శివుడు చాలా సింపుల్.
అనుగ్రహం కూడా ఈజీగా లభిస్తుంది. శివా అంటే చాలు... ఉపవాసం ఉన్నా... పూర్తి ఉండలేకపోయినా కూడా... అనుగ్రహిస్తాడు. మీరు ఏమీ తినలేకుండా ఉండ లేరా... అయితే ఈ శివరాత్రి ప్రసాదాలను భక్తితో ఆరగించండి... శివుడి ఆశీస్సులు పొందండి... ఫ్రూట్ దహీ కావలసినవి పుచ్చకాయ ముక్కలు - పావు కప్పు అర టిపండు ముక్కలు - పావు కప్పు ద్రాక్ష పండ్లు - పది దానిమ్మ గింజలు - పావు కప్పు పంచదార పొడి - మూడు టీ స్పూన్లు పెరుగు - రెండు కప్పులు తయారి ఒక గిన్నెలో పెరుగు వేసి వెన్న తేలేలా చిలకాలి. పంచదార వేసి బాగా కలపాలి. తరిగి ఉంచుకున్న పండ్ల ముక్కలను వేసి కలుపుకోవాలి. (ఏ పండ్లు అందుబాటులో ఉంటే వాటితో తయారుచేసుకోవచ్చు. ఇష్టపడేవారు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు) మూంగ్‌దాల్ - మ్యాంగో కావలసినవి పెసరపప్పు - కప్పు వేరుశనగపప్పు (పల్లీలు) - పావు కప్పు మామిడికాయ తురుము - 2 టీ స్పూన్లు పచ్చికొబ్బరి తురుము - రెండు టీ స్పూన్లు కొత్తిమీర - కొద్దిగా ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి) తయారి పెసరపప్పు, వేరుశనగపప్పులను విడివిడిగా మూడు నాలుగు గంటల సేపు నానబెట్టి నీళ్లు వడకట్టాలి. ఒక గిన్నెలో ఈ పప్పులను, పచ్చిమామిడి తురుము, కొబ్బరి తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. ఐదారు నిముషాలు నాననివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. (మామిడికాయ బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు) చిలగడదుంపల స్వీట్ కావలసినవి చిలగడదుంపలు - అర కేజీ బెల్లం - పావు కేజీ నెయ్యి - రెండు టీ స్పూన్లు ఏలకుల పొడి - అర టీ స్పూను తయారి చిలగడదుంపల చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. గుండ్రంగా పెద్ద సైజులో ముక్కలు తరగాలి. ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న చిలగడ దుంప ముక్కలు, తురిమిన బెల్లం, కొద్దిగా నీరు వేసి సన్నని మంటపై ఉడికించాలి. దింపే ముందు రెండు టీ స్పూన్ల నెయ్యి, ఏలకుల పొడి వేసి కలపాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి. సేమ్యా దద్ధ్యోదనం కావలసినవి సేమ్యా - ఒక కప్పు పెరుగు - 2 కప్పులు పచ్చిమిర్చి - 3 మిరియాల పొడి - కొద్దిగా కరివేపాకు - రెండు రెమ్మలు కొత్తిమీర - కొద్దిగా ఆవాలు - అర టీ స్పూను ఎండుమిర్చి - నాలుగు నెయ్యి - టీ స్పూను ఉప్పు - తగినంత తయారి ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి మరిగించాలి. సేమ్యా వేసి బాగా ఉడికించి దించాలి. నీటిని వడకట్టి, సేమ్యాను చన్నీళ్లలో వేసి పైపైన కదిపి నీళ్లలో నుంచి తీసేయాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, మిరియాలపొడి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ఉడికించిన సేమ్యా, వేయించి ఉంచుకున్న పోపు, ఉప్పు వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం కావలసినవి సగ్గుబియ్యం - ఒక కప్పు పాలు - 4 కప్పులు పంచదార - కప్పు జీడిపప్పు పలుకులు - 15 కిస్‌మిస్ - గుప్పెడు ఏలకులు - 6 (పొడిచేసుకోవాలి) తయారి సగ్గు బియ్యాన్ని ఆరేడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్ననిమంటపై ఉడికించాలి. అడుగు అంటకుండా కలుపుతుండాలి. ఉడికిన తరువాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి. చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి. ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలిపి దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి. చలిమిడి కావలసినవి బియ్యం - ఒక కప్పు బెల్లం తురుము - అర కప్పు ఏలకులు - నాలుగు ఎండుకొబ్బరి ముక్కలు - అర కప్పు నెయ్యి - కొద్దిగా తయారి బియ్యాన్ని నీళ్లలో ఆరు గంటలు నానబెట్టి, నీళ్లు వడకట్టి, ఒక పొడి బట్ట మీద నీడలో తడి పోయేవరకు ఆరబెట్టాలి. మిక్సీలో వేసి పిండి చేసుకుని జల్లించుకోవాలి. బెల్లం తురుము పిండిలో వేసి మళ్లీ ఒకసారి మిక్సీలో వేసి కలిసేలా తిప్పుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని ఏలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. ఎండుకొబ్బరి ముక్కలు వేసి కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. చిట్కాలు కొన్నిరకాల పండ్లు మాత్రమే ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అటువంటి వాటిని ఎంచుకుంటే ఫ్రూట్ సలాడ్ రుచిగా ఉంటుంది. కొన్నిరకాల కూరముక్కలు కూడా ఫ్రూట్ సలాడ్స్‌లో ఉపయోగించుకోవచ్చు. క్యారట్, కీరా వంటివి పండ్లతో కలిసిపోతాయి. ఫ్రూట్ సలాడ్ తయారుచేసుకునేటప్పుడు అందులో రకరకాల ద్రవాలను అభిరుచి మేరకు ఉపయోగించుకోవచ్చు. పెరుగు, పాలు, క్రీమ్, ఎసెన్స్... వంటివి వాడితే రుచిగా ఉండి తేలికగా తినగలుగుతారు. సేమ్యాను కొద్దిగా నేతిలో వేయించి వాడుకుంటే ముద్దలా కాకుండా పొడపొడలాడుతూ వస్తుంది. సగ్గుబియ్యాన్ని కొద్దిసేపు నీటిలో నానబెట్టి, ఉడికించే సమయంలో నెయ్యి వేస్తే, గింజలు అతుక్కుపోకుండా వస్తాయి. చిలగడదుంపల చెక్కు తీయడం వలన మట్టి లేకుండా శుభ్రంగా ఉంటుంది. కర్టెసీ బి.మాధవి మోతీనగర్, హైదరాబాద్ సేకరణ డా.వైజయంతి |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
మహా ప్రసాదం-వంటలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment