కలు
- కప్పు; ఉప్పు - తగినంత
గరంమసాలా - టీ స్పూను; ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి
తరుగు - టీ స్పూను
ధనియాలపొడి, జీలకర్రపొడి - 2 టీ స్పూన్ల చొప్పున
కొత్తిమీర
తరుగు - కొద్దిగా
తయారి: బాణలిలో నూనె
కాగాక జీలకర్ర వేయించాలి.
ఉల్లితరుగు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు
వేయించాలి.
పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, జీలకర్ర పొడి,
పసుపు, గరంమసాలా పొడి వేసి నూనె వేరు పడేవరకు వేయించాలి
రాజ్మా, మూడు
కప్పుల నీరు, ఇంగువ, ఉప్పు వేసి సుమారు 10 నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్
చేయాలి
(కొన్ని రాజ్మా గింజలను మెత్తగా చేసి జత చేస్తే గ్రేవీలా
ఉంటుంది)
చిక్కుడుగింజల కూర కావలసినవి: తాజా చిక్కుడుగింజలు -
కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు; పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - రెండు
టీ స్పూన్లు
పల్లీలు - కొద్దిగా; ధనియాలు - టీ స్పూను
ఎండుకొబ్బరి -
చిన్నముక్క; వెల్లుల్లి రేకలు - 3
ఉప్పు - తగినంత; ఆవాలు - అర టీ
స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
ఎండుమిర్చి ముక్కలు - టీ
స్పూను
కొత్తిమీర - చిన్న కట్ట; నూనె - 2 టీ స్పూన్లు
కరివేపాకు - రెండు
రెమ్మలు
తయారి: చిక్కుడుగింజలను
శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్‌లో ఉడికించాలి.
పల్లీలు, ధనియాలు
వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి
చేయాలి.
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు,
ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి.
కరివేపాకు, ఉల్లితరుగు,
పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు
వేయించాలి.
చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి
ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర
చల్లాలి.
సోయా - టొమాటో కర్రీ కావలసినవినానబెట్టిన సోయాబీన్స్ - కప్పు
టొమాటో
తరుగు - కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు - పావు
కప్పు
ఉల్లితరుగు - అర కప్పు; సోంపు - 2 టీ స్పూన్లు
పుదీనా ఆకులు - అర
కప్పు
వెల్లుల్లి రేకలు - 3; పచ్చిమిర్చి - 6
జీడిపప్పు పలుకులు - 10;
బాదంపప్పులు - 6
ఏలకులపొడి, పసుపు, కారం, గరంమసాలా- టీ స్పూను చొప్పున;
కొత్తిమీర - కొద్దిగా
నానబెట్టిన మీల్‌మేకర్ - అరకప్పు
తయారి:ఒక పెద్ద పాత్రలో సోయాబీన్స్, తగినంత ఉప్పు,
నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో ఉంచి, పది విజిల్స్ వచ్చేవరకు
ఉడికించాలి.
బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక, వెల్లుల్లి రేకలు వేసి
వేయించాలి.
పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, బాదంపప్పు, సోంపు, ఏలకుల పొడి
వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.
సగం ఉల్లితరుగు వేసి వేయించాక, సగం
టొమాటో తరుగు జత చేసి బాగా కలపాలి.
చల్లారాక పుదీనా ఆకులు జత చేసి మిక్సీలో
వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి.
బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె
వేసి, మిగిలిన ఉల్లితరుగు, టొమాటో తరుగు, క్యాప్సికమ్ తరుగు, మీల్‌మేకర్ వేసి
బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.
కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి
బాగా కలపాలి. ముందుగా చేసి ఉంచు కున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు
ఉడికించాలి.
కొద్దిగా నీరు జతచేసి ఐదు నిముషాలు ఉడికించిన తరువాత,
సోయాబీన్స్‌ని వేసి నాలుగైదు నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్
చేయాలి.
వంకాయ - చిక్కుడుగింజల కూర కావలసినవి: వంకాయలు - పావు కిలో
చిక్కుడు గింజలు
- పావు కప్పు
పసుపు - చిటికెడు;
జీలకర్రపొడి, కారం - పావు టీ స్పూను
చొప్పున
ధనియాలపొడి - టీ స్పూను; నూనె - ఒకటిన్నర టీ
స్పూన్లు
అల్లంవెల్లుల్లిపేస్ట్ - టీ స్పూను; కొత్తిమీర -
చిన్నకట్ట
పచ్చిమిర్చి - 3; జీలకర్ర - అర టీ స్పూను; కరివేపాకు - రెండు
రెమ్మలు
తయారి: చిక్కుడు గింజలకు
కొద్దిగా నీరు, ఉప్పు జతచేసి ఉడికించాలి.
బాణలిలో నూనె కాగాక జీలకర్ర,
కరివేపాకు వేసి రెండు నిముషాలు వేయించాలి.
ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి
వచ్చేవరకు బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి నాలుగైదు నిముషాలు
వేయించాక, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి
కలపాలి.
వంకాయముక్కలు, కొద్దిగా నీరు వేసి బాగా కలిపి, సన్నని మంట మీద పది
నిమిషాలు ఉడికించాక, చిక్కుడు గింజలు జత చేసి, మరో ఐదు నిముషాలు ఉంచి,
దించేయాలి.
న్యూట్రీషియస్ దోసె కావలసినవి: మినప్పప్పు - అరకప్పు; బార్లీ -
అరకప్పు
బియ్యం - కప్పు; పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు, సోయాబీన్స్
- అర కప్పు చొప్పున
నానబెట్టిన మెంతులు - టేబుల్ స్పూను
అటుకులు - పావుకప్పు;
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత; చీజ్ తురుము - 50 గ్రా.
కొత్తిమీర -
చిన్న కట్ట; నూనె - కొద్దిగా
క్యారట్ తురుము - 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి
తరుగు - టీ స్పూను;
ఉల్లితరుగు - పావు కప్పు
తయారి: అన్నిరకాల పప్పులు, బియ్యం, బార్లీ,
సోయాబీన్స్‌ని ఆరు గంటలసేపు నానబెట్టాలి.
నీరు వడకట్టి, మిక్సీలో వేసి
మెత్తగా చేసి పక్కన ఉంచుకోవాలి.
తగినంత నీటిలో అటుకులను పావుగంట సేపు
నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
రుబ్బి ఉంచుకున్న పిండి మిశ్రమంలో
అటుకుల పిండి కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచాలి. జీలకర్ర వేసి
కలపాలి.
స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండిని దోసెలా వేసి, పిండి పచ్చిగా
ఉండగానే, పైన క్యారట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కొద్దికొద్దిగా వేసి
బాగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.
No comments:
Post a Comment