న్యూటన్ చెప్పినా, అనుభవం నేర్పినా సత్యం
ఒక్కటే.
నేలకు కొట్టిన బంతి అంతకన్నా బలంగా పైకి లేస్తుంది.
జీవితమనే బంతి
కోర్టులో ఉన్నప్పుడు
దాన్ని నేలకు కొడతారో, గోడకు కొడతారో
లాగిపెట్టి
ఆకాశంలోకి తంతారో ఎవరి చాయిస్ వాళ్లది.
డీలాపడితే ఢీకొట్టలేమన్న గ్రహింపు
ఉంది కాబట్టే
కొట్టిన బంతి కిందపడినప్పుడల్లా
ఎగిరి దాన్ని సక్సెస్
బాస్కెట్‌లో వేస్తున్నారు శ్రీనువైట్ల.గమనిస్తే
బాద్‌షా సినిమాలో బంతి జానకి ఫిలాసఫీకి రియల్ లైఫ్‌లో శ్రీను వైట్ల స్ట్రగులింగ్‌కి
మధ్య గీతలేదని తెలుస్తుంది. సినీఫీల్డ్‌లో తొలి గోల్ కొట్టడానికి ఆయన పడ్డ తపన
ప్రతి యాస్పిరెంట్ డెరైక్టర్‌కీ ఇన్‌స్పిరేషన్.
నా మొదటి సినిమా ‘నీకోసం’
షూటింగ్ ఏడాదిన్నర పాటు జరిగింది. కానీ వర్కింగ్ డేస్ మాత్రం... కేవలం ఇరవై ఎనిమిది
రోజులే. ఆ స్ట్రగుల్డ్ ఫేజ్‌లో ప్రతి మలుపూ నాకింకా గుర్తే. ఎన్ని నిద్రలేని
రాత్రులు! ఎన్ని నలిగిన పగళ్లు!
మొదట రాజశేఖర్ హీరోగా ‘అపరిచితుడు’ అనే
సినిమా మొదలుపెట్టాను. కొన్ని కారణాల వల్ల సినిమా మొదట్లోనే ఆగిపోయింది. ఏం చేయాలో
అర్థం కాలేదు. ఈ గ్యాప్‌లో ఒకసారి ఓ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు తన ప్రేమ
సమస్యను నాతో చెప్పాడు. తను ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నాడనే కారణంతో అమ్మాయి
తండ్రి తమ ప్రేమకు అడ్డు చెబుతున్నాడని, అతన్ని ఏదైనా చేయాలనిపించేంత కోపంగా ఉందని
అన్నాడు. వాడు తన ప్రేమ గురించి చెప్పగా చెప్పగా విని, దీన్ని ఒక కథలా మలిస్తే
బాగుంటుందనిపించింది.
ఐడియాను డెవలప్ చేసి ‘నీకోసం’ అని టైటిల్ పెట్టాను.
దాన్ని లో-బడ్జెట్‌లో చేయాలనుకున్నాను. చిన్న సినిమా అయితే, నన్ను నేను ఫ్రూవ్
చేసుకోవడానికి అవకాశం ఉంటుదని నా నమ్మకం. ఈ క్రమంలో నా ఆలోచనలను కెమెరామెన్
అరవింద్‌తో చెప్పాను. ఒక సందర్భంలో ఎవరో కొత్త నిర్మాతలు లో-బడ్జెట్‌లో సినిమా
నిర్మించాలనుకుంటున్నారని చెప్పాడు తను. అతని ద్వారా వాళ్లను కలిసి కథ చెప్పాను.
వాళ్లకు నచ్చింది. సినిమా చేద్దామని ఉత్సాహం చూపించారు. ఈ కథకు రవితేజ హీరో అయితే
బాగుంటుందన్నాను. ఓకే అన్నారు. అప్పటికే ‘సింధూరం’ రిలీజయింది. అది చూశాక, హీరో
క్యారెక్టర్‌కి రవితేజ సరిగ్గా సరిపోతాడనిపించింది. వెంటనే వెళ్లి కథ చెబితే,
తనక్కూడా బాగా నచ్చింది. ‘గులాబి’తో మంచి పేరు తెచ్చుకున్న మహేశ్వరిని హీరోయిన్‌గా
అనుకున్నాం. బ్రహ్మాజీ, ఉత్తేజ్, శివాజీరాజా, జయప్రకాశ్‌రెడ్డిని ఇతర ప్రధాన
పాత్రలకు ఎంపిక చేశాం. ప్రతిదీ మా బడ్జెట్ పరిధిలో ఉండేట్టు చూసుకుని షూటింగ్
మొదలుపెట్టాం.
అనూప్ హౌస్‌లో మొదటిరోజు షూటింగ్. లో-బడ్జెట్ ఫిల్మ్ అని
రిక్వెస్ట్ చేస్తే, పైన పెంట్‌హౌస్, టైతో కలిపి రోజుకు మూడువేల రూపాయలకు
అద్దెకిచ్చారు. అప్పుడున్న పరిస్థితుల మేరకు మేం దాన్నే చాలా కాస్ట్‌లీ లొకేషన్‌లా
ఫీైలయ్యాం. ఒక్క రోజులో హీరో ఇంటికి సంబంధించిన సీన్లన్నీ ఫినిష్ చేశాం. తరువాత
బడ్జెట్ ప్రాబ్లమ్స్ కారణంగా, రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయింది. ఎప్పుడు డబ్బులు
దొరికితే అప్పుడు, ఫ్రీ లొకేషన్ వెతుక్కుని షూటింగ్ చేసేవాళ్లం. ఆ క్రమంలో ఎన్నో
మరిచిపోలేని అనుభవాలు.
ఒక సీన్
కచ్చితంగా రైల్వేస్టేషన్‌లో తీయాల్సి ఉంది. అనుమతి కోసం అయ్యే ఖర్చును భరించేంత
బడ్జెట్ మా దగ్గర లేదు. యూనిట్ అంతా బేగంపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లాం. ప్లాట్‌ఫామ్
టికెట్ తీసుకుని లోపలికెళ్లి, డాక్యుమెంటరీ తీయడానికి వచ్చామని స్టేషన్ మాస్టర్‌కు
చెప్పాం. ఒకప్పుడు రైల్వేస్టేషన్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా డెవలప్ అయ్యాయి అని
కంపేర్ చేస్తూ డాక్యుమెంటరీ అని కన్విన్స్ చేసేశాం.
ఒకపక్క ఆందోళన, మరోపక్క
భయం. ఎవరైనా కనిపెట్టకముందే ముగించాలని స్పీడ్‌గా షూట్ చేస్తున్నాం. అంతలో అక్కడ
పనిచేసే ఓ కుర్రాడు రవితేజ, మహేశ్వరిని గుర్తుపట్టి షూటింగ్ జరుగుతుందని కంప్లయింట్
చేశాడు. ఆలోపు మా పని పూర్తిచేసుకుని అక్కడి నుండి బయటపడ్డాం. అలా దాదాపు
ఏడాదిన్నరపాటు ఎప్పుడు కుదిరితే అప్పుడు షూటింగ్ చేస్తూ వచ్చాం.
విలేజ్
షాట్స్ వరంగల్ దగ్గర కల్లెడ ప్రాంతంలో తీశాం. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఒకటైతే,
చివరి రోజు మాత్రం అసలు మర్చిపోలేనిది. బ్యాలెన్స్ ఉన్న ఏడు సన్నివేశాలనూ ఆ రోజు
ఎట్టి పరిస్థితుల్లోనూ షూట్ పూర్తిచేయాలి. ఇంకోరోజు షూటింగ్ ఎక్స్‌టెండ్ చేసే
పరిస్థితి కాదు. పొద్దుట్నుంచీ ఆపకుండా షూట్ చేస్తూనే ఉన్నాం.
రాత్రి
నాలుగయింది. యూనిట్ అంతా నామీద చాలా కోపంగా ఉన్నారు. నేను మాత్రం పని చేసుకుంటూ
పోతూనే ఉన్నాను. సడెన్‌గా ఫిల్మ్ అయిపోయింది. అందరూ షూటింగ్ అయిపోయిందనుకుని ఊపిరి
పీల్చుకున్నారు. నేను ప్యాకప్ చెప్పకుండా స్కూటర్ మీద కృష్ణానగర్ వెళ్లి ఫ్యూజి
ఫిలిం డిస్ట్రిబ్యూటర్ నాగరాజును నిద్రలేపాను. డబ్బులు తరువాత ఇస్తానని చెప్పి
వచ్చేశాను. ఇదంతా కేవలం అరగంటలో జరిగింది. నేనా టైమ్‌లో ఫిలిం తేవడం చూసి యూనిట్లో
ఆశ్చర్యపోయారు. లాస్ట్ షాట్ అయ్యాక, నా పట్టుదలకు యూనిట్ అంతా పెద్దగా చప్పట్లు
కొట్టారు.
గతంలో నా మొదటి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈసారి కూడా అలా
జరగకూడదనే పట్టుదల, కసితో ‘నీకోసం’ పూర్తిచేశాను. సినిమా నడుస్తుందా, నడవదా అని
ఎలాంటి లెక్కలూ వేసుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను.
ఎడిటింగ్ రూమ్ నుంచి స్కూటర్ మీద క్యాన్స్ తీసుకెళ్లి డబ్బింగ్ చెప్పించేవాణ్ని.
అలా ఎన్నో ఇబ్బందులు అధిగమించి సినిమా పూర్తి చేశాను. ఆ శ్రమంతా ఫస్ట్ కాపీ
చూసినప్పుడు మర్చిపోయాను.
ఫిలిం చాంబర్‌లో ఫస్ట్ కాపీ చూసినప్పుడు పొందిన
థ్రిల్‌ను మళ్లీ ఎప్పటికీ పొందలేను. అప్పటికి నామీద రామ్‌గోపాల్‌వర్మ, మణిరత్నంల
ప్రభావం తీవ్రంగా ఉండేది. ‘నీకోసం’ మేకింగ్‌లో ఆ ఛాయలు చాలా కనిపిస్తాయి.
అప్పట్లో డెరైక్టర్‌గా నాకెలాంటి బ్రాండ్స్ లేవు కాబట్టి, చాలా డిఫరెంట్‌గా
తీయడానికి ట్రై చేశాను. ఫిలింలో ఒక జెన్యూనిటీ కనిపిస్తుంది. మ్యూజిక్ డెరైక్టర్‌గా
ఆర్.పి.పట్నాయక్‌కు ఇదే మొదటి సినిమా. మొదట ఆగిపోయిన ‘అపరిచితుడు’ సినిమాకు
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డెరైక్టర్. ఈ సినిమా టైమ్‌కు అతను మద్రాస్‌లో ఉండటంతో
ఆర్.పి. తెరమీదకి వచ్చాడు. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్‌కు మంచి పేరు వచ్చింది.
నా మొదటి సినిమానే ఏడు నందులు గెలుచుకోవడం నిజంగా మర్చిపో లేనిది. ఈ సినిమా
చూసి నాగార్జునగారు నాకు డెరైక్షన్ చాన్స్ ఇచ్చారు. ‘ఆనందం’ సినిమా చేసే అవకాశమూ
దొరికింది. మయూరి ఫిలింస్ 65 లక్షలకు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో అప్పటిదాకా మేం
పడ్డ ఆర్థిక ఇబ్బందులు కూడా తీరిపోయాయి.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి
No comments:
Post a Comment