ఇంటిరియం
‘‘రాత్రి కర్టెన్లు వే సి, దీపాలు వెలిగించగానే నా పుస్తకాలకి ఒక గౌరవం వచ్చినట్లు భావిస్తాను’’ అంటాడు ఇంగ్లీష్ నవలారచయిత ఇ.ఎం. ఫాస్టర్. కర్టెన్ అనేది గదికి అందాన్ని ఇవ్వడంతో పాటు, హుందాతనాన్ని తీసుకువస్తుంది. కర్టెన్లకు శబ్దాన్ని నియంత్రించే గుణం ఉంది. కొన్నిరంగులు గదికి వెలుగును కూడా తీసుకువస్తాయి. అలాగే కర్టెన్ రాడ్‌లు కూడా కర్టెన్లకు సరికొత్త అందాన్ని సంతరిస్తాయి. రెండుమూడు రంగుల కర్టెన్లను పక్కపక్కన అమర్చడం లేటెస్ట్ ఫ్యాషన్. అటువంటప్పుడు కూడా కాంబినేషన్‌ల విషయంగా జాగ్రత్తపడాలి.
గదిలోని వస్తువులు, గోడల రంగులు, కర్టెన్లు, రాడ్‌లు అన్నీ ఒకదానితో ఒకటి కలిస్తేనే అందం. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ చిత్రంలో ఒక గదిని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉండే వస్తువులతో డెకొరేట్ చేశారు. ఆ గది అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. మన ఇల్లు కూడా ఇలా సర్దుకుంటే బాగుంటుందనే భావన కలిగేలా ఉంటుంది ఆ గది అమరిక.ఇక్కడ ఇచ్చిన కర్టెన్‌ల ధర సుమారు 3000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. |
No comments:
Post a Comment