all

Saturday, July 13, 2013

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

మీ కురులను సువాసనభరితంగా ఉంచే 10 చిట్కాలు...!

రెగ్యులర్ వాష్: మీ కేశాలకు రోజు విడిచి రోజు తలస్నానం చేస్తుండాలి. దాంతో కాలుష్యం దుమ్ము, ధూళి వల్ల పాడైన జుట్టును శుభ్రపరుచుకోవడానికి ఆల్టర్ నేట్ డేస్ లో తలస్నానం చేయడం చాలా ముఖ్యం. అలా కుదరనప్పుడు కనీసం రెండు రోజుకొకాసారైనా ప్రయత్నించాలి. ఇలా ఎప్పటికప్పుడు తలస్నానం చేయడం వల్ల కేశాలు శుభ్రపడటంతో పాటు మంచి వాసనను కలిగి ఉంటాయి.



నిమ్మరసం: నిమ్మరసం నేచురల్ సిట్రస్ స్మెల్ కలిగి ఉంటుంది. ఇది మీ కేశాలకు మంచి సువాసన కలిగి ఉండేలా చేస్తుంది. చుండ్రును వదిలించడంలో నిమ్మరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని తలకు పట్టించి, 10-15నిముషాల తర్వాత నాణ్యమైన షాంపూతో తలస్నానం చేసేసుకోండి.



రోజ్ వాటర్: రోజు వాటర్ ఒక మంచి ఆస్ట్రిజెంట్ లా పనిచేస్తుంది. ఇది మీ చర్మ సంరక్షణకు ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరి కేశాలకు, రోజ్ వాటర్ తో కేశాలకు అధనపు ప్రయోజనాలంటూ ఏమీ లేవు. అయితే, రోజు వాటర్ ను తలకు అప్లై చేయడం వల్ల సువాసన భరితంగా ఉంటుంది.



జాస్మిన్ ఆయిల్: జాస్మిన్(మల్లెపువ్వు)సువాసనలిచ్చే పువ్వుల్లో మల్లెపూల ప్రత్యేకత ఏంటో మనకు తెలిసిందే. కాబట్టి జాస్మిన్ ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం వల్ల మీ కేశాలు సువాసన భరితంగా ఉంచడమే కాదు, జుట్టు పెరుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది.



పువ్వులు: చాలా మంది మహిళలు తమ కురులకు సువాసన వచ్చేందుకు పువ్వులను ఎక్కువగా పెట్టుకుంటుంటారు. అయినప్పటికీ ఇవి కేశాలకు తగినంత నాణ్యమైన ప్రభావాన్ని కలిగించవు. ఇవి పెట్టుకొన్నప్పుడు, తర్వాత కొంత సమయం మాత్రమే వాసనను కలిగి ఉంటాయి.



మందార నూనె: మీ కేశాలకు మందార నూనె ఒక ఆరోగ్యకరమైన నూనె అని చెప్పవచ్చు. ఈ నూనె వల్ల మీ కేశాలను నల్లగా మార్చుతుంది. ఈ నూనె మీ కేశాలను నల్లగా మార్చడంతో పాటు, జుట్టు మూలలను బలోపేతం చేస్తుంది. మందార నూనెలో నేచురల్ సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి మీ కేశాలకు సహజ సువానను అందిస్తుంది.



స్మోక్డ్ ఎసెన్స్: ఆరోమా థెరఫీలో, ఆరోమాటిక్ ఆయిల్స్ ను బర్న్ చేస్తారు. బర్న్ చేసినప్పుడు వచ్చే పొగలో నేచురల్ వాసనలు వెదజల్లుతాయి. ఈ ఉపాయం పురాతన కాలం నుండి వస్తున్నది. కేశాలను సువాస భరితంగా మార్చుకోవడానికి, కొన్ని మూలికలు, లేదా పువ్వులు నిప్పులు మీద వేసి పొగబెట్టి పొడివాటి, మందపాటి కురులకు తగిలేలా చేసేవారు.



హెన్నా: కొంత మందికి హెన్నా వాసన అంటే మహా ఇష్టం మరి కొందరికేమో అయిష్టం. కాబట్టి, అది మీ వ్యక్తిగత ఎంపిక. హెన్నాను తలకు పట్టించడం ద్వారా కురులు అందంగా మరియు రెడ్ కలర్ మరియు చాలా ప్రత్యేకమైన వాసనను కూడా కలిగి ఉంటుంది.



టీ ఆకులు: మీకు డార్జిలింగ్ టీ యొక్క వాసన మీకు నచ్చుతుందా? మీకు నచ్చేటట్లైతే మీ కురులను లిక్కర్(టీఆకులను ఉడికించిన నీటితో)తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కేశాలను నల్లగా మార్చుతుంది మరియు ప్రత్యేక సువాసనను అంధిస్తుంది.



వేడికి దూరంగా ఉండాలి: వేడి వల్ల మీ తలలో ఎక్కువగా చెమట పడుతున్నట్లైతే, పైన చెప్పిన మార్గాలు ఏవీ మీ జుట్టును మంచి వాసన కలిగి ఉంచేందుకు సహాయపడుతాయి. కాబట్టి మీ జుట్టుకు వేడి తగలకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మరియు సాధ్యమైనంత వరకూ మీ తలను చల్లగా ఉంచుకునేలా చూసుకోవాలి.

No comments: