స్వీట్
కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ (క్యూబ్స్) - అరకేజి, కొబ్బరిపాలు - 160 మి.లీటర్లు, బ్రౌన్ షుగర్ - 80 గ్రా.
తయారుచేసే విధానం:గుమ్మడి ముక్కల్ని ఆవిరిపై మెత్తగా ఉడికించి మెదపాలి. ఒక లోతైన స్టీల్ పాత్రలో గుమ్మడి గుజ్జు, కొబ్బరిపాలు, బ్రౌన్ షుగర్ కలపాలి. వెడల్పాటి పాత్రలో మూడొంతులు నీరుపోసి, మధ్యలో గుమ్మడి మిశ్రమం పాత్రను ఉంచి, మిశ్రమం చిక్కబడేవరకు నీటిని మరిగించాలి. చల్లారిన తర్వాత ఒక పొడి సీసాలోకి తీసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. పిల్లలు బాగా ఇష్టపడే స్వీట్ ఇది.
సూప్
కావలసిన పదార్థాలు: బటర్ - 1 టీ స్పూను, చిన్న ఉల్లిపాయ - 1, వెజిటెబుల్ స్టాక్ - 3 కప్పులు, గుమ్మడికాయ గుజ్జు - 1 కప్పు, సోయాసాస్ - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 1 కప్పు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారుచేసే విధానం: బటర్‌లో ఉల్లితరుగు వేసి 3 నిమిషాలు వేగించాలి. ఇప్పుడు వెజిటెబుల్ స్టాక్, గుమ్మడి గుజ్జు, సోయాసాస్ కలిపి చిన్నమంటపై 15 నిమిషాలు మరిగించాలి. కొద్దికొద్దిగా కొబ్బరిపాలు కలుపుతూ 20 నిమిషాలు ఉంచి, ఉప్పు, మిరియాలపొడి కలిపి దించేయాలి. సర్వ్ చేసేముందు కొత్తిమీరతో అలంకరించాలి.
దోశ
కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ గుజ్జు - అరకప్పు, మైదా - 1 కప్పు, బ్రౌన్ షుగర్ - 1 టేబుల్ స్పూను, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, వంటసోడా - చిటికెడు, ఉప్పు - అర టీ స్పూను, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను, జాజికాయ, మిరియాల పొడి - పావు టీ స్పూను చొప్పున, గుడ్డు - 1, మజ్జిగ - 1 కప్పు, నూనె - కాల్చడానికి సరిపడా, బటర్ - 1 టీ స్పూను.
గ్రేవీ కోసం :ఒక పెద్ద గిన్నెలో మైదా, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, వంటసోడా, ఉప్పు, మిగిలిన పొడులు వేసి కలపాలి. మరో గిన్నెలో గుడ్డు గిలకొట్టి కరిగించిన బటర్, గుమ్మడి గుజ్జు, మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాలో పోస్తూ ఉండలు చుట్టకుండా జారుగా కలిపి 10 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత దళసరిగా దోశల్లా పోసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. వీటిని ఉదయం ఫలహారంగా చేసుకోవచ్చు.

No comments:
Post a Comment