-ప్రతిచిన్న విషయానికి వ్యతిరేకధోరణిలో విపరీతమైన ఒత్తిళ్లతో ఉండకూడదు. మీరే అలా ఉంటే మిమ్మల్ని వారు గమనించినపుడు అలాగే ఉండాలేమో, ఏ విషయానికైనా అలాగే స్పందించాలేమో అనుకొనే అవకాశం కూడా ఉంది. -పిల్లల్ని చదువు, చదువు అని పోరుపెట్టడం వారికి చదువుపట్ల అయిష్టత ఏర్పడేలా చేయవచ్చు. అలా వారికి మాటిమాటికీ చెప్పడంతో చదవడం వారి బాధ్యత అనేదానికంటే ముందు చెప్పడం మీ బాధ్యత అన్నట్లుగా అర్థం చేసుకుంటారు. అయితే మీరు వారి ఎదురుగా ప్రతిరోజూ కొంతసమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే మీకు వారిని చదువుకోమని చెప్పే అవసరం చాలావరకు తగ్గినట్లే అవుతుంది. చదువుకోవడానికి సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి అనేది వాళ్లు మీనుంచి నేర్చుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. -క్రమశిక్షణ, బాధ్యత ఇవి కూడా మిమ్మల్ని గమనించడం ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. మీరు మీ పెద్దవాళ్ళతో నడుచుకునే తీరు, తల్లిదండ్రుల మధ్య ఉండే సత్సంబంధాలు, మాట్లాడుకునే విధానం ఇవన్నీ పిల్లలు గమనిస్తూనే ఉంటారు. చాలా కుటుంబాల్లో పిల్లలు పెద్దవాళ్ళ మాటలను లెక్కచేయకుండా ఉండటమనేది చాలావరకు ఆయా కుటుంబాల తీరు అయిఉంటుంది. -మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ రావాలని, తోటి కుటుంబ సభ్యుల పట్ల, తాము చేయవలసిన పనుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మీరు కోరుకోగానే సరిపోదు, అవన్నీ నేర్చుకోవడానికి వారు మిమ్మల్నే పాఠశాలగా ఎంచుకుంటారనే విషయాన్ని మరచిపోకండి. -మీరు పిల్లలతో మాట్లాడే తీరు ఎంత ముద్దుగా, కచ్చితంగా, ప్రేమగా, ఆప్యాయంగా ఉంటుందో వారు అంత మంచివారుగా, మంచి మాటలు మాట్లాడేవారుగా, మంచి సంబంధబాంధవ్యాలు నెరపే వారుగా తయారవుతారు. -పిల్లలు మీ మాటతీరును గమనిస్తూనే ఉంటారు. అదే ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అనేదానికి వారు ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి పిల్లల ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం వారికి చెప్పే పాఠాలుగానే తీసుకోవాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
పెద్దలూ! ఇలా ప్రవర్తించవద్దు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment