all

Friday, May 17, 2013

మైక్రోవేవ్ ఓవెన్ గురించి కొన్ని విశేషాలు,వివరాలు..



లాభాలు:
1. అన్నం, కూరలు చిటికలో వేడి చేసుకోవచ్చు/వండుకోవచ్చు.

2. ఒక్క ళ్ళే వున్నప్పుడు మీ దగ్గర మైక్రో వేవ్ కుక్కర్ వుంటే దానిలో అన్నం వండుకోవచ్చు. (ఇది చిన్నది పెద్ద గా ఖరీదు కూడా వుండదు). ఇందులోనే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు.

3. కూరలు దీనిలో వేడి చేసుకున్నాప్పుడు చాలా ఫ్రెష్ గా వుంటాయి ముఖ్యం గా బంగాళ దుంప చికెన్ వంటివి.

4. పిల్లలకు అప్పటి కప్పుడు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కావాలని గోల పెడితే మనం చేసి ఇచ్చే నూడుల్స్ ఈ మైక్రోవేవ్ లో చాలా తొందర గా పోషకాహార విలువలు పోకుండా చేసుకోవచ్చు.

5. పిల్లలకు కేక్ ల వంటి వి కూడా తొందర గా చేసి ఇవ్వవచ్చు.



మనలో చాలా కామన్ గా వుండే అపోహలు ఈ మైక్రోవేవ్ గురించి:



1. దీని మూలం గా ఆరోగ్యం పాడైపోతుంది, ఇందులో నుంచి వెలువడే రేడియో యాక్టీవ్ తరంగాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.

2. ఇందులో ఆహారం సమం గా వుడకదు.

3. ఇందులో వండిన పదార్ధాలలో పోషకాహార విలువలు మాయం అవుతాయి.

4. ఇందులో ఏదో మిగిలి పోయిన కూరలు వేడి చేసుకోవటం తప్ప పెద్ద వుపయోగం లేదు, దాని కోసం అంత ఖర్చు పెట్టి కొనటం దండుగ.


పైన చెప్పిన అపోహలకు కొన్ని సమాధానాలు.
1. దీని మూలం గా ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమి లేదు, మనం సాధారణం గా అన్ని రకాల ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను రేడియో యాక్టీవ్ తరంగాలనే అంటాము. (రేడియో తరంగాలు, ఎక్స్ రే తరంగాలు, మైక్రోవేవ్స్, కాంతి తరంగాలు, ఆల్ట్రా వయొలెట్ తరంగాలు) కాని నిజానికి దాన్లో శక్తి వాటి వేవ్ లెంత్ తో కొలుస్తారు. హ్రస్వమైన (షార్ట్ వేవ్ లెంత్ ) కిరణాలకు ఎక్కువ శక్తి (ఎక్స్ రే, గామా రే), దీర్ఘ(లాంగర్ వేవ్ లెంత్) కిరణాలు తక్కువ శక్తి (మైక్రో వేవ్) ను బహిర్గతం చేస్తాయి. నిజానికి vhf uhf రేడియో తరంగాలకంటే మాత్రమె ఈ మైక్రోవేవ్ తరంగాలు బలమైనవి ఈ రకమైన కిరణాల కుటుంబం లో.

          అందుకనే ఏదైనా వేడి చేసే టప్పుడు దాని మీద మూత వుంచి వేడి చేస్తే సమం గా వేడి అవుతుంది, ఆహారం బిరుసేక్కినట్లు అవ్వదు (తేమ అలాగే వుంటుంది కాబట్టి) , అలాగే ఇది ఎటు వంటి ఆరోగ్య సమస్య లు కలిగించాడు.

2. పైన చెప్పిన సమాధానమే దీనికి కూడా, మనం మూత పెట్టి వండి/ వేడి చేసినప్పుడు ఇది చక్క గా సమ తుల్యం గా వుడుకుతుంది.



3. ఇందులో వండటం వలన పోషకాహార విలువలు వుండవు అనేది కేవలం ఒక అపోహ. నిజానికి దీని మూలం గా మనం పోషకాహార విలువలను వృధా చేయటం తగ్గుతుంది అని FDA అప్రువ్ చేసింది. దీనికి కారణం ప్రోటీన్ లు వుండే ఆహారం ఎక్కువసేపు పొయ్య మీద వేడి అవటం మూలం గా వాటిలోని A మరియు E వైటమిన్ లను కోల్పోయే ప్రమాదం వుంది కాని మైక్రోవేవ్ తో అలా కాదు ఎందుకంటే తొందర గా వేడి అవుతుంది కాబట్టి.


4. వుపయోగించుకోవటం తెలియాలే కాని ఇది నిజం గా చాలా సహాయకారి. దీనితో అన్నం కూరలు వేడి చేసుకోవటమే కాదు, అన్నం ఇడ్లీ వండుకోవచ్చు కూడా, అంతే కాదు మనం రోజు వండుకునే కూరలు వుదాహరణకు దొండకాయ పొయ్య మీద పెట్టి దానిని చాలా సేపు చాలా నూనె తో వేయించితే కాని మంచి రుచి రాదు కాని మైక్రోవేవ్ లో, కోసిన దొండకాయలను కొంచం వుప్పు కొంచం నీళ్ళు చిలకరించి మూత పెట్టి ఒక 5- 8 నిమిషాల మధ్య ( ఒక కిలో కాయలకు) వేడి చేసి తరువాత పొయ్య మీద వేసుకుంటే నూనె తక్కువ పడుతుంది తొందర గాను ఐ పోతుంది.

  రుచి కూడా చాలా బాగుంటుంది, పోషకాహార విలువలు పోవు తక్కువ సేపు వండుతున్నాము కాబట్టి. ఇలానే వంకాయ (ముఖ్యం గా గుత్తి వంకాయ కు), కేలిఫ్లవర్, క్యాబేజ్, తోట కుర, బీట్రూట్, కేరట్ వంటివి ఇలా చేస్తే చాలా మంచిది. (బెండకాయ మాత్రం ఇలా చేసి , నన్ను తిట్టవద్దు).

5. కాఫీ, టీ లు చాలా ఈజీ చెయ్యటం, ఒక కప్పు లో పాలు నీళ్ళు మీకు కావలసిన నిష్పత్తి లో కలుపుకుని దానిలో ఒక టీ బేగ్ వేసుకుని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోండి టీ రది. కాఫీ ఐతే ఈ పాలు , నీళ్ళు కలిపిన కప్ ను 2 నిమిషాలు వేడి చేసి బయటకు తీసి మీకు ఇష్టమైన బ్రూ నో నేస్కేఫ్ నో వేసుకుని పంచదార వేసి తిప్పుకుంటే కాఫీ కూడా రడి.




ట్రిక్స్:
1. మూత మామూలు పింగాణీ మూత కాకుండా ప్లాస్టిక్ లోనే మందమైనవి ప్రత్యేకం గా మైక్రోవేవ్ లో వేడి చేసుకునే వాటి మీద మూతల కోసం చేసినవి దొరుకుతాయి అవి వుపయోగించండి, తొందర గా సమం గా వేడి అవుతాయి.
2. పచ్చళ్ళు అస్సలు వేడి చెయ్యకండి వాటి రంగు రుచి కూడా పోతాయి.

3. మైక్రోవేవ్ లో స్టీల్ గిన్నెలు పెట్టకూడదు, ప్లాస్టిక్ దొరుకుతాయి వీలైనంత వరకు గోల్డ్ లైనింగ్ లేని పింగాణి, లేదా కార్నింగ్ వేర్ గిన్నెలు వాడండి. అవి మంచివి.

4. కొంచం ఎక్కువ మొత్తం గా వేడి చేస్తున్నప్పుడో లేదా చారు వంటి ద్రవ పదార్ధాలు వేడి చేసేప్పుడు లేదా చాలా కాలం గా ఫ్రిజ్ లో వున్నవాతినో వేడి చేసేప్పుడు మధ్య లో ఒక్క సారి డోర్ తీసి కలియబెట్టి మళ్ళీ వేడి చేస్తే చాలా సమం గా కింద వరకు ఒకేలా వేడి అవుతాయి.

5. పండగలప్పుడు పాయసం వంటివి చేసేప్పుడు బెల్లం తరుగు కోవటం ఒక పనే కదా, ఆ బెల్లం గడ్డ ను ఒక గిన్నెలో వేసి కొంచం నీటి చుక్కలు చిలకరించి మైక్రోవేవ్ లో 2 నిమిషాలు వేడి చేసి చూడండి బెల్లం పాకం రడీ.

6. చింతపండు నాన పెట్టటం మర్చి పోయారా పప్పు చారు లోకి. కొంచం చింతపండు గిన్నెలో వేసి కొంచం నీళ్ళు పోసి ఒక నిమిషం వేడి చేయండి (మూత మర్చి పోవద్దు), గుజ్జు రడీ.

7. పైన సూత్రమే పిల్లలకు తల అంటే టప్పుడు కుంకుడుకాయలు అప్పటికప్పుడు నాన పెట్టుకోవటానికి కూడా వుపయోగ పడుతుంది.

8. అంట్లు తోముకునే స్పాంజ్ తో చికెన్, రోయ్యాలో వండిన గిన్నెలో, చికెన్ కడిగి వుంచుకున్న గిన్నో, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిన పెనమో తోమి తరువాత దానితో పాల గిన్నె తోమాలంటే కొంచం ఇబ్బంది గానే వుంటుంది.

        వాసన ఒక చిరాకు, ఆ బేక్టీరియా మిగతా వాటికి వస్తుందేమో అని మనసు లో ఒకటే నస గా వుంటుంది. అది పోవాలంటే ఆ స్పాంజ్ ను తడిచేసి ఒక రెండు నిమిషాలు మైక్రోవేవ్ లో వేడి చేయండి. ఆ రేడియేషన్ కు బేక్టీరియా ఫ్రీ అవుతుంది అట, వాసన కూడా వుండదు.

9. కాఫీ టీ లు పెట్టుకునేప్పుడు ముందే పంచదార వేసి వేడి చేయకండి పంచాదర వేసి మైక్రోవేవ్ లో పెడితే పాలు పొంగి పోతాయి.

No comments: