చిట్టికథ
పరమేశ్వరుని ఆజ్ఞతో మూకాసురుడనే రాక్షసుడు పందిగా మారి అర్జునుడి మీదికి వచ్చాడు. అర్జునుడు ఆ పంది మీదికి బాణాన్ని ప్రయోగించాడు. సరిగ్గా అదే సమయానికి ఓ కిరాతకుడు అంటే బోయవాడు వెనకాలనుంచి ఆ పందిమీద బాణం వేశాడు. పంది చచ్చిపోయింది. దాన్ని తీసుకెళ్లడానికి బోయవాడు రాగానే ఏ జీవిపైనైనా సరే, వెనకనుంచి బాణం వేయడం తప్పంటూ అర్జునుడు అతణ్ని మందలించాడు. బోయవాడు కోపంతో మండిపడి దుర్భాషలాడాడు. అర్జునుడికీ కోపం వచ్చింది. ఇద్దరూ కలబడ్డారు. అర్జునుడి పట్లన్నింటినీ కిరాతకుడు చిత్తు చేసేస్తున్నాడు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ కిరాతకుణ్ని జయించలేకపోతుండంతో ఎదుటివాడు సామాన్యుడు కాడని గ్రహించాడు అర్జునుడు. దాంతో ఆ బోయవాడి కాళ్లు పట్టుకున్నాడు. వెంటనే ఆ బోయవాడు మాయమై, శివుడు పార్వతీ సమేతంగా అర్జునుడికి దర్శనమిచ్చాడు. పరమేశ్వరుణ్ణి చూసిన అర్జునుడు ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేసి, స్తోత్రం చేశాడు. శివుడు అర్జునుని బలపరాక్రమాలను మెచ్చుకుని, అతను కోరిన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. శివుడికి భక్తులంటే అంత ప్రేమ! - బాచి |
No comments:
Post a Comment