‘ఎఫెక్షన్... యాక్సెప్టెన్స్... అచీవ్‌మెంట్... ఈ మూడు పదాలు ఆంగ్లభాషలో ‘ఏ’తో మొదలవుతాయి. ఈ మూడు ‘ఏ’లను మేము మా పెంపకంలో పాటించాం. మా పిల్లల అభివృద్ధికి కారణం ప్రేమ.. అంగీకారం... సాఫల్యం’ అన్నారు శ్రవణ్, సంజయ్‌ల తల్లిదండ్రులు కుమరన్, జ్యోతిలక్ష్మిలు. ‘పిల్లలను ప్రేమించాలి. వారి ఇష్టాయిష్టాలను స్వీకరించాలి. అప్పుడే వారు ఏ విజయాన్నైనా సాధించగలరు’ అంటారు వాళ్లు. ఈ భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వీరు సమీప బంధువులు. ‘‘బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా మాకు పరిచయమై 1998లో వివాహం చేసుకున్నాం. మంచి అవకాశం రావడంతో కాపురాన్ని యూఎస్‌కు షిఫ్ట్ చేశాం. అక్కడ పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారిపై పాశ్చాత్య ప్రభావం ఉండకూడదని 2004 డిశంబరులో శాశ్వతంగా ఇండియాకు వచ్చేశాం. నాది బెంగళూరైనా, మా వారిది చెన్నై కావడంతో చెన్నైలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాం’’ అన్నారు జ్యోతి లక్ష్మి. డబ్బు కాదు... పిల్లలే ముఖ్యం ‘‘పెద్దబాబును రెండవ తరగతి, చిన్నబాబును యూకేజీలో చేర్పించాక నేను చెన్నైలోని ఒక ప్రముఖ అమెరికన్ కంపెనీలో డెరైక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. తను మాత్రం పెద్దజీతం కోసం పిల్లల జీవితాన్ని తాకట్టుపెట్టకూడదన్న ఉద్దేశ్యంతో ఉద్యోగం జోలికి వెళ్లలేదు’’ అన్నారు కుమరన్. ‘‘బిడ్డల పెంపకంలో మేమిద్దరం ఎవరిపాత్ర వారిదిగా వ్యవహరించాం. పిల్లలు డ్రీమ్స్‌ను సెట్ చేసుకోలేరు, అందుకే అన్ని విషయాల్లోనూ ఎంకరేజ్ చేసేదానిని’’ అని చెప్పారు జ్యోతి ‘‘చిన్నప్పుడే ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ సైంటిస్టులు, వారి గొప్పదనం, వారు కనుగొన్నవాటి గురించి ఎక్కువగా చెప్పేదానిని. విమానాన్ని రైట్ బ్రదర్స్ మొదటగా కనుగొన్నారు, మీరు కూడా మన దేశానికి ఏదైనా తయారు చేసి ఇవ్వాలని చెప్పాను. భారతదేశంలో ఒక గొప్ప కంపెనీ మీ ఇద్దరి నుండి రావాలని బోధించాను’’ అన్నారామె. ప్రశ్నించడమే జ్ఞానం... ‘‘నేను హోమ్‌సైన్స్‌లో చైల్డ్‌సైకాలజీ చదివాను, ఇది నా పిల్లల పెంపకంలో ఎంతో పనికివచ్చింది’’ అని జ్యోతిలక్ష్మి ఆనందపడ్డారు. ‘‘అది ముట్టుకోవద్దు, ఇది చెడిపోతుంది... అంటూ పిల్లలకు పెద్దలు ఆంక్షలు విధించడం తప్పు. ఉదాహరణకు.. టీ కప్పు కిందపడితే పగిలిపోతుందని పిల్లలకు తెలియాలంటే వారిచేతికి ఇచ్చితీరాలి. లేకపోతే అలానే డార్క్‌లో మిగిలిపోతారు’’ అన్నారామె. ‘‘ఇంటిలోని కంప్యూటర్‌లో ఆఫీసు పనిచేసుకుంటున్నపుడు మూడు నాలుగేళ్ల వయసులోనే ఇద్దరూ వెనుక నిలబడి గమనించేవారు. ప్రతి చిన్నవిషయాన్నీ ప్రశ్నించేవారు, ఇద్దరం ఓపిగ్గా బదులిచ్చేవాళ్లం’’ అని సురేంద్రన్ అన్నారు. ‘‘కంప్యూటర్ వారిలోని ఆసక్తికి బీజం వేసింది. క్రమేణా వారే సొంతగా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్పించడం ప్రారంభించాం. అవసరమైన పుస్తకాలను ఇచ్చాం. చాలా వేగంగా వాటిల్లోని అంశాలను అందిపుచ్చుకోవడం ప్రారంభించారు. మొదట మొబైల్ ఫోన్ ప్రోగ్రామింగ్ చేస్తామన్నారు. అది నాకు తెలియకపోవడంతో అందుకు సంబంధించిన పుస్తకాలను తెచ్చిచ్చాను’’ అని సురేంద్రన్ తెలిపారు. సంస్థ స్థాపన.. ‘‘హైస్కూలు విద్యార్థులుగా కేవలం ఏడేళ్ల సాధనతో గో డైమన్షన్స్ అనే కంపెనీని రిజిష్టర్ చేయించారు. మొబైల్‌ఫోన్స్‌లో గేమ్స్, లెర్నింగ్ అప్లికేషన్స్, లైఫ్‌స్టైల్ అప్లికేషన్స్ తయారుచేశారు. ఐపాడ్, ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్‌లలో అప్లికేషన్‌ను డెవలప్‌చేసే సాఫ్ట్‌వేర్‌ను వీళ్లు కనుక్కొన్నారు. జావా, సీ లాంగ్వేజ్‌ల ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను డెవలప్ చేశారు. ఇటువంటి సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో పూర్తిగా కొత్త. క్యాచ్‌మీ కాప్, కలర్ పల్లెట్, ఆల్ఫాబీట్ బోర్డ్, ప్రేయర్ ప్లానెట్ అనే నాలుగు మొబైల్ అప్లికేషన్స్‌ను పిల్లలు కనుగొన్నారు. ఈ నాలుగు అప్లికేషన్స్ 43 దేశాల్లో ప్రఖ్యాతి పొందాయి, 18 వేల డౌన్‌లోడ్లు అయ్యాయి. డౌన్‌లోడ్ ఉచితంగా పెట్టినా ప్రకటనల ద్వారా ఆపిల్ కంపెనీ నుండి కేవలం ఆరునెలల్లో 200 యూఎస్ డాలర్లను పిల్లలు ఆర్జించారు’’ అన్నారు ఇద్దరూ. ప్రేమ - భక్తి ‘‘భగవంతుని పట్ల భక్తిభావనను పిల్లల్లో పెంచడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. అందుకే పిల్లలు తమ కంపెనీకి గో డైమన్షన్స్ అనే పేరుపెట్టుకున్నారు. కంపెనీ తొలి మూడు ఇంగ్లీషు అక్షరాలు కలిపి చదివితే గాడ్ అని వస్తుంది. అలాగే డైమన్షన్స్ అంటే ఒకేదానికి కట్టుబడకుండా భిన్నకోణాల్లో ఎదగాలనే భావనను సంస్థ పేరు ద్వారా మా పిల్లలు వెలిబుచ్చారు. ఒకసారి మేం నలుగురం చెన్నై నుండి యూఎస్‌కు బయలుదేరాం. విమానం గాలిలో తీవ్రంగా కుదుపులకు లోనైంది. నాకు భయమేసింది. నా బ్యాగులో భద్రపరుచుకునే దేవుని విగ్రహం కోసం పాకులాడాను. ఎంతో వెతికిన తరువాత విగ్రహం దొరికింది. దానిని ఒళ్లో పెట్టుకుని ప్రార్థించాను. మా పిల్లలు ఇదంతా గమనించారు. విమానం యూఎస్‌లో ల్యాండయ్యేలోగా ప్రేయర్ ప్లానెట్ అనే మొబైల్ అప్లికేషన్‌ను కనుగొన్నారు. మొబైల్ ద్వారా సులభరీతిలో అన్నిమతాల దేవుళ్ల బొమ్మలను చూస్తూ నామస్మరణను వినేలా అప్లికేషన్‌ను అప్పటికప్పుడే రూపొందించారు. ఈ ప్రేయర్ ప్లానెట్ ఎంతో ప్రఖ్యాతిని పొందింది. అలాగని వారు పుస్తకాల పురుగులు కారు. సంగీతం, గానం, నాట్యం, రచన, క్రీడలు అన్నింటిలో మెచ్చదగిన ప్రవేశం ఉంది. మొబైల్‌లో రూట్‌మ్యాప్, వాతావరణ కాలుష్యశాతాన్ని తెలుసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేయాలని, అంధులు మనిషి తోడు లేకుండా సెల్‌ఫోన్ సహాయంతో నడిచే సాఫ్ట్‌వేర్‌ను క నిపెట్టాలని మా పిల్లలు భావిస్తున్నారు. పిల్లలు స్నేహితుల్లా మెలగాలని చెప్పడం ఇద్దరి మధ్య అనుబంధాన్ని శాశ్వతం చేస్తుంది. అందుకే మా పిల్లలు ప్రతి విషయాన్నీ మాతో షేర్ చేసుకుంటారు. ఉన్నత చదువులున్న తల్లిదండ్రులే పిల్లలను తీర్చిదిద్దగలరని చెప్పలేం. పిల్లల ఆసక్తిని గుర్తించడం, తగిన విధంగా ప్రోత్సహించడంలోనే ఉంటుంది పెంపకంలోని మెళకువ. లెట్ దెమ్ డ్రీమ్ బిగ్ ’’ అంటూ ముగించారు ఆ తల్లిదండ్రులు. - కొట్రా నందగోపాల్, బ్యూరో చీఫ్, చెన్నై ఫొటోలు: వన్నె శ్రీనివాసులు టీ కప్పు కిందపడితే పగిలిపోతుందని పిల్లలకు తెలియాలంటే కప్పును వారిచేతికి ఇచ్చితీరాలి. లేకుంటే అలానే డార్క్‌లో మిగిలిపోతారు అంటారు కుమరన్ కపుల్. ఈ ప్రోత్సాహమే శ్రవణ్ (13), సంజయ్ (11) లు గోడెమైన్షన్స్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించి, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించేలా చేసింది. ప్రస్తుతం తమ కంపెనీకి ఒకరు చైర్మన్‌గా, మరొకరు సిఈవోగా ఉన్న ఈ వండర్ కిడ్స్‌తో తల్లిదండ్రులు జ్యోతిలక్ష్మి, సురేంద్రకుమరన్ | |||
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, December 4, 2012
బిగ్ బాసెస్..!---అలా పెంచాం *;*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment