విమాన ప్రయాణాలు చేస్తున్నా సమయంతో పరుగులు తీయలేకపోతున్న స్పీడు యుగంలో ఉన్నాం మనం. ఇంటిదగ్గర మోపెడ్ ఎక్కితే మళ్లీ సాయంత్రం మోపెడ్ దిగడమే...మధ్యలో కంప్యూటర్ ముందు కుర్చీ కదలని ఉద్యోగం. ఇక ఇంటికి చేరిన వెంటనే అలసటతో బెడ్‌పైకి చేరటం! ఈ క్రమంలో కాస్త నడిచే ఖాళీ ఎక్కడ? రకరకాల పనివేళల్లో మార్నింగ్ వాక్ అనే మాట మరిచిపోయినవారు ఎందరో? ఆటో..! అని పిలవకుండా నాలుగడుగులు వేయవీలులేకపోవడం ఇప్పుటికి బిజీ అయితే రేపటికి అనారోగ్యం. అంతే. అందుకే ఇన్ని గందరగోళాల మధ్య కూడా నడకను నిర్లక్ష్యం చేయొద్దని మొరపెట్టుకుంటున్నారు పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు. మరి మీరు రోజులో ఎంత సేపు నడుస్తున్నారు?... శారీరక వ్యాయామం గొప్పతనాన్ని ఇలా చెప్పవచ్చు. 'శారీరక వ్యాయామం వలన జీవితకాలం పెరగడమే కాదు, పెరిగిన జీవితకాలానికి జీవమూ వస్తుంది' అంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు అని. శారీరక వ్యాయామం వలన శరీరం తేలిక పడుతుంది. పనిచేసే శక్తి, కష్టాలను ఎదుర్కొనే శక్తీ పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో వాకింగ్‌కు సమయం కేటాయించుకునే వారి శాతం కాస్తయినా మెరుగు పడిందంటే దానికి కారణం పెరుగుతున్న ఆరోగ్య సమస్యలే. నగరాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ఉదయంపూట రోడ్లమీద, పార్కుల్లో నడిచేవారి సంఖ్య బాగానే కనిపిస్తున్నా అది చాలా తక్కువ శాతమనే చెప్పాలి. నడిస్తే చాలు శారీరక వ్యాయామాల్లో నడక అంత సులువైనది మరొకటి లేదని చెప్పవచ్చు. ఎలాంటి ఖర్చూ ఉండదు. జిమ్‌కి వెళ్లక్కర్లేదు, వ్యాయామ సామగ్రి అక్కర్లేదు, శిక్షణ అవసరం లేదు. ఉదయం పూట నడవటం వలన ప్రయోజనం అధికంగా ఉంటుంది. అదీ అవకాశం ఉంటే చెట్ల గాలి పీలుస్తూ నడవటం మరింత ఆరోగ్యకరం. ట్రాఫిక్ పెరిగిన తరువాత సాగించే నడక వలన వాహనాల నుంచి వెలువడిన కాలుష్యాన్ని పీల్చాల్సివస్తుంది. పది నిమిషాలతో మొదలు నడక పూర్తిగా అలవాటు లేని వారు ఒక్కసారిగా నడవటం మంచిది కాదు. మొదట పది నిముషాలు, పావుగంటతో మొదలుపెట్టి తరువాత పెంచుతూ పోవాలి. వారానికి ఒకసారి ఈ కాలపరిమితిని పెంచుతూ పోవచ్చు. రోజుకి నాలుగయిదు కిలోమీటర్ల వరకు నడవవచ్చు. వారానికి 30 కిలోమీటర్లు, నెలకి 100 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేయవచ్చు. ప్రతిరోజు ఎంత దూరం నడుస్తున్నారో రాస్తుండండి. ఒకవారం తక్కువ దూరం నడిచినట్టుగా గుర్తిస్తే ఆ కొరతని తరువాత వారంలో పూర్తి చేయండి. అలాగే ఒక నెలలో తక్కువ నడిస్తే తరువాత నెలలో పెంచవచ్చు. మొత్తం మీద సంవత్సరానికి 1000 కిలోమీటర్ల వరకు నడిచేలా ప్రణాళిక వేసుకోండి. ఎలా నడవాలి -బ్రిస్క్‌వాకింగ్ మొదలుపెట్టే ముందు కండరాల సడలింపుకి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. దీనివలన అవి గాయాలకు గురికావు. -నడకని మొదలు పెట్టేటపుడు ముందు కొద్ది నిముషాలపాటు నెమ్మదిగా నడవాలి. తరువాత నడకలో వేగం పుంజుకోవాలి. నడిచేటపుడు చాలా నిటారుగా ఉండాలి. శరీరాన్ని ఎక్కడా వంచకూడదు. అలాగే తలను కూడా. -భుజాల్లో ఏమాత్రం పట్టులేకుండా చూసుకోండి. అలాగే చేతులు కూడా శరీరానికి వేలాడుతున్నట్టుగా వదిలేయాలి. రెండుకాళ్లు ఒకే తరహాలో అడుగులు పడేలా- లయబద్ధంగా కదలాలి. శరీరంలో ఏ భాగమూ హెచ్చుతగ్గులతో ఒంగకుండా నిటారుగా ఉండేలా చేతులు ఊగేలా నడవాలి. -అడుగుల దూరంలో తేడా ఉండకూడదు. ప్రతి అడుగుకి మధ్యదూరం ఒకేలా ఉండాలి. మోకాలు, తొడల ప్రాంతంలో కదలిక తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి. -నడిచేటపుడు ముందు కాలిమడమ నేలమీద ఆనాలి. తరువాత పాదం అడుగుభాగం మీద, ఆ తరువాత వేళ్లమీద శరీరం బరువు పడేలా నడవాలి. -తలను మరీ కిందికి వాల్చేయకుండా నిదానంగా అడుగుకు తగినట్టు కదపాలి. -నడకను ఆపేటపుడు కూడా మొదలుపెట్టిన విధంగానే నిదానంగా నడుస్తూ ఆపాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
నాజూకుతనానికి నడకే మార్గం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment