ఈరోజుల్లో సొంతిల్లు, అదీ ఇండిపెండెంట్ ఇల్లు అంటే కలల్లోనూ కష్టసాధ్యమైన పనైపోయింది. అందుకే అపార్ట్‌మెంట్లకు ఆదరణ ఎక్కువైంది. అనుకున్న బడ్జెట్‌లో, కావలసిన సదుపాయాలుండి, రక్షణతో వుండే అపార్ట్‌మెంట్లే నేడెక్కడ చూసినా! అపార్ట్‌మెంట్ అనగానే పదిమందితో కలిసి జీవించడం. అపార్ట్‌మెంట్ వాసులు వేసుకునే జోక్ ఏంటంటే... 'ఇది మన సొంతమే. కానీ గోడ మనది కాదు, నేల మనది కాదు, పైకప్పు మనది కాదు' అని! అది నిజమే! అంటే ఓరకంగా సర్దుబాటు జీవితం అన్నమాట!
పదిమందితో కలిసి నివసించా లనుకుంటే అందుకు అను గుణం గానే ప్రవర్తించాలి. అలా కాకుండా ప్రతిదానికీ ఆగడం చేసుకునే వారు తామూ ప్రశాంతతగా ఉండలేరు, తోటివారినీ ఉండనివ్వరు.
గోటితో పొయ్యేదానికి...
పిల్లలన్నాక ఆడతారు. కేకలేస్తారు. మెట్లపై పరుగులు తీస్తారు. దానికే హైబీపి తెచ్చేసుకుంటే అవో పెద్ద తగాదాలుగా మారతాయి. సరిగ్గా మనం పార్క్ చేసేచోటే మరొకరు బండి పార్క్‌చేస్తారు. వాళ్లింటి ఎదురుగా కుండీలు పెట్టుకుంటారు. ఓకే! కానీ, అందులోని నీరు కాలువలా మన గుమ్మంలోకి వచ్చేస్తోందే! అంతేనా! లేచింది మొదలు పడుకునేదాకా కుక్కరు కూతలు, టివి మోతలు ఇవన్నీ అపార్ట్‌మెంట్లలో సహజాతి సహజం. వాటిని భూతద్దంలో చూస్తే మనశ్శాంతి దొరకదు. ఇబ్బందిని సున్నితంగా చెప్పి సరిచేసుకోవాలి. మెల్లగా నచ్చ చెప్పాలి. అంతే తప్ప గొడవ చేయాలని చూస్తే సంబం ధాలు దెబ్బతింటాయి. ఒక చోట వుంటున్నప్పుడు సత్సం బంధాలు చాలా ముఖ్యం.
ఇల్లన్నాక విందులు, వినోదాలు జరుగుతాయి. పుట్టినరోజులు, సందళ్లు ఉంటాయి. ఆ హడావిడి, హంగామా మన ఇంటికి మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఉత్సాహం అత్యుత్సాహంగా మారితే ఇబ్బందే! పాటలు పెద్దగా పెట్టడం, స్పీకర్లతో హోరెత్తించడం పక్కింటివారికి కునుకు లేకుండా చేస్తుంది. ఆ ఇంట్లో చదువుకునే పిల్లలుండొచ్చు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులుండొచ్చు. ఇవన్నీ మనం అర్థంచేసుకోవాలి. అదే పరిస్థితిలో మనం ఉంటే ఎంత విసుక్కుంటామో, అచ్చం వారికీ అలానేగా! ఇక ఇబ్బంది మనకు వచ్చినపుడు వెళ్లి మెల్లగా చెప్పాలి. అంతేతప్ప, అరుస్తూ చెబితే అయిపోదు. మర్నాటినుండి ముఖాముఖాలు చూసుకోవాలనేది గుర్తుంచుకోవాలి.
అపార్ట్‌మెంట్లో అంతా కలిసికట్టుగా వుండటం అన్నివిధాలా శ్రేయస్కరం. ఉన్నట్లుండి పిల్లాడికి జ్వరం వచ్చింది. సమయానికి శ్రీవారు లేరు. అప్పుడు తోడుగా వచ్చేదెవరు? అదనే కాదు, ఏ కష్టంవచ్చినా బంధుమిత్రులకన్నా ముందు ఆదుకునేది మన ఇరుగు పొరుగువారే. అలాంటి వారిని చిన్న చిన్న మనస్పర్థలతో దూరం చేసుకోవడం సరికాదు.
ఆచితూచి...
పిల్లలు ఒకరితో ఒకరు ఇట్టే కలిసిపోతారు. పిల్లల గొడవల్లో పెద్దలు తల దూర్చకూడదు. వాళ్లు అప్పటికప్పుడు కలహించుకున్నా, వెంటనే మరిచిపోతారు. కానీ, అందులో పెద్దలు జోక్యం చేసుకుంటే చిలికి చిలికి గాలివానవుతాయి. అందుకే, పెద్దలు ఈ విషయంలో దూరంగా ఉండటమే బెటర్!
అపార్ట్‌మెంట్లో వున్నవారికి పరస్పర సాయాలు అవసరమవుతాయి. కొందరికి ఇతరుల సహాయం తీసుకున్నప్పుడు ఉండే కలివిడితనం, వారికి సాయం చేయాలనేసరికి మాయమవుతుంది. అది సరికాదు. అవసరాన్ని బట్టి సాయం చేయాలి. అయితే, అపాత్రదానాలు మంచివికావు. చేయలేని సాయాన్ని ముందే చెప్పేయాలి. మొహమాటాలకు పోయి ఇక్కట్లపాలు కాకూడదు.
ఆరాలు- బేరాలు
ఆసక్తి సహజం. కానీ, కొందరికి ప్రతిదీ ఆరానే. వ్యక్తిగత విషయాలు, ఆదాయాలు, అప్పులు, విమర్శలు... ఇలా వాటికి అంతుండదు. అనవసర జోక్యాన్ని వెంటనే ఖండించాలి. చనువు మితిమీర కూడదు. అలాగే, ఇరుగింటి పొరుగింటి ముచ్చట్లు విన డానికి బాగానే ఉంటాయి. రేపు వాళ్లు మన గురించీ అలాగే మాట్లా డొచ్చు. అందుకే, వీటికి ముందే ఫుల్‌స్టాప్ పెట్టే యాలి. చెవులు కొరుక్కోవ డాన్ని కట్‌చేయాలి.
ఒక పనిమనిషి రెండిళ్లలో పనిచేసినపుడు మా ఇంట్లో ముందంటే మా ఇంట్లో ముందని పోటీపడ కూడదు. అవసరాన్ని బట్టి ఇద్దరూ సర్దుబాటు చేసు కోవాలి. అనవసరంగా గొడవలు పడితే అసలుకే మోసం. అలాగే, పనిమనుషులను ఇరుగుపొరుగు గురించి ఆరాతీయడం సభ్యత కాదు. మనం అడుగుతున్నట్లే పక్కింటివాళ్లూ మన గురించి అడగొచ్చు. చిలవలు పలవలుగా కల్పించుకుని చెప్పుకుంటే ఆ క్షణానికి సరదాగానే వుంటాయి. కానీ, అవే ఏదో ఒకరోజు పీకకు చుట్టు కుంటాయి.
వాచ్‌మెన్ ఉన్నాడు కదాని ప్రతి పని అతనికే చెబితే అందరికీ నష్టం! అసలే రక్షణ కరువైన రోజుల్లో ఉన్న వాచ్‌మెన్ అటూ ఇటూ తిరుగుతుంటే... ఆనక జరగ రానిది జరిగితే ఎవరు బాధ్యులు?
కొందరు మిగతా సరదాలేమీ ఆపుకోరు. కానీ, మెయింటెనెన్స్ సమయానికి కట్టరు. వాచ్‌మెన్ జీతం, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు... వీటన్నింటికీ మెయిం టెనెన్స్ ఆధారం.
ఒకరికొకరుగా...
స్నేహభావంతో మెలగాలన్నది కరెక్టే! కానీ, అది సాకుగా చేసుకుని చీరలు, నగలు అడగడం సరికాదు. ఎదుటివారితో పోల్చుకుని వస్తు వులు అమర్చుకోవాలనుకుంటే అప్పుల పాలవడమే కాదు, సంతృప్తి అనేది వుండదు. ఇవే కాదు, పక్కింటివారి వద్ద అప్పులు చేయడం అసలే కూడదు. అంతా కలిసి వేడుకలు, పిక్నిక్‌కు ఏర్పాటు చేసుకోవడంవల్ల ఒకరికొకరు పరి చయం అవుతారు. తలా ఒక వంటకం వండుకుని కలిసి తింటే సరదాగా ఉంటుంది. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. పండుగల్లో మిఠాయిలు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరి కూరలు మరొకరు రుచి చూపించుకోవడం ఆప్యా యతలు పెంచుతాయి. ఎదురైనపుడు నవ్వుతూ పలకరించుకుంటే మనసుకు ఆహ్లాదంగా వుంటుంది. ఇరుగు పొరుగు సాంగత్యం హాయిగా వుంటుంది. మానవ సంబంధాలు అరుదైపోతున్న ఈ రోజుల్లో... బతుకు తెరువుకోసం ఉన్న ఊరికి, కన్నవారికి ఆమడ దూరంలో జీవిస్తున్న ఈ కాలంలో... గిరిగీసుకుని పెంచుకున్న నిస్తేజాన్ని పారద్రోలాలంటే నలుగురితో కలవాలి. అపార్ట్‌మెంట్ జీవితం అందుకు దోహద పడుతుంది. సంతోషాలను పెంచి సంఘజీవిగా మార్చుతుంది.

No comments:
Post a Comment