సంక్రాంతిని సూర్యరథం ఎక్కించి తెచ్చేది ఉత్తరాయణం.
ధాన్యం ఎడ్లబండిలో ఇంటి ముందు దిగితే...
అది స్వీటాయణం!
కజ్జికాయలు, కరకజ్జం, అరిసెలు, సకినాలు, జాంగ్రీలు, జంతికలు...
పంచుకుంటే పండుగ.
పంచిపెడితే తియ్యని ఆనందాలే నిండుగ!జాంగ్రీకావలసినవిమినప్పప్పు - 250 గ్రా.,
బియ్యం - గుప్పెడు, పంచదార - అరకేజీ
మిఠాయి రంగు - చిటికెడు,
నెయ్యి/నూనె - తగినంత
తయారిమినప్పప్పు, బియ్యం 4 గంటలు నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పంచదారలో కప్పుడు నీళ్లు పోసి, తీగపాకం పట్టి, మిఠాయిరంగు వేసి కలిపి, పక్కన పెట్టాలి. మందపాటి వస్త్రానికి రంధ్రం చేసి, అంచులు కుట్టి అందులో ఈ పిండి వేసి నాలుగుమూలలా కలిపి మూటలాగ పట్టుకొని, కాగుతున్న నూనెలో పిండిని చుట్టలుగా ఒత్తుకోవాలి. రెండువైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి, పాకంలో వేయాలి. అలా అన్నీ చేసి, రెండుగంటలు పాకంలోనాననిస్తే జాంగ్రీలు మృదువుగా అవుతాయి.
చేగోడీలు కావలసినవిబియ్యప్పిండి - మూడు కప్పులు, శనగపప్పు - కప్పు
కారం - టేబుల్ స్పూన్, నీళ్లు - ఒక కప్పు
వెన్న - కొంచెం, నూనె - పావుకిలో, ఉప్పు - సరిపడినంత
తయారిగిన్నెలో నీళ్లు పొసి, పొయ్యిమీద పెట్టి బాగా మరిగిన తరువాత అందులో కొంచెం వెన్న, కారం, ఉప్పు, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. చల్లారాక ఆ పిండి ముద్దను పీటమీద పొడవుగా చేసి వాటికి శనగపప్పు అద్ది చిన్న చిన్న రౌండ్లుగా చుట్టుకుని నూనెలో వేయించాలి.
కజ్జికాయలుకావలసినవిమైదా/గోధుమపిండి - కేజీ, నువ్వులు - కేజీ, బెల్లం - 800 గ్రా.
ఏలకులు - 10 గ్రా., జీడిపప్పు - 100 గ్రా. నెయ్యి/నూనె - తగినంత
తయారిపిండిలో తగినన్ని నీళ్లు పోసి, చపాతీ ముద్దలా కలిపి పక్కన ఉంచా లి. నువ్వులను దోరగా వేయించి, చల్లారిన తర్వాత కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. దీంట్లో పొడి చేసిన బెల్లం తరుగును, ఏలకుల పొడిని కలపాలి. గోధుమపిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని, పూరీలా వత్తి, అచ్చు(సాంచీ)లో పరిచి, టీ స్పూన్ కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని దాంట్లో పెట్టి, చివర్లు మూయాలి. కజ్జికాయ ఆకారం వచ్చిన దాన్ని కాగుతున్న నూనెలో రెండువైపులా దోరగా వేగనివ్వాలి. జీడిపప్పు, పిస్తాపప్పు పలుకులతో అలంకరించాలి.
బెల్లం పట్టీలు కావలసినవి బెల్లం - అర కేజీ, పల్లీలు - అరకేజీ,
నువ్వులు - పావుకేజీ, ఏలకుల పొడి - అర టీ స్పూన్
నెయ్యి - తగినంత, నీళ్లు - గ్లాసుడు
తయారిపల్లీలను వేయించి, పైన పొట్టు తీసి, బరువైన వస్తువుతో ముక్కలు అయ్యేలా చేయాలి. ఇలా చేస్తే గింజ పప్పుగా అవుతుంది. విడిగా నువ్వులను దోరగా వేయించి, పక్కన ఉంచాలి. నీళ్లలో, బెల్లం వేసి కరిగించి, వడబోసి, పాకం పట్టాలి. అందులో ఏలకులపొడి, పల్లీలు, నువ్వులు, నెయ్యి వేసి కలపాలి. ప్లేట్‌కు నెయ్యి రాసి, పల్లీలు కలిపిన బెల్లం మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా అదమాలి. కొద్దిగా ఆరిన తర్వాత చాకుతో కావలసిన పరిమాణంలో కట్‌చేసి, పూర్తిగా ఆర నివ్వాలి.
సకినాలు కావలసినవిబియ్యం - 4 కప్పులు, వాము - పావు కప్పు
నువ్వులు - అర కప్పు, ఉప్పు - తగినంత
తయారిబియ్యాన్ని మూడు, నాలుగుగంటలు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, మరో మూడుగంటలు పలచని వస్త్రంపై ఆరబోయాలి. తర్వాత పిండి పట్టించాలి. ఈ పిండిలో వేయించిన నువ్వులు, వాము, ఉప్పు వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసుకుంటూ, పిండిని ముద్దలా కలపాలి. తగినంత పిండి ముద్దను తీసుకొని ప్లాస్టిక్ కవర్ లేదా పలచని వస్త్రం మీద వలయాకారంగా చేత్తో చుట్టాలి. ఇలా చేసిన వాటిని కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి తీయాలి.
నువ్వుల అరిసెలుకావలసినవిబెల్లం - కేజీ, నీళ్లు - గ్లాసుడు
బియ్యప్పిండి - 3 కేజీలు,
తెల్ల నువ్వులు - 150 గ్రా., నూనె - తగినంత
తయారి: బియ్యాన్ని నీళ్ళలో ఒకరోజు ముందుగా నానబెట్టాలి. మరుసటిరోజు బియ్యాన్ని వడకట్టి, పిండి పట్టించాలి. ఆ పిండిని రెండుసార్లు జల్లెడపట్టి తడి ఆరకుండా మూతబెట్టి ఉంచాలి. బెల్లం తురిమి గిన్నెలో వేసి, నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగాక వడపోయాలి. వడపోసిన బెల్లం నీటిని పొయ్యి మీద పెట్టి గట్టి పాకం పట్టాలి. ఈ పాకంలో రెండుస్పూన్ల నూనెవేసి, పిండి కొద్ది కొద్దిగా వేస్తూ, ఉండలు లేకుండా కలపాలి. (పిండి సరిపడినంత మాత్రమే వాడాలి) ఆ పిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుంటూ, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, నువ్వులు అద్ది, రెండుచేతులతో అదిమి, కాగుతున్న నూనెలో వేసి, లేత బంగారు వర్ణం వచ్చేవరకూ వేయించాలి. వేగిన అరిసెలను అరిసెల చెక్కమీద ఒత్తి పక్కన ఉంచుకోవాలి. వాటిని కొద్దిసేపు చల్లారనిచ్చి డబ్బాలో పెట్టుకోవాలి. బెల్లం, నువ్వులు కలిపి చేసిన అరిసెలు ఎంతో బలం, ఆరోగ్యం.
బెల్లం అచ్చులు / కరక జ్జం కావలసినవిశనగపిండి - కప్పు, బియ్యప్పిండి - కప్పు
బెల్లం - రెండు కప్పులు, ఏలకుల పొడి - టీ స్పూన్
నూనె - ఆర కేజీ
తయారిశనగపిండి, బియ్యప్పిండి కలపాలి. ఈ పిండిలో నీళ్లు పోసి, గరిటజారుగా కలపాలి. కడాయిలో నూనె పోసి, కాగిన తర్వాత పైన బూందీచట్రం పెట్టి, కలిపిన పిండిని దానిమీదుగా పోస్తూ బూందీ తయారుచేసుకోవాలి. విడిగా బెల్లాన్ని ఉండపాకం రానిచ్చి, అందులో ఏలకుల పొడి, తయారుచేసిన బూందీని వేసి కలపాలి. తరువాత ఒక ప్లేటుకు నూనె లేక నెయ్యి పూసి, కలిపిన బూందీని ఆ ప్లేటులో వెడల్పుగా పరచాలి. ఆరిన తరువాత, ఆ అచ్చులను తీసి, డబ్బాలో భద్రపరుచుకోవాలి.
జంతికలుకావలసినవిబియ్యప్పిండి - నాలుగు కప్పులు
వాము - రెండు స్పూన్లు
నువ్వులు - నాలుగు టీ స్పూన్లు
మినప్పప్పు - అరకప్పు
వెన్నపూస - పెద్ద నిమ్మకాయంత
కారం - టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడినంత
నూనె - అరకిలో
నీరు - తగినంత
తయారిముందుగా మినప్పప్పును వేయించి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో బియ్యప్పిండి, వెన్న, నువ్వులు, కారం, ఉప్పు అన్నింటినీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి పిండి కలిపి పక్కన ఉంచుకోవాలి. కొంచెం కొంచెం పిండిని జంతికల గొట్టంలో పెట్టుకుని కాగిన నూనెలో చిన్న చిన్న చుట్టలుగా ఒత్తి గోధుమ వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి, తీయాలి.
కర్టెసీ
రావి రాధాబాయిసేకరణ
శీతాల శివాజీ
న్యూస్‌లైన్, విజయవాడఫొటోలు: ఎం. రాజేంద్రమోహన్
No comments:
Post a Comment