ఎప్పటికైనా అన్ని వయసులూ దాటుకుని వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వృద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు' అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా! చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి. ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే 'మీరే కాలేజి' అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రకృతి ప్రసాదితాలు పళ్లు-కూరలు : క్యాబేజీ, బ్రొకొలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్ ఇవన్నీ విటమిన్లు సమృద్ధిగా గల కూరగాయలు. విటమిన్ ఎ, సిలు కంటి చూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి. పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారినపడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్లకింపైన రంగులున్న కూరగాయలు గుండె జబ్బులను, మానసిక వత్తిడి, డిజార్డర్స్ వంటి జబ్బుల నుంచి రక్షణనిస్తాయి. ఇంకా క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇక పళ్ల విషయానికొస్తే బొప్పాయి, అరటిపండు, సపోటాల్లో ఐరన్, పొటాషియం, విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపునిచ్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం. టమాటా: అధిక రోగనిరోధకశక్తి గల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ', 'ఇ' విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్‌లో ఫేస్ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు. ఎండుఫలాలు: బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్ ఇ, ఐరన్, పొటాషియమ్, జింక్, ఒమెగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి. పెరుగు-తేనె: పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది అరుగుదలను మెరుగుపరిచే ఆహారం. తేనె శక్తినిచ్చే ఔషధం. తేనె వత్తిడిని తగ్గించడమే గాక మతిమరుపును కూడా అరికడుతుంది. బెర్రీస్: స్ట్రాబెర్రీస్, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడుపండ్లలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెరవ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి. సోయాబీన్స్: ఇవి హార్మోన్ ఇంబాలెన్స్‌ను అరికడుతుంది. బ్రెస్ట్, పేగు, ఉదర క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. వయసు పైబడనీయకుండా ఇందులో ఉన్న సైటిక్ యాసిడ్స్ ఉపయోగపడతాయి. హార్ట్, అల్జీమర్ జబ్బులను, ఈస్ట్రోజన్‌ను అరికడుతుంది. మెనోపాజ్ దశను దరిచేరకుండా నిరోధిస్తుంది. నీళ్లు-పళ్లరసాలు: శరీరం మెరుస్తూ ఉండాలంటే రోజూ ఎంత ఎక్కువ నీరుతాగితే అంత మంచిది. ఒకటి, రెండు కూరగాయల, లేదా పళ్లరసాలు తీసుకోవడం చాలా మంచిది. సొరకాయ, దోసకాయ, ఆరెంజ్, బత్తాయి, నిమ్మరసం మంచిది. కొబ్బరి నీళ్లలో కూడా అందాన్ని పెంచే గుణాలు అధికం. పుచ్చకాయ: పుచ్చకాయ చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఇందులో ఎ, బి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉండి చర్మాన్ని పునరుజ్జీవింప చేస్తాయి. గింజల్లో ఉన్న సోడియం, జింక్, విటమిన్-ఇ గుణాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కొకోవా: ఇందులో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైన రక్తప్రసరణకు సహకరిస్తాయి. లో, హై బ్లడ్‌ప్రెషర్స్‌ను నివారిస్తుంది. దీన్ని కేకుల్లో, మిల్క్‌షేక్స్‌లో వాడడం మంచిది. ఇక చాక్లెట్స్ అయితే బిట్టర్ చాక్లెట్స్ ఉపయోగించాలి. ఇతర చాక్లెట్లలో ఉన్న ఫాట్ ఇందులో ఉండకపోవడం వల్ల ఇవి అందాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇచ్చిన ఆహారపు సూత్రాలన్నీ పాటిస్తే ఇంతకు మించిన ఆరోగ్య, సౌందర్య సాధనాలు ఇక వేరే ఏమీ ఉండవనేది మీరే గ్రహిస్తారు. ఇవి కాకుండా కొద్దిపాటి వ్యాయామం సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజే ఈ ఆరోగ్య సూత్రాల్ని పాటించి నవయవ్వనం సొంతం చేసుకోండి మరి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
నవయవ్వనానికి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment