all

Tuesday, January 7, 2014

తెల్ల జుట్టు నివారణకు బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్

తెల్ల జుట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో పొందడం సహజం. ముఖ్యంగా గతంలో వయస్సు పెరగడం వల్ల హార్మోనుల అసమతుల్యతతో తెల్ల జుట్టు ఏర్పడుతుండేది. కానీ ప్రస్తుత కాలంలో ఒత్తిడి, జీవశైనలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల, కాలుష్యం వల్లకూడా చిన్న వయస్సులలోనే చాలా మంది తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. తెల్ల జుట్టుకు ప్రధాణ కారణం అనారోగ్యకరమైన డైట్, టన్స్ లో ఒత్తిడి వంటివి ప్రధాన కారణంగా ఉన్నాయి .

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మీరు కూడా ఒకరైతే, మీరు మీ జుట్టు కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. అందువల్ల మీ జుట్టు మొదల్లో మెలనిన్ ఉత్పత్తికి కొంత సమయం ఉంటుంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటాన్ని, దాచుకోవడం కూడా కష్టమైన పనే. ఈ సమస్య ఉన్నవారు వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ తెల్లజుట్టును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.



తెల్ల జుట్టు సమస్య ఉన్నప్పుడు, మార్కెట్లో దొరికే కొన్ని రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించే తెల్లజుట్టు కనబడకుండా చేస్తారు, కానీ జుట్టు మొదళ్ళు మాత్రం బలహీనపడుతాయి . అందువల్ల, తెల్లజుట్టు నివారణకు కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి మీ జుట్టును సహజంగా, నేచురల్ కలర్ ఉండేట్లు పెంచుకోండి . అటువంటి హోం రెమెడీస్ కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా ఉన్నాయి.



అల్లం: మీ తెల్లజుట్టును, నేచురల్ హెయిర్ కలర్ పొందాలంటే, ఈ హోం రెమెడీని ప్రయత్నించాల్సిందే. కొంచెం అల్లం తీసుకొని, చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి, కొద్దిగా పాలు జత చేసి చిక్కటి పేస్ట్ గా తయారుచేసి, మీ తెల్లజుట్టుకు పట్టించి , పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే, మంచి ఫలితం ఉంటుంది.


తేనె:  తేనె ఉపయోగించడం వల్ల మీ జుట్టు నేచురల్ గా కనిపిస్తుంది. తెల్ల జుట్టుకు కొంచెం, తేనె అప్లై చేయడం వల్ల మీ జుట్టు నేచురల్ గా మారుతుంది.


కొబ్బరి నూనె:   కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం పిండి, మిక్స్ చేసి, తలకు పట్టించడం వల్ల మీ జుట్టు రంగా నేచురల్ గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిం, పది నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.



పాలు: పాలు జుట్టుకు మంచి షైనింగ్, పోషణ అంధించడంతో పాటు, నేచురల్ కలర్ ను కూడా అంధిస్తుంది . కాబట్టి, ఒక కప్పు పాలను తలమీద పోసుకొని, ఐదు, పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో షాంపుపెట్టి, తలస్నానం చేసుకోవాలి.

కరివేపాకు:   పొడిబారిన మరియు జిడ్డుగల జుట్టు బెస్ట్ హోం రెమెడీ కరివేపాకు అని నిపుణుల సలహా.అంతే కాదు, ఇంకా ఇది తెల్లజుట్టుకు కరివేపాకు నేచురల్ హెయిర్ కలర్ అంధిస్తుంది.


పెరుగు: పెరుగు, మరియు హెన్నా రెండూ సమంగా తీసుకొని, మెత్తగా పేస్ట్ ను కలుపుకొని, తలకు ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ రసం ఉల్లిపాయ రసం మరియు ఉల్లిపాయ గుజ్జును తలకు పట్టించడం వల్ల జుట్టు మంచి షైనింగ్ తో పాటు, నేచురల్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. ఈ హోం రెమెడీని నాలుగు వారాలకొకసారి ప్రయత్నించండి.




బ్లాక్ పెప్పర్:

ఉడికించిన బ్లాక్ పెప్పర్ వాటర్, తెల్లజుట్టు నివారణకు ఒక మంచి హోం రెమెడీ. ఇది తెల్లజుట్టుకు వ్యతిరేకంగా నేచురల్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. తలస్నానం చేసిన తర్వత చివరగా ఒక మగ్గు బ్లాక్ పెప్పర్ వాటర్ ను తలరా పోసుకోవాలి.


ఆమ్లా:  జుట్టు సంరక్షణ విషయంలో ఈ హోం రెమెడీని పురాత కాలం నుండి ఉపయోగిస్తున్నారు.జుట్టుకు ఉసిరి ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్. మీ తెల్ల జుట్టును నివారిస్తుంది. మరియు జుట్టుకు మంచి షైనింగ్ తో పాటు, బలాన్ని కూడా చేకూర్చుతుంది.


బ్లాక్ టీ లేదా కాఫీ: బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ హెయిర్ కేర్ కు నేచురల్ గా చలా మంచిది. అదే విధంగా మీ గ్రేహెయిర్ ను నివారించడంలో కూడా ఈ నేచురల్ కలర్ అంధించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

వింటర్ హెయిర్ కేర్ టిప్స్ ఫర్ బ్యూటిఫుల్ హెయిర్

ఈ కాలంలో పొడిజుట్టు మరింతగా పొడిగా తయారవుతుంది. స్టీమ్‌ హీట్‌ వాడినా లేదా బయట ఎక్కువసేపు తిరిగినా జుట్టు మరింత పొడిబారుతుంది. అధికంగా షాంపు చేసుకోకుండా ఉండడం మంచిది. నరిషింగ్‌ షాంపూల్ని వాడాలి. కండీషనర్లు వాడితే ఫలితం కనిపిస్తుంది.

షాంపు చేసుకున్న ప్రతిసారీ కండిషనర్‌ వాడుతుంటే జుట్టు మృదువుగా మెరుస్తుంది. మెరుపును పెంచే సెరం లేదా క్రీమ్‌లను ఉపయోగించాలి. తలస్నానం తర్వాత జుట్టును డ్రయ్యర్‌ ద్వారా కాకుండా సహజంగా ఆరబెట్టుకోవాలి. ఏ మందుల షాపునకు వెళ్లినా, సూపర్‌మార్కెట్లకు వెళ్లినా ముఖానికి, శరీరానికి, కళ్లకు, చేతులకు, గోళ్లకు రకరకాల క్రీమ్‌లు, లోషన్లు జెల్‌లు దర్శనమిస్తున్నాయి.

వింటర్ హెయిర్ కేర్ టిప్స్ ఫర్ బ్యూటిఫుల్ హెయిర్

మరి శిరోజాల సంగతేంటి?

మాడు చికిత్సలు, హెడ్‌మసాజ్‌లు, లీవ్‌ ఇన్‌ క్రీమ్స్‌ అన్నీ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. రాత్రివేళ పడుకునే ముందు తలకు చికిత్సలు బాగా ఉపకరిస్తాయి. సమయంలో విశ్రాంతిగా ఉంటారు. మురికి జిడ్డు పగటివేళ మిరుమిట్లు గొలిపించే లైటింగ్‌ బెడద, సూర్యకిరణాల తాకిడి ఇవేమీ అస్సలు ఉండనే ఉండవు. అన్నింటికీ మించి శిరోజాల పట్ల తగినంత శ్రద్ధ చూపగల సమయమూ ఉంటుంది.

శరీరమూ,శిరోజాలు కూడా ఎటువంటి స్ట్రెస్‌ లేకుండా ఉండి, రాత్రివేళ చికిత్సలకు అనకూలంగా ఉంటాయన్న సంగతిని గుర్తించాలి. రాత్రివేళ పడుకునే ముందు తలను వందసార్లు దువ్వెనతో దువ్వుకుంటామని అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పే మాటల్ని గుర్తుచేసుకోవాలి. చాలామంది ఈ మాటల్ని కేవలం అపోహ మాత్రమే అని కొట్టివేస్తారు. అయితే ఇది ప్రభావవంతమైన రొటీన్‌ అని పరిశోధనలు పేర్కొంటు న్నాయి.

దీనివల్ల మాడుకు చక్కని మసాజ్‌ చేసినట్లు అవుతుంది. మృత కణాలు తొలగిపోయి, జుట్టు పట్టుకుచ్చులా మాదిరి మెరుస్తూ చిక్కులు పడకుండా ఉంటుంది. విభిన్న స్ట్రోక్స్‌ రాత్రికి రాత్రి శిరోజాల రక్షణ అన్నది ఒకప్పుడు కొత్త కాన్సెప్ట్‌గా మారింది. అనేక కొత్తకొత్త ఉత్పత్తుల్ని కనుక్కోవడం వల్ల ఈ రంగంలో నూతన దృక్పథం, జిజ్ఞాస పెరిగాయి.

తలకు నూనెపెట్టి మసాజ్‌ చేసిన ప్పుడు శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు శిరోజాలకు చక్కని తేమ, కండీషనింగ్‌ లభిస్తుంది. నిద్రించడానికి ముందువేళ్లతో సింపుల్‌గా మాడును మసాజ్‌ చేసుకున్నా శిరోజాల మాడుకణాల్ని ఉద్దీప్తం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలాగే, జుట్టు రాలకుండా క్రీమ్‌లు, ఎనర్జీ సెరంలాంటి వాటిని రాత్రివేళ రాస్తేనే ఫలితం ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని రకాల ఓవర్‌ నైట్‌-యూజ్‌ సెరమ్స్‌(మార్కెట్‌లో లభిస్తాయి) పొడిబారిన, చిట్లిన వెంట్రుకల మరమ్మతులకు సహకరిస్తాయి.

చాలామంది చర్మం పట్ల చూపిన శ్రద్ధలో ఓ వంతు కూడా జుట్టుపట్ల చూపరు. ఇంట్లోనే చికిత్సలు చేసుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తారు. ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక టీస్పూన్‌ గ్లిజరిన్‌, రెండు మూడు చుక్కలు లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, పావు టీస్పూన్‌ వెనిగర్‌ కలిపి మాడు నుంచి, శిరోజాల కొసలదాకా అప్లయి చేయాలి.

జుట్టు రఫ్‌గా, పొడిగా ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. ఇవన్నీ కూడా శిరోజాలకు పోషకాలను ఇచ్చే పదార్థాలే. ఈ మిశ్రమాన్ని రాసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే షాంపు చేసుకోవాలి. రాత్రివేళ అతిగా ఉత్పత్తుల్ని అలాగే ఉంచేసి పడుకోవడం మంచిది కాదు.

ముఖంపై మేకప్‌ను ఏవిధంగా క్లీన్‌ చేసుకుని పడుకుంటారో అదే మాదిరి మాడునూ శుభ్రం చేసుకోవాలి. పగటివేళ ఏవైనా హెయిర్‌ ప్రొడక్ట్‌ను వాడినట్లయితే పడుకునే ముందు శిరోజాల్ని బాగా బ్రెష్‌ చేయాలి. లేదా క్విక్‌ వాష్‌ చేసుకుని, పరిశుభ్రమైన మాడుతో నిద్రకు ఉపక్రమించాలి.

కలర్‌ చేసినా లేదా ఏవిధంగానైనా కెమికల్‌ ట్రీట్‌మెంట్స్‌ చేయించుకున్నా అది ఆక్సిడైజ్‌ అవుతుంది. అలాగే విభిన్నవాసనలు, జిడ్డు, పగటివేళపడే దుమ్ము తాలూకు మురికి తలలో అలాగే ఉండిపోతే జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. ఆయిలింగ్‌ నైట్‌కేర్‌ రొటీన్‌లో మంచి ఆయిలింగ్‌ ప్రక్రియ ఉండాలి. రెండు మూతల అరోమాథెరపి ఆయిల్‌ను ఆలివ్‌ లేదా ఆల్మండ్‌ ఆయిల్‌తో కలిపి మసాజ్‌ చేసుకోవాలని, రాత్రంతా అలా వదిలేసి మర్నాడు షాంపు చేసుకోవాలని శిరోజాల నిపుణులు సూచిస్తున్నారు.

సాదా కొబ్బరినూనె కూడా వాడవచ్చు. అయితే అవసరానికి మించి అతిగా నూనె పెట్టవద్దు. ఇలా నూనెపెడితే, మరునాడు దానిని వదిలించుకోవడానికి ఎక్కువ షాంపు వాడాల్సి వస్తుంది.

దీనివల్ల జుట్టు డ్రైగా అయిపోతుంది. అప్పుడు పొడిజుట్టును అనువుగా మలుచుకోవాలన్న ప్రధాన ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. రాత్రి పడుకునే ముందు జుట్టును పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా అని, తలస్నానం చేసేసి తడిజుట్టుతో పడుకోకూడదు. తేలికపాటి, నీటి ఆధారిత మాయిశ్చరైజింగ్‌ లీవ్‌-ఇన్‌ కండిషనర్‌ ఓవర్‌నైట్‌ను వారానికి రెండుసార్లు వాడడం మంచి ప్రత్యామ్నాయం.

నాణ్యమైన నైట్‌రిపేర్‌ క్రీమ్‌, జిడ్డులేని కొబ్బరినూనె, రోజ్‌మేరీ ఆయిల్‌, జొజోబా ఆయిల్‌, కొబ్బరిపాల ప్రొటీన్‌, విటమిన్‌ బి5 వాడాలి. ఇవి మాడులో రక్తప్రసరణను పెంచుతాయి. శిరోజాలకు ప్రొటీన్‌ అందించి, జుట్టును జిడ్డుగా మార్చే అదనపు సెరం విడుదలను తగ్గిస్తాయి. చుండ్రు అవకాశాల్ని కూడా తగ్గిస్తాయి.

హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మీకు తెలియని కారణాలు

స్త్రీ మరియు పురుషులు ఎదుర్కొనే ఒక ప్రధాన జుట్టు సమస్య హెయిర్ బ్రేకేజ్. మీకు పొడవాటి జుట్టు ఉన్నట్లైతే ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది . హెయిర్ బ్రేకేజ్ అనేది ప్రధానంగా హెయిర్ డ్యామేజ్ వంటిదే. ఇది మీ జుట్టును మరింత రఫ్ గా మార్చుతుంది. దాంతో మీ జుట్టు చూడటానికి అనారోగ్యకరంగా ఉంటుంది.

హెయిర్ బ్రేకేజ్ కు కారణం స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, జుట్టు చిక్కుబడటం, ముడులు బడటం వల్ల జుట్టు మద్యలోనిక తెగిపోతాయన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. వీటివల్లే చాలా సులభంగా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. అలాగే తడి జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల కూడా, హెయిర్ బ్రేకేజ్ కు కారణం కావచ్చు. హెయిర్ బ్రేకేజ్ కు చిక్కు, ముడులు మాత్రమే కారణం కాదు, హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా దాగున్నాయి.

జుట్టు చిట్లడం మరియు చిట్లిన జుట్టు డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. హెయిర్ బ్రేకేజ్ మరియు హెయిర్ డ్యామేజ్ కు కొన్ని తెలియని కారణాలు క్రింది విధంగా ఉన్నాయి...

హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మీకు తెలియని కారణాలు



హార్డ్ వాటర్(కఠినమైన నీరు): మీజుట్టు శుభ్రతకు హార్డ్ వాటర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం జరుగుతుంది. దాంతో హార్డ్ వాటర్ లోని ఆల్కలైన్ వల్ల మీ జుట్టు పూర్తిగా తేమను కోల్పోతుంది. దాంతో హెయిర్ బ్రేకేజ్ చాలా సులభంగా జరుగుతుంది. ఆ జుట్టు చూడటానికి డ్యామేజ్ గా కనబడుతుంది.

ఫ్రిక్షన్(రాపిడి): మీ జుట్టుకు ఏదైనా రాపిడి కలిగినా కూడా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. మీరు కాటన్ పిల్లో(దిండు)ను ఉపయోగించినా, అప్పుడు మీ జుట్టు కాటన్ త్రెడ్ కు రాసుకోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ కు కారణం అవుతుంది.

జింక్ అండ్ ఐరన్ లోపం: కొన్ని సమయాల్లో, కొన్ని పోషకాలు లోపించడం వల్ల ఇంటర్నల్ గా కొన్నిపోషకాల లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ మొదలవుతుంది. ముఖ్యంగా జుట్టుకు సహాయపడే జింక్ మరియు ఐరన్ వంటి పోషకాంశాలు లోపం వల్ల కూడా మీ జుట్టు చిట్లడం మరియు బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కారణం వల్ల హెయిర్ బ్రేకేజ్ అవుతుంటే మీరు గుడ్డును మీ జుట్టుకు పట్టించడం మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను తీసుకోవడం ఉత్తమం.

ఓవర్ స్ట్రెచ్చింగ్: మీరు జుట్టును చాలా కఠినంగా వెనుకకు లాగడం?కొన్ని సందర్భాల్లో మీ జుట్టును వెనుకకు కఠినంగా లాగడం వల్ల అది జుట్టుయొక్క ఎలాసిటిని కోల్పోతుంది . కాబట్టి కొన్ని సమయాల్లో మీరు హెయిర్ స్టైల్స్ ను నివారించాలి. ప్రోటీన్ డైట్ లేకపోవడం వల్ల: మీ జుట్టు పెరుగుదలకు సాధారణంగా ప్రోటీనులు చాలా అవసరం అవుతాయి. మీరు రోజులో సరిపడా పోషకాంశాలు మీ రెగ్యులర్ డైట్ ద్వారా తీసుకోకపోతే, మీ హెయిర్ క్వాలిటీలో క్లియర్ గా కనిబడుతుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో లెగ్యుమ్స్ మరియు గుడ్డు వంటి ఆహారాలను తీసుకోవడం జుట్టు రక్షణ.

ఎండకు తిరగకూడదు: ఎక్కువ సమయం ఎండలో మీ జుట్టు ఎక్స్ పోజ్ అయినప్పుడు, ప్రోటీనులు కోల్పోవడంతో పాటు, హెయిర్ డ్యామేజ్ కూడా పెరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా జుట్టు మీద పడటం వల్ల జుట్టు పొడిబారడం ఎక్కువ అవుతుంది . ఫలితంగా మీ జుట్టు పొడిబారడం మరియు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది.

తప్పుగా దువ్వడం: మీ జుట్టును ఎక్కువగా దువ్వడం కొన్ని సందర్భాల్లో ఓకే అయినా, లేదా ఉపయోగించి దువ్వెన, ఎక్కువ సార్లు దువ్వడం వల్ల తల, జుట్టులో రాపిడి వల్ల, హెయిర్ బ్రేకేజ్ కు కారణం కావచ్చు.

Sunday, January 5, 2014

ముడుతలు రాకుండా ఉండాలంటే?

  
 
 వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు.

ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

1. గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

3. రోజ్ వాటర్తో చర్మం శుబ్రం చేసుకుంటే చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

5. పెరుగు చర్మం కణజాలాలు,కణాల రిపేరు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన విటమిన్లు కలిగి ఉంటుంది. పెరుగును రోజూ తింటే చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు మాస్క్ తయారుచేయటానికి ఒక కప్పు పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగు ముడుతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో కడగాలి. :