all

Tuesday, December 4, 2012

ఫ్లోరైడ్ ఉన్న నీరు ప్రమాదమా!

మనం తాగే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. కలుషిత నీరు ఎంతో ప్రమాదకరం. అందునా ఫ్లోరైడ్, ఇతర లవణాలు అధికశాతంలో ఉన్న నీరు మరీ ప్రమాదకరం. ఇది నేరుగా మన శరీర వ్యవస్థనే దెబ్బతీస్తుంది.

నీటిలో ఫ్లోరైడ్ శాతం 1.5 మి.గ్రా. కంటే ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. మెడ వంగిపోవడం, కాళ్లు, చేతులు వంకరలు తిరగడం, ఎముకలు పెళుసుగా తయారై విరిగిపోవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. దురదృష్టమేమంటే ఈ నీటిని చాలాకాలం నుంచీ తాగుతున్నప్పటికీ దాని ప్రభావం తొలిదశలో ఏమీ తెలియదు. కనీసం 12 సంవత్సరాల నుంచి బయటపడుతూ ఉంటుంది. పంటిమీద పచ్చగా గార ఏర్పడుతుంది. దీని ద్వారా ఫ్లోరైడ్ సోకిందని చెప్పవచ్చు

No comments: