all

Tuesday, January 1, 2013

‘వీపు’ భాగం అందంగా...కాంతివంతంగా మెరిసిపోవాలంటే...?

మహిళలకు పురుషుల కంటే సౌందర్య ప్రజ్ఝ అధికంగా ఉంటుంది. అందుకు ఫాషనబుల్ డ్రెస్ ధరించడానికి తమ ఆకృతి బట్టి ఎంచుకోవడం మంచిది. డీప్ నెక్ డ్రెస్ ను ధరించడం ఈప్పుడు ఫ్యాషన్ అయింది. సెలబ్రెటీలను గమనించినట్లైతే వారు ధరించే చీరల్లోని బ్లౌజులు, గౌనుల్లో కూడా వారి వీపు భాగం ఎంత అందంగా క్లియర్ గా మెరిసే చర్మం కనబడుతుంటుందో.

చీరలో బ్లౌజ్ కుట్టించుకోవడానికి టైలర్ కు కొలతలు ఇచ్చేటప్పుడే వారికి నచ్చిన విధానంలో కుట్టమని డీప్ నెక్ ను పెట్టమని టైలర్ కు ఎక్కువగా సలహాలిస్తుంటారు.

మరి చీరలో నైనా... డ్రెస్ కైనా డీప్ నెక్ పెట్టించుకొనే ముందు తమ శరీర సౌందర్యం, ఆకృతి, వీపు వెనుక వైపు భాగం సౌందర్యంగా ఉందో లేదో అన్న విషయాన్నిగుర్తించాలి. వీపు వెనుకవైపున డ్రెస్ లేదా బ్లౌజ్ డీప్ నెక్ పెట్టించుకునే వారు ముందుగా వీపు బాగం హైలైట్ గా కనబడాలే చూసుకోవాలి. లేదంటే ఆ వేసుకొనే డ్రెస్ ఎంత అందంగా కుట్టించినా దాని అందమే పోతుంది. కాబట్టి డీప్ నెక్ ఒక్కదానికే ప్రాధాన్యతమిస్తే సరిపోదు. వీపు బాగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

డీప్ నెక్ పెట్టించుకొని మీకు ఇష్టమైన డ్రెస్ ను ధరించడానికి ఇటువంటి (వీపు బాగం నల్లగా, మొటిమలు, మచ్చలు)సమస్యలు ఎదురైనప్పుడు చింతించాల్సిన అవసరం లేదు అందుకు కొన్నిచిట్కాలను పాటించినట్లైతే మీకు నచ్చిన డ్రెస్ ను అందంగా అలంకరించుకోవచ్చు.


get clear glowing back

1. స్టీమ్ బాత్:

వేడినీళ్ళ స్నానంతో వీపుబాగం చర్మం శుభ్రపడుతుంది. ఎందుకంటే వేడినీళ్ళ స్నానం వల్ల చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మం లోపలి బాగం నుండి శుభ్రం చేసి కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. వేడినీళ్ళ స్నానానికి వెళ్ళడానికి పదిహేను నిముషాల ముందు వీపు బాగానికి బాడీ ఆయిల్ ను మర్దన చేసుకొని వేళ్ళాలి. దాంతో చర్మం మెత్తబడి చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మంలోపల దాగివున్న దుమ్ము, ధూళి, కణాలను తొలగిస్తుంది. ఒక వేళ వీపు బాగంలో మొటిమలు, మచ్చలు ఉన్నట్లైతే అందుకు ఉపయోగపడే మిడిసినల్ సోప్ ను వాడాలి.

2. స్ర్కబ్బింగ్:

స్ర్కబ్బింగ్ వల్ల చర్మంలో దాగివున్న దుమ్ము, ధూళికణాలను తొలగించడానికి ఈ స్ర్కబ్బింగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకు లూఫా లేదా బ్యాక్ స్ర్కబ్ ను ఉపయోగించవచ్చు. లూఫా అనేది నేచురల్ స్ర్కబ్ ఇది చర్మాన్ని సహజంగా శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది.

3. స్పాంజింగ్:

స్ర్కబ్బర్ కంటే కొంచెం సున్నితమైనది స్పాంజ్ దీన్ని ఉపయోగించడం వల్ల బ్యాక్ పోర్షన్ కాంతివంతంగా మారుతుంది. చర్మమీద పేరుకొన్ని మృతకణాలను తొలగించడానికి స్పాంజ్ తో రుద్దితే సరిపోతుంది. స్పాంజ్ తో రుద్దడం వల్ల చర్మానికి ఎటువంటా హానీ కలగకుండా సున్నితంగా ప్రకాశవంతంగా మారుతుంది.

4. నల్లమచ్చలను కవర్ చేయాలి:

మొటమల తాలుకు మచ్చలు చాలా ఇబ్బంది కరంగా కనిపిస్తుంటాయి. ఈ నల్ల మచ్చలు ఉన్నప్పుడు డీప్ నెక్ డ్రెస్ లు, బ్లౌజులు వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మచ్చలను కనబడకుండా చేయాలంటే కన్సీలర్ ను ఉపయోగించాలి. కన్సీలర్ ను మ్యాజిక్ మేకప్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్ల మచ్చలను, చర్మం మీద ఏర్పడ్డ చారలను, గీతలను కనబడనీయకుండా చేస్తుంది. మెడిసినల్ కన్సీలర్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మచ్చలను కనబడనీయకుండా చేయడమే కాకుండా అదే టైంలో మచ్చలకు, మొటిమలకు చికిత్సలా ఉపయోగపడుతుంది.

5. ఆయిల్ మసాజ్:

రెండు రోజులకొకసారి ఆ ఆయిల్ మసాజ్ వీపు బాగానికి చేయడం వల్ల చర్మం మెరవడమే కాకుండా శుభ్రపడుతుంది. అందుకు ఎసెన్సియల్ ఆయిల్స్ ను(బాదాం నూనె, ఆలివ్ నూనె, లావెండర్ నూనె) ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ సీజన్ కూడా చలికాలం కాబట్టి ప్రతి రోజూ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడి మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది.

 

No comments: