సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉరుకులు పరుగుల జీవితం అలవాటై పొయి... పూర్తిగా యాంత్రికంగా మనిషి బతికేస్తున్న క్రమంలో స్త్రీలు సైతం ఆర్ధిక కారణాల దృష్ట్యా ఉదోగం చేయాల్సి రావటంతో పట్టణ ప్రాంతాలలోనే కాదు గ్రామీణ ప్రాంతాల మహిలలు సైతం తమ శిరోజాల సంరక్షణకు కేటాయించే సమయం బాగా తక్కువై పోయింది.ప్రతి నిత్యం కురులకు నూనె కూడా రాసుకోలేని వారు కొందరైతే...
ట్రేండు, స్టైల్ అంటూ ఆధునికత పేరుతో కురుల సంరక్షణకి సమయాన్ని కేటాయించక ఎలా పడితే అలా అనేక రకాల రంగులలో ముంచెత్తుతుండటంతో వాటి కురులు చిట్లిపోవటం, కట్ అవ్వడం, రాలిపోవటం ప్రారంభించి చివరికి బట్ట తల కూడా వచ్చే అవకాశాలు బొలెడు ఉన్నాయి. అయితే మరి కొందరు కనీసం అప్పుడప్పుడు తలంటు కొని కేశ సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తున్నా... వెంట్రుకలు రాలుట, చిక్కు తీసుకొనుట మొదలైన ప్రక్రియ లపైనే శ్రద్ధ వహిస్తుంటే... మరి కొందరు స్పాః ట్రీట్‌మెంట్‌ని ఆశ్రయించేందుకు మక్కువ చూపు తాన్నారు.
అయితే ఈ ప్రక్రియ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా దానివలన పొందే ప్రయోజనం ఎక్కువకాలం ఉండదని... దాని కన్నా ఇంట్లో తీసుకునే సంరక్షణ చర్యలే కురులకు మేలు చేకూరుస్తాయని బ్యుటీషియన్లు సైతం అంగీకరి స్తున్నారు.
ముఖ్యంగా చిక్కుబడ్డ జుట్టు చూడటానికి నిర్జీవంగా మరియు అశుభ్రతతో కనిపిస్తుంది. హెయిర్ వాష్ చేసుకొన్న తర్వాత చిక్కుబడ్డ జుట్టును నిర్వహించడానికి చాలా కష్ట అవుతంది. అందుకు కెమికల్ ట్రీట్మెంట్లకు ఎంత డబ్బు ఖర్చుచేసిన ఫలితం మాత్రమే తాత్కాలికమే. కొన్ని సార్లు, జుట్టుకు తగినంత తేమ అందకపోవడం, హెయిర్ కేర్ తీసుకోకపపోవడం వల్ల హెయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. చిక్కుబడ్డ జుట్టు పొడిబారి, వికారంగా కనిపిస్తుంది. చిక్కుబడ్డ జుట్టును మ్యానేజ్ చేయాలంటే చాలా కష్టం. మీ జుట్టుకు తగినంత తేమఅంధించడానికి, నేచురల్ షైన్ పొందడానికి మరియు మెరుస్తుండాలంటే కొన్ని సాధారణ వంటగది వస్తువులు ఉపయోగపడుతాయి. మెయోనైజ్ బాగా సహాయపడుతుంది.
అవొకాడో, గుడ్డు, అరటిపండు వంటివి చిక్కుబడ్డ జుట్టును మ్యానేజ్ చేయవచ్చు. మరి చిట్కాలేంటో ఒక సారి పరిశీలిద్దాం..

1. అరటిపండు: అరపండును బాగా గుజ్జులా చేసి రెండు టీస్పూనులన బాదం, మరియు అవొకాడో ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీజుట్టుకు బాగా పట్టించి 20-25నిముషాలు అలాగే ఉండనిచ్చి, తర్వాత కడిగేయాలి. దాంతో కేశాలు స్మూత్ గా మరియు మ్యానేజ్ బుల్ గా ఉంటాయి. మరియు మంచి నేచురల్ షైనింగ్ వస్తుంది.
2. పెరుగు: అనేక జుట్టు సమస్యలను నివారించడంలో అద్భుతంగా ఉపయోగపడే వస్తువు పెరుగు. జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల, పొడి జుట్టు, నిర్జీవం మరియు చిక్కు తొలగిపోతుంది. పెరుగును అలాగే అప్లై చేయండి లేదా ఇతర హెయిర్ ప్యాక్ లతో చేర్చి అప్లై చేయండి.
3. అవొకాడో: డ్రై హెయిర్ ను నివారించడానికి మరియు నేచురల్ గా మాయిశ్చరైజ్ చేయడానికి , అవొకాడో బాగా సహాయపడుతుంది. చిక్కు బడ్డ జుట్టును నివారిచడానికి అవొకాడోను మెత్తగా చేసి అందులో పెరుగు మిక్స్ చేసి వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి సాఫ్ట్ హెయిర్ పొందవచ్చు.
4. మయోనైజ్: ఇది ఒక మంచి నేచురల్ కండీషనర్. దీర్ఘకాలిక ఫలితాలను అంధించడంలో ఇది బాగా సహాయపడుతుంది. మోయోనైజ్ ను తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
5. నిమ్మరసం: నిమ్మరసం జుట్టును శుభ్రం పరచడంతో పాటు, జుట్టుకు పోషనను అంధిస్తుంది . మీ హెయిర్ మాస్క్ లలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయండి.
6. బీర్: ఇది ఒక నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది జుట్టును సాఫ్ట్ గా చేస్తుంది. చిక్కుబడిన, పొడిబారిన జుట్టును బీర్ తో కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
7. వెనిగర్: చిక్కును వదిలించుకోవడానికి ఇది మరొక ఉత్తమ మార్గం. వాటర్ తో పాటు, వెనిగర్ మిక్స్ చేసి తలను శుభ్రం చేసుకోవాలి . దాంతో జుట్టు సాఫ్ట్ గా మరియు మ్యానేజబుల్ గా ఉంటుంది.
8. తేనె: తేనెలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నా . చిక్కుబడ్డ జుట్టును నివారించడానికి బెస్ట్ హోం రెమడీ తేనె . హెయిర్ మాస్క్ లలో మిక్స్ చేసి వేసుకోవడం వల్ల చిట్లిన జుట్టును కూడా నివారించుకోవచ్చు.
9. గుడ్లు: జుట్టు సాఫ్ట్ గా మరియు సిల్కీగా మారుతుంది. జుట్టు సంరక్షణకు గుడ్డు ఒక ఉత్త బ్యూటీ వస్తువు.
10. హాట్ ఆయిల్ మసాజ్: డ్రై అండ్ డల్ హెయిర్ నివారించడానికి ఒక ఉత్తమ పద్దతి హాట్ ఆయిల్ మసాజ్ . బాదం ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో మాసాజ్ చేయండి.
No comments:
Post a Comment