all

Monday, January 14, 2013

ముగ్గులొలికే సంక్రాంతి (ముగ్గు-ముచ్చట)

నీలాకాశం నిండా తమను తీర్చారేగానీ తీరుగా మలచలేదని దేవతలపై కినుకబూనాయేమో తారకలు! భువికి తీసుకెళ్లమని వనితలను వేడుకున్నాయేమో చంద్రికలు! భానోదయ వేళ భవ్యంగా వెలిగిపోవడానికి పచ్చని వాకిళ్లలో పడతుల కొనగోటి ఆజ్ఞకు కుదురుగా కూర్చున్నాయి తారకలు.

చుక్క చుక్కనూ కలుపుకుంటూ చమక్కుమన్నాయి చంద్రికలు.మేమూ మీ జట్టే అంటూ వచ్చి చేరాయి వర్ణాల హరివిల్లులు. ఆకాశం వెలవెలపోయింది. నేలమ్మ సింగారాలతో మురిసిపోయింది. తీర్చిదిద్దిన రంగవల్లికలను చూసుకున్న మగువల మనసులు అంబరాన్ని తాకితే వెన్నెలల వదనాలు వర్ణశోభితమయ్యాయి.ఆ సంబరం... సంక్రాంతి ముంగిలికి స్వాగతం పలుకుతూ ఇలా రాగరంజితమైంది.




















No comments: