all

Wednesday, June 12, 2013

నిద్రలేమిని అధిగమించడమెలా?

 

ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక పోవడాన్ని నిద్రలేమి (ఇన్‌సోమ్నియా) అంటారు.

కారణాలు
పని ఒత్తిడి

హృదయ, శ్వాససంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం వలన

విపరీతమైన ఆలోచనలు

శక్తికి మించిన పని చేయటం, కోపం, చిరాకు పడటం

మానసిక ఆందోళన

దాంపత్య జీవితం సరిగా లేకపోవటం

ఆహార విహారాలు మొదలగునవి.

లక్షణాలు
కారణం లేకుండా నిద్రపట్టకపోవటం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢనిద్రలోకి చేరుకోలేకపోవడం

కొంతమందికి తొందరగానే నిద్రపడుతుంది కాని అర్ధరాత్రి మెలకువ వస్తుంది.

చాలామంది నిద్రపోయిన తర్వాత నిద్రలేచే సమయానికంటే చాలా ముందరే మెలుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఎంత ప్రయత్నించినా వీరికి నిద్రరాదు.

మగవారిలో కన్నా ఆడవారిలో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ వ్యాధి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం వలన నిద్రలేమి వ్యాధి వస్తుంది.

వాత వ్యాధి వలన వచ్చే నిద్రలేమి
భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు
-రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి
-పడుకునే ముందు పాలు త్రాగాలి.
-వేడి ఆహరం తినటం మంచిది
-ఒత్తిడితో కూడిన పని చేయరాదు.

పిత్తదోష జనిత నిద్రలేమి
నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలా సార్లు మెలకువ వస్తుంది. శరీరం నొప్పులు, భయం, కోపం, బాధ మొదలగునవి లక్షణాలుంటాయి.

దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు:

-మసాలా పదార్థాలు తీసుకోకపోవటం మంచిది.

- ఉపవాసం చేయరాదు.

కఫదోష జనిత నిద్రలేమి
తెల్లవారు త్వరగా నిద్రలేవటం జరుగు తుంది. అలసట ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది. దీనిని నివారించుకోవటానికి
-వ్యాయామం చేయటం
-గోరు వెచ్చని నీరు త్రాగాలి.
-తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిద్రలేమి వ్యాధిని ఔషధ సేవనం ద్వారా, పంచకర్మ చికిత్సల ద్వారా పూర్తిగా నివారణ చేయవచ్చును. ప్రాణాయామం చేయటం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చును. ఒత్తిడి తొలగి పోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఆయుర్వేద వైద్యనిపుణుల పర్యవేక్షణలో రోగ నిర్ధారణ చేసుకుని ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో తగ్గించవచ్చు.

నిద్రలేమి అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరు...
-వ్యాయామం చేయాలి.
- కెఫిన్ లాంటి పదార్థాలు తీసుకోకూడదు.
-మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.
- ఒత్తిడి తగ్గించు కోవాలి.
- పగటి నిద్ర మంచిది కాదు.
-ఆహార విహారాలు మార్చు చేసుకోవాలి.
-పడుకునే ముందు పాలు త్రాగాలి.
-కడుపును ఖాళీగా ఉంచకూడదు. అలాగని మరీ మితిమీరి కూడా తినకూడదు.

డాక్టర్ రమణ రాజు,
ఎం.డి (ఆయుర్వేద),
స్టార్ ఆయుర్వేద,
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
ph: 7416 101 101 / 7416 102 102
 

No comments: