all

Tuesday, December 4, 2012

సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం...

నందివర్ధనం పూలను ఎక్కువగా దేవుని పూజకు వాడతారు. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. ఇందులో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి. రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి వర్షాకాలం, ఎండకాలం ఎక్కువ పూస్తాయి. శీతాకాలంలో తక్కువగా పూస్తాయి. కొత్త ఆవిష్కరణల్లో భాగంగా పువ్వు రంగులో మార్పు రాలేదు కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చ, తెలుపురంగులు మిళితమై వస్తున్నాయి. ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. తాజా ఆవిష్కరణల్లో వీటిని కుండీల్లో పెంచడానికి వీలుగా ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే పెరిగేటట్లు చేస్తున్నారు. నందివర్ధనం పూలు సీజన్ లో లెక్కలేనన్ని పూస్తాయి. ఎక్కువ రోజలు పూస్తాయి. పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది.

How Grow Nandivardhanam At Home Garden
నూనె రాసినట్లుగా నిగనిగలాడే ఆకుల మధ్యనుంచి అయిదు రేకులతో నక్షత్రాల్లా విప్పారిన గరుడవర్ధనం పూవును చూస్తున్నా, ప్రసన్నతకు మరో పేరులా ధవళవర్ణంలో ముద్దగా మెరిసే నందివర్ధనాలను చూస్తున్నా మనసు పవిత్ర భావనతో, ప్రశాంతతో నిండిపోతుంది. నలుపుతెలుపుల సమ్మేళనమే, సమన్వయమే జీవితమనే గొప్ప సత్యాన్ని నందివర్ధనాలు మనకు చెబుతున్నట్లుంటుంది. అనాదిగా ఇంటి తోటలో పెంచుకునే ఈ మొక్కల శాస్ర్తియ నామం ఒకటే- టాబర్‌నేమాంటోనియా కొరొనేరియా! వీటిని కేప్ జాస్మిన్ అని కూడా అంటారు.
ఏడాది పొడవునా పూసే ఈ మొక్కలు ఒక మీటరునుంచి నాలుగుమీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. ఈమధ్యకాలంలో బాల్కనీల్లో సైతం పెంచుకునేలా, కుండీలో పెంచుకోడానికి అనువుగా అర మీటరు లోపునే ఉండి 365 రోజులూ పూసే నందివర్ధనం రకాన్ని సైతం ఉత్పత్తిచేసారు. మామూల మొక్కలనైనా మరీ ఎత్తుగా పెరగకుండా అవసరమైన మేరకు ప్రూన్ చేయవచ్చు. ఈ మొక్కలను పశువులు, జంతువులు ముట్టుకోకపోవటం గొప్ప విశేషం. కొమ్మలను నాటడం ద్వారా వీటిని ప్రవర్ధనం చేస్తారు.
నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతిని, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులు పేర్కొన్నాయి. గృహ చికిత్సలు...
అప్పుడప్పుడు నందివర్ధనం చెట్టుకు ఆకులుకు తెగులు పట్టి ముడతలు పడుతుంటాయి. వర్షాకాలం మొదట్లో ఈ తెగులు మొదలవుతుంది. పురుగు ఆకులోని రసం పీల్చేస్తుంది. ఈ పురుగులను బొచ్చు పురుగులు అంటాం. బొచ్చు పురుగుకి రక్షణ కవచం. మనం పైన స్ప్రే చేసిన మందులు పురుగును చేరకుండా బొచ్చు అడ్డుకుంటుంది. పురుగు లేత దశలో అంటే రక్షణ కవచం ఏర్పడక ముందే జాగ్రత్త పడాలి. అప్పుడైతే ఏ సాధారణమైన పురుగుమందు చల్లినా పురుగు చనిపోతుంది. ఈ పురుగు పోవడానికి చల్లే మందులను నందివర్థనం మొక్క ఆకుల మీ దచల్లకూడదు, చెట్టు మొదట్లోచల్లాలి.

No comments: